New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more

స్వయంసిద్ధ

25 stories Completed Inspirational Social Drama Thriller

భాగం – 1   ఆకాశంలో నల్లని మేఘాలు కమ్ముకొని ఉన్నాయి! రాత్రంతా వర్షం కురిసిన ప్రభావం పరిసర ప్రాంతంలో చల్లని గాలి రూపంలో విస్తరించి ఉంది! రాత్రి కురిసిన వానకు రోడ్ల పక్కన చిన్నచిన్న నీటి గుంటలు ఏర్పడ్డాయి. వాటిలో ప్రతిబింబిస్తున్న వీధి దీపాలు, ఉదయం మొదలైన వెలుతురు పడగానే మెల్లగా కనుమరుగవుతున్నాయి. పాల ప్యాకెట్ల కోసం బయటకు వచ్చినవాళ్లు, ఆఫీసులకు వెళ్లడానికి బస్సుల కోసం ఎదురుచూస్తున్నవాళ్లు, వీధి చివర బండి మీద వేడి వేడి ఇడ్లీలు అమ్ముతున్న వ్యక్తి చుట్టూ చేరిన వాళ్లతో రోడ్ అంతా రద్దీగా ఉంది! అదే రోడ్ కి ఆనుకొని ఉన్న లైన్ లోని ఒక కాలనీలో, ఒక ఇంటి కిటికీ దగ్గర నిలబడి బయటకు…

Browse Stories

స్వయంసిద్ధ Premium

స్వయంసిద్ధ – 25

స్వయంసిద్ధ – చివరి భాగం!   ఉదయం లేవగానే జాహ్నవి కి మొదటగా కనిపించింది ఫోన్ లో తనకు వచ్చిన మెసేజ్! ఆ మెసేజ్ మేఘనా రెడ్డి నుండి వచ్చింది! పోలీస్ స్టేషన్ కి రమ్మని చెప్పింది! అందుకని ఉదయం ప్రజావాణి డిజిటల్‌ ఆఫీస్ కి వెళ్లకుండా నేరుగా పోలీస్‌ స్టేషన్‌ కు చేరుకుంది జాహ్నవి. మేఘనా రెడ్డి తన గదిలో కొన్ని ఫొటోలు, పేపర్స్ మరియు కొన్ని ఆధారాలు టేబుల్‌ పై ఉంచి చూస్తుంది! ఆ […]

10 min 23 views
స్వయంసిద్ధ Premium

స్వయంసిద్ధ – 24

స్వయంసిద్ధ – 24వ భాగం   “సౌమ్య చనిపోయిన రోజు నేను ఆమెను కలవలేదు. కానీ ఆమె చివరిగా ఎవరిని కలవాలనుకుందో నాకు తెలుసు.” అంటూ రాకేష్ చెప్పిన ఆ మాటలు జాహ్నవి మనసులో పదే పదే వినిపిస్తున్నాయి. ఆ మాటలను గుర్తు చేసుకుంటూ వెంటనే అరవింద్ కి ఫోన్ చేసింది జాహ్నవి! “హా జాహ్నవి!” “సర్‌! రాకేష్ తో ఇందాకే మాట్లాడాను. సౌమ్య చివరిగా ఎవరిని కలవబోతోందో తనకు తెలుసని చెప్పాడు. కానీ పూర్తి విషయం […]

8 min 19 views
స్వయంసిద్ధ Premium

స్వయంసిద్ధ – 23

స్వయంసిద్ధ – 23వ భాగం   ప్రజావాణి ఆఫీస్ లో సందడి  ఎక్కువగా ఉంది! ఆ ఆఫీస్ మొదలుపెట్టి ఇరవై అయిదు సంవత్సరాలు పూర్తి కావడానికి ఇంకా వారం రోజులే ఉంది! ఫంక్షన్ గ్రాండ్ గా చెయ్యాలని ఒక డాక్యుమెంట్ ప్రిపేర్ చేస్తున్నారు కొందరు! జాహ్నవి మాత్రం తన క్యాబిన్ లో కూర్చొని ఆలోచిస్తుంది! ఆమె మదిలో తిరిగే ఒకే ఒక్క పేరు రాకేశ్! ఆ పేరు జాహ్నవి మనసులో తిరుగుతూనే ఉంది. సౌమ్యతో సంబంధం ఉన్న […]

8 min 18 views
స్వయంసిద్ధ Premium

స్వయంసిద్ధ – 22

స్వయంసిద్ధ – 22వ భాగం   రాత్రి పది గంటలు దాటుతుంది. బయట వీధులన్నీ నిశ్శబ్దం కప్పుకొని పడుకున్నాయి! కిటికీ కి ఉన్న పలుచని తెరలు అప్పుడప్పుడు కదులుతున్నాయి. తెరిచి ఉన్న కిటికీ సందు లోంచి చల్లని గాలి మెల్లగా గదిలోకి ప్రవేశించింది. రోజంతా గదిలో పేరుకుపోయిన వెచ్చదనాన్ని తనతో పాటు బయటకు తీసుకెళ్తున్నట్టుగా ఆ గాలి గదినంతా తాకింది. కిటికీ పక్కనే ఉన్న తెరలు గాలికి సుతారంగా రెపరెపలాడుతూ గోడకు వేలాడుతున్నాయి. ఆ చల్లదనంలో ఏదో […]

8 min 15 views
స్వయంసిద్ధ Premium

స్వయంసిద్ధ – 21

స్వయంసిద్ధ – 21వ భాగం   ప్రజావాణి డిజిటల్‌ కార్యాలయం లోని తన క్యాబిన్ లో కూర్చున్న జాహ్నవి, రాత్రి తనకు వచ్చిన ఆడియో ఫైల్‌ వివరాలను ఒకసారి పరిశీలించింది. ఆ మెయిల్‌ పంపిన చిరునామా కొత్తది. వ్యక్తిగత వివరాలేవీ లేవు. ఫైల్‌ పేరు కూడా సాధారణంగా ఉంది. అరవింద్‌ ఆమెను గమనించి దగ్గరకు వచ్చాడు. “జాహ్నవి! మేఘనా రెడ్డి గారు ఆడియో ఫైల్ తీసుకొని రామ్మనారు కదా! నాకు కొంచెం పని ఉంది! నువ్వు తీసుకెళ్ళు!” […]

7 min 13 views
స్వయంసిద్ధ Premium

స్వయంసిద్ధ – 20

స్వయంసిద్ధ – 20వ భాగం   మధ్యాన్నం మూడు గంటల సమయంలో సౌమ్య వాళ్ళ ఫ్యామిలీ ని కలవడానికి వాళ్ళ ఇంటికి చేరుకుంది జాహ్నవి. ఆమెను చూసిన వెంటనే సౌమ్య తల్లి బయటకు వచ్చింది. “రా అమ్మా.” “నమస్కారం ఆంటీ.” “రా! లోపల కూర్చో.” జాహ్నవి కూర్చున్న తరువాత సౌమ్య తండ్రి కూడా వచ్