New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more

ఎవరిది ప్రేమ?

38 stories Completed Love Family Drama Social Drama

ఉదయం ఆరు గంటల సమయం ....పూజ గదిలో నుండి పూజ పూర్తి చేసుకుని హారతి పళ్లెం తీసుకుని  బయటకి వచ్చి కుర్చీలో కూర్చుని పేపర్ లో వార్తలు చదువుతున్న ఆమె భర్త "వివేక్" దగ్గరకి వచ్చి హారతి  ఇచ్చి  అక్కడ నుండి వెళ్తూ వెళ్తూ ఏమండోయ్  ఈరోజు కాస్త నన్ను గుడి కి తీసుకెళ్లరు అని అడుగుతుంది "వసుధ"..ఆమె మాటకి వివేక్ పేపర్ లో దూర్చిన తల పైకెత్తి  ఏంటోయ్ ఇంత పొద్దు పొద్దున్నే  గుడి అంటున్నావు ఏంటి విశేషం అని అడుగుతాడు....ఆ ప్రశ్నకి ఏం లేదండి ఈరోజు కార్తీక సోమవారం కదా శివాలయం వరకు వెళ్లి, ఉసిరి చెట్టు కింద నెయ్యి దీపం వెలిగించి  ఆ శివయ్యని దర్శించుకుని వద్దాం అని అంతే…

Browse Stories

ఎవరిది ప్రేమ?

ఎవరిది ప్రేమ? – 1

ఉదయం ఆరు గంటల సమయం ….   పూజ గదిలో నుండి పూజ పూర్తి చేసుకుని హారతి పళ్లెం తీసుకుని  బయటకి వచ్చి కుర్చీలో కూర్చుని పేపర్ లో వార్తలు చదువుతున్న ఆమె భర్త “వివేక్” దగ్గరకి వచ్చి హారతి  ఇచ్చి  అక్కడ నుండి వెళ్తూ వెళ్తూ ఏమండోయ్  ఈరోజు కాస్త నన్ను గుడి కి తీసుకెళ్లరు అని అడుగుతుంది “వసుధ”..   ఆమె మాటకి వివేక్ పేపర్ లో దూర్చిన తల పైకెత్తి  ఏంటోయ్ ఇంత పొద్దు […]

3 min 67 views
ఎవరిది ప్రేమ?

ఎవరిది ప్రేమ? – 2

మేడపైకి వెళ్లిన వసుధ అక్కడ కనిపిస్తున్న దృశ్యానికి నిలబడి అలానే చూస్తూ ఉండిపోయింది…     ఎందుకంటే మేడ పైన వేసి ఉన్న పరుపు మీద ఒక ఇరవై ఏళ్ల అమ్మాయి నోట్లో వేలు వేసుకుని చప్పరిస్తూ, రాత్రి చదువుతూ చదువుతూ నిద్రపోయింది అన్నదానికి గుర్తుగా తన గుండెలపైన పుస్తకాన్ని అలానే ఉంచుకుని,కాళ్ళు రెండు ముడుచుకుని ఎంతో ముద్దుగా పడుకుని ఉంటుంది..   ఆ దృశ్యం చూడడానికి ఎంతో ముచ్చటగా కనిపిస్తుంది….   అందుకే వసుధ ముద్దుగా, అమాయకంగా పడుకుని ఉన్న […]

4 min 37 views
ఎవరిది ప్రేమ?

ఎవరిది ప్రేమ? – 3

ఆద్య కాలేజీకి వెళ్ళగానే తన ఫ్రెండ్స్ తన దగ్గరకి వస్తూ నవ్వుతూ హాయ్ చెప్పి గుడ్ మార్నింగ్ అని విష్ చేసి మాట్లాడుతూ ఉంటారు..   అబ్బాయిలు మాత్రం కాలేజీ బస్సు దిగిన ఆద్యని అలానే గుడ్లప్పగించి మరీ చూస్తూ అబ్బా ఏమన్నా ఉంటుందిరా ఈ ఆద్య.. ఆ కళ్ళు, ఆ ముక్కు, ఆ లిప్స్ ఒకటేంటిలే టోటల్  మనిషే సూపర్ గా ఉంటుంది…   ఆ బ్రహ్మ అందమంతా పోత పోసి మరీ మన ఆద్య ని తయారు […]

5 min 49 views
ఎవరిది ప్రేమ?

ఎవరిది ప్రేమ? – 4

రాఖీ క్లాస్ లోకి వచ్చి ఒక బెంచ్ లో కూర్చుని, తన పక్కన వాళ్ళని పరిచయం చేసుకుంటాడు..తర్వాత క్లాస్ లో ఉన్న వాళ్ళందరిని ఒకసారి చూస్తూ ఆద్యని చూశాక ఒక సెకన్ పాటు అలానే చూసి,వెంటనే తల తిప్పేసి క్లాస్ వినే పనిలో పడ్డాడు….   ఆద్య పాప ముందు నుండే క్లాస్ వినడంలో ఫుల్ లీనం అయిపొయింది లెండి..ఏం పట్టించుకునే పరిస్థితుల్లో లేదు….   క్లాస్ లో ఉన్న అమ్మాయిలు మాత్రం రాఖీ అందానికి ఫ్లాట్ అయి […]

3 min 21 views
ఎవరిది ప్రేమ?

ఎవరిది ప్రేమ? – 5

ఓహ్ అవునా…ఏంటి సార్ చెప్పండి అని అంటుంది ఆద్య…   అప్పుడు ప్రిన్సిపాల్  ఆమె వైపే చూస్తూ ఆద్య నాకు నీ హెల్ప్ కావాలి చేస్తావా అంటాడు…    అయ్యో మీరు అలా అంటున్నారు ఏంటి సార్.. అయినా నేను మీకు ఏం హెల్ప్ చేయగలను అంటుంది అయోమయంగా ఫేస్ పెట్టి సార్ ఏం అడగాలనుకుంటున్నారో అర్ధం కాక …     ఆద్య ఫేస్ చూసిన సార్ చిన్నగా నవ్వుతూ ఎస్ ఆద్య నాకు ఈ హెల్ప్ […]

4 min 27 views