నీ చూపులే నా ఊపిరి💕
"ప్రాణంగా ప్రేమించిన వారి కంట వచ్చే చిన్న కన్నీటి బొట్టును అయినా భరించలేము కదా!?"| సమయం ఉదయం 11:00 గంటలు |“మా మా ఒక గుడ్ న్యూస్” అంటూ ఎంతో ఎక్సైటింగ్గా లోపలికి వస్తూనే కిచెన్ వైపు ఆత్రుతగా చూస్తూ హాల్ఉ లోనే ఉన్న తన ఫ్యామిలీ మెంబర్స్ఎం తో ఎంతో సంబరంగా చెబుతున్నాడు వినయ్. బిడ్డ సంతోషం చూసి, “ఆహా! విన్ను ఏమైంది రా అంత సంతోషంగా ఉన్నావు? ఏంటి ఏంటి ఆ గుడ్ న్యూస్?” అంటూ తన తల్లి కవిత తనలానే ఎక్సైట్ అవుతూ అడుగుతుంటే, “హా! మా నేను ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న నా కల ఇవాళ్టికి నెరవేరింది ఐ యాం సో హ్యాపీ తెలుసా.”“అరే! అంత సంతోషాన్ని ఇచ్చే…