New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more

ఏమండోయ్ మాస్టారు 💞

25 stories Completed Romance Family Drama Suspense

ఉదయం తొమ్మిది గంటలు....@@@@@@ డిగ్రీ కాలేజ్ మొత్తం స్టూడెంట్స్‌తో సందడిగా ఉంది.ఎక్కడ చూసినా గ్రూపులుగా నిలబడి మాట్లాడుకుంటున్న విద్యార్థులు....కొంతమంది క్యాంటీన్ వైపు....మరికొంతమంది క్లాసుల వైపు పరుగులు తీస్తున్నారు....అలాంటి సమయంలో కాలేజ్ గేట్ ముందు ఒక బ్లాక్ కలర్ కారు వచ్చి ఆగింది.కారు డోర్ ఓపెన్ అయ్యింది.ముందుగా ఒక జత బ్లాక్ షు ఒకటి నేల మీద బలంగా పడింది.... స్టూడెంట్స్ అందరూ చూపు ఒక్కసారిగా అటుగా మళ్లీంది.....ఆ తర్వాత....ఆరడుగుల అజానుబాహుడు కారు నుంచి బయటకు దిగాడు....వైట్ షర్ట్....బ్లాక్ ప్యాంట్....చేతిలో వాచ్....మరో చేతిలో కొన్ని ఫైల్స్....అందులో నుంచి ఒక వ్యక్తి స్టైల్గా కిందకి దిగాడు.... మొహంలో ఎలాంటి భావం లేదు, సీరియస్టోన్ మైంటైన్ చేస్తూ కిందకి దిగాడు....అతను గంభీరంగా నడుచుకుంటూ వస్తే అందరి చూపు…

Browse Stories

ఏమండోయ్ మాస్టారు 💞 Premium

ఏమండోయ్ మాస్టారు 💞 – 25

ఇంతకాలం “మాస్టారు” అని పిలిచిన అద్వైత్…. ఇక నుంచి తన జీవితంలో మరో కొత్త పాత్రలోకి అడుగుపెట్టబోతున్నాడు. ఆమె ముఖంలో కనిపిస్తున్న ఆ చిన్న చిరునవ్వు…. ఆ కొత్త జీవితంపై ఉన్న నమ్మకానికి నిదర్శనంలా ఉంది.     పెళ్లి అయిన తర్వాత…. మొదటి ఉదయం…. సహస్రకి చాలా కొత్తగా అనిపిస్తోంది. కళ్లు తెరిచి నెమ్మదిగా చుట్టూ చూసింది…. నిన్నటి వరకు తన గది…. తన వస్తువులు…. తనకి అలవాటైన తన ప్రపంచం…. ఈరోజు మాత్రం అన్నీ […]

12 min 22 views
ఏమండోయ్ మాస్టారు 💞 Premium

ఏమండోయ్ మాస్టారు 💞 – 24

బస్సు నెమ్మదిగా కాలేజ్ వైపు వెళ్తోంది….   రాత్రి సమయం కావడంతో….   బస్సులో చాలామంది స్టూడెంట్స్ నిద్రలోకి జారుకున్నారు….సహస్ర మాత్రం కిటికీలోంచి బయట చూస్తూనే ఉంది….   చేతిలో ఉన్న అవార్డ్‌ని మరోసారి చూసుకుంది….చిన్నగా నవ్వుకుంది….ఆమె పక్కనే నిహారిక నిద్రపోతోంది….   కొద్దిసేపటి తర్వాత….నిహారిక మెలకువ వచ్చి….   “ఇంకా పడుకోలేదా?”అని అడిగింది….. తన జీవితంలో ఇంతకుముందు ఇలాంటి రోజు వస్తుందని ఆమె ఎప్పుడూ అనుకోలేదు. తన పక్కనే నిహారిక నిద్రపోతూ ఉండగా కొద్దిసేపటి తర్వాత […]

