మృత్యు వనం
వర్షాకాలం మొదలైన కొత్తలో ఆకాశం మేఘాలతో నిండిపోయి ఉంది. చల్లని గాలి వీచుతూ, చెట్ల ఆకులు మెల్లగా ఊగుతున్నాయి. హైవే బస్ స్టాప్ దగ్గర నిల్చుని ఉంది ఒక అమ్మాయ్ ఫోన్ చూస్తూ. అప్పుడే భూ..... అంటూ వెనక నుండి అరుపు వినిపించగానే ఉలిక్కి పడి వెనక్కి తిరిగి చూసింది. అక్కడ నవ్వుతూ" ఎంటి బయపడ్డావ " అన్నాడు అతను." సాయి నిన్ను " అంటూ కొట్టడానికి వెళ్ళి అతని వెనకే ఉన్న ఇంకొక అతన్ని చూసి " ప్రవీణ్ ఇద్దరు కలిసే వచ్చారా తోడు దొంగలు " అంది.ప్రవీణ్ నవ్వుతూ " అవును సంధ్య " అన్నాడు, వెంటనే సాయి " ఎంటి మనమెనా వచ్చింది. హీరో, హీరోయిన్ ఇంకా ఎంట్రీ ఇవ్వలేదా…