నువ్వే నా ప్రపంచం.
"తొందరగా రావే."అంటూ కారు డోర్ తీసింది స్రవంతి. "ఆ వస్తున్న. వెయిట్."అని ఇంకో అమ్మాయి స్వీట్ వాయిస్ వినిపించింది. అప్పుడే మెల్లగా ఆకాశాన్ని మబ్బులు కమ్మేస్తుంటే "ఫాస్ట్.. వర్షం పడేలా ఉంది."అని డోర్ తీసి కారులో కూర్చుంది స్రవంతి. కారు నుండి బయటకు చూసిన ఆమెకి షాపులో ఇంకా ఏదో కొంటున్న ఆమె ఫ్రెండ్ కనిపించింది. "అబ్బా.!ఇంకా ఎంత సేపే తల్లి.."అని కారులో నుండి అరిచింది స్రవంతి. "ఒక్క నిమిషం ఆగలేవానే?"అంటూనే ఆ షాప్ నుండి బయటకు వచ్చింది ఆ అమ్మాయి. ఆమె అలా రోడ్ మీద అడుగు పెట్టిందో లేదో చప్పున వర్షం మొదలైంది. సరిగ్గా అప్పుడే వీచిన గాలికి ఆ చినుకులు ముఖం మీద ముత్యాల్లా రాలాయి. …