10 min 18 views
ఏమండోయ్ మాస్టారు 💞 Premium

ఏమండోయ్ మాస్టారు 💞 – 23

అద్వైత్‌తో కలిసి గడపబోయే ఈ రెండు రోజులు…. వాళ్లిద్దరి మధ్య ఉన్న బంధాన్ని ఇంకాస్త కొత్తగా అర్థం చేసుకునేలా చేయబోతున్నాయి ఇద్దరికి తెలిస్తే ఇంకెంత ఆనందపడతారో ….   సాయంత్రం ఐదు గంటలు….   కాన్ఫరెన్స్ హాల్‌లో ఒక్కొక్క కాలేజ్‌కి సంబంధించిన టీమ్స్ అందరూ ఒక్కొక్కరుగా చేరుకుంటున్నారు. హాల్ మొత్తం స్టూడెంట్స్‌తో సందడిగా ఉంది. ఎక్కడ చూసినా కొత్త ముఖాలే కనిపిస్తున్నాయి.   కొంతమంది తమ ప్రెజెంటేషన్స్ గురించి మాట్లాడుకుంటుంటే…. మరికొంతమంది రేపు స్టేజ్ మీదకి వెళ్లాల్సిన […]

11 min 16 views
ఏమండోయ్ మాస్టారు 💞 Premium

ఏమండోయ్ మాస్టారు 💞 – 22

కారులో కూర్చున్న సహస్ర కిటికీ బయట చూస్తూ ఉంది.ఆమె ముఖంలో ఎప్పటిలా భయం లేదు.ఆమె చేతిలో కాన్ఫరెన్స్ పుస్తకాలు ఉన్నాయి.మనసులో ఒక కొత్త కల ఉంది.ఆ కలని నమ్మేలా చేసిన ఒక మనిషి ఉన్నాడు..ఆ ప్రశ్నకి సమాధానం వెతకడం మొదలుపెట్టింది….. సమాధానం మరి ఎప్పటికీ తెలుసుకుంటుందో ఏంటో???   నెక్స్ట్ డే….   ఉదయం….   సహస్ర కాలేజ్‌కి రావడానికి ముందే కాన్ఫరెన్స్‌కి సంబంధించిన పుస్తకాలు, నోట్స్ అన్నీ బ్యాగ్‌లో సర్దుకుంది. మిర్రర్ ముందు నిలబడి తనని […]

11 min 19 views
ఏమండోయ్ మాస్టారు 💞 Premium

ఏమండోయ్ మాస్టారు 💞 – 21

నెక్స్ట్ డే……   సహస్ర కాలేజ్‌కి వచ్చినప్పటి నుంచి ఎందుకో చాలా మౌనంగా ఉంది. రోజూ కాలేజ్‌లోకి అడుగుపెట్టగానే నిహారిక కోసం వెతికి, ఆమెతో ఏదో ఒకటి మాట్లాడుతూ నవ్వుతూ తన క్లాస్‌లోకి వెళ్లే సహస్ర…. ఈరోజు మాత్రం ఎవరి వైపు చూడకుండా నిశ్శబ్దంగా తన క్లాస్‌లోకి వెళ్లి కూర్చుంది.   సహస్ర ముఖంలో ఏదో మార్పు కనిపించడంతో నిహారిక కూడా ఎక్కువసేపు ఆగలేక ఆమె దగ్గరకు వచ్చి, “ఏంటే…. ఏమైంది?” అని అడిగింది.   సహస్ర […]

11 min 15 views
ఏమండోయ్ మాస్టారు 💞 Premium

ఏమండోయ్ మాస్టారు 💞 – 20

ఏవండోయ్ మాస్టారు ♥️ 20   నెక్స్ట్ డే…. సెమినార్ రోజు…. ఉదయం నుంచే సహస్రకి కొంచెం టెన్షన్‌గా ఉంది…    కాలేజ్‌కి వచ్చిన వెంటనే నిహారిక ఆమె దగ్గరకు వచ్చి, “ఏంటే…. ఇంకా భయంగానే ఉందా?” అని అడిగింది. సహస్ర చిన్నగా, “కొంచెం.” అంది…..   నిహారిక, “నిన్న ఎంత బాగా మాట్లాడావో గుర్తుందా?” అని అడిగింది. సహస్ర, “అది ప్రాక్టీస్.” అంది. నిహారిక నవ్వుతూ, “ఇది కూడా అలాగే అనుకో.” అంది. సహస్ర నవ్వి, […]

