ప్రేమకు చిరునామా ❤
ప్రేమకు చిరునామా ❤️Episode 1 – ఆ మెసేజ్ ఎవరు పంపారు ?హైదరాబాద్ నగరం… రాత్రి దాదాపు తొమ్మిది గంటలు దాటింది. ఆకాశమంతా నల్లటి మబ్బులు కమ్ముకుని ఉన్నాయి. చల్లటి గాలి వీస్తూ, అప్పుడప్పుడు మెరుపులు ఆకాశాన్ని వెలిగిస్తున్నాయి... చిన్న చిన్న వర్షపు చినుకులు పడుతున్నాయి. కాసేపట్లో వర్షం జోరుగా కురిసేలా ఉంది.ఒక బస్టాండ్ దగ్గర... ఇతర వ్యక్తులు నిలబడి ఉన్నారు... ఒకరి కళ్ళలోకి ఒకరు చూస్తూ... అతని ఎదురుగా వైషు నిలబడి ఉంది. వర్షపు చినుకులు ఆమె జుట్టును తడుపుతున్నాయి. ముఖం మీద పడుతున్న ముంగురులను పక్కకు జరుపుకుంటూ అతని వైపు చూస్తోంది. లేత రంగు దుస్తుల్లో, కాటుకతో నిండిన పెద్ద కళ్లతో బంగారు వర్ణం రంగుతో.. ఆమె ఎంతో అందంగా కనిపిస్తోంది.…