12 min 15 views
ఏమండోయ్ మాస్టారు 💞 Premium

ఏమండోయ్ మాస్టారు 💞 – 19

ఏవండోయ్ మాస్టారు 💞 19   ఆ రోజు…. వాళ్లిద్దరికీ ఒక విషయం మాత్రం స్పష్టమైంది….. ఇప్పటివరకు ఒక టీచర్…. ఒక స్టూడెంట్…. అనే పరిచయం ఇప్పుడు మరింత ప్రత్యేకమైన అనుబంధంగా మారుతోంది….. కానీ…. వాళ్లు ఇద్దరూ ఆ అనుబంధానికి ఇంకా ఒక పేరు పెట్టలేదు…..   ఆ రోజు…. క్లాస్ మొత్తం సహస్ర వైపు చూస్తూనే ఉంది. “గుడ్ మార్నింగ్ ఏవండోయ్ మాస్టారు….” అనే మాట ఇంకా అందరి చెవుల్లోనే ఉంది…..   సహస్ర మాత్రం […]

7 min 16 views
ఏమండోయ్ మాస్టారు 💞 Premium

ఏమండోయ్ మాస్టారు 💞 – 18

ఏవండోయ్ మాస్టారు 💞 18   అద్వైత్ చిన్నగా నవ్వి, “నిన్ను నీ పేరుతో పిలవడమే నాకు ఇష్టం.” అన్నాడు….   ఆ మాటకి సహస్ర ఏమీ మాట్లాడలేకపోయింది. చిన్నగా నవ్వుకుంది. ఇద్దరూ అలాగే గేట్ దాటి బయటకు నడిచారు….   నెక్స్ట్ డే….   ఉదయం…. సహస్ర కాలేజ్‌కి వచ్చేసరికి గేట్ దగ్గరే నిహారిక కనిపించింది. ….   “ఏంటే…. నిన్న ఎక్కడికి మాయమయ్యావ్?” అని అడిగింది…..   సహస్ర చిన్నగా నవ్వుతూ, “ఎక్కడికీ కాదు.” […]

7 min 16 views
ఏమండోయ్ మాస్టారు 💞 Premium

ఏమండోయ్ మాస్టారు 💞 – 17

అతను అప్పటికే మరో నిర్ణయం తీసుకున్నాడు. ఆ నిర్ణయం సహస్ర జీవితంలో కొత్త సమస్యను తీసుకురాబోతోంది.   కానీ ఈసారి…. భయపడి మౌనంగా ఉండే పాత సహస్ర కాదు. తన కోసం తాను మాట్లాడడం నేర్చుకున్న కొత్త సహస్ర….   నెక్స్ట్ డే….   ఉదయం…. సహస్ర చాలా రోజుల తర్వాత చాలా ప్రశాంతంగా కాలేజ్‌కి బయలుదేరింది…..ఇంట్లో కూడా నిన్న జరిగిన విషయం తర్వాత ఎవ్వరూ ఆమెతో పెళ్లి గురించి మాట్లాడలేదు…..తన చదువు కొనసాగించడానికి తండ్రి ఒప్పుకున్న […]

6 min 16 views
ఏమండోయ్ మాస్టారు 💞 Premium

ఏమండోయ్ మాస్టారు 💞 – 16

అద్వైత్ కూడా చిన్నగా నవ్వుతూ, “ప్రామిస్” అన్నాడు….   అతను కారు వైపు నడిచాడు…. సహస్ర మాత్రం అతను వెళ్లే వరకు అక్కడే నిలబడి చూస్తూ ఉంది….   ఆరోజు నైట్ సరదాగా ఒకరికి ఒకరు మెసేజ్ చేసుకుంటూ గడిపేస్తారు….   నెక్స్ట్ డే….    సహస్రకి రాత్రంతా సరిగా నిద్ర పట్టలేదు…..అర్జున్ గురించి అద్వైత్ చెప్పిన మాటలే ఆమె మనసులో తిరుగుతున్నాయి…..   “అతను చెప్పిన కొన్ని విషయాలు నిజం కాదు….” అసలు అర్జున్ ఏం […]

7 min 19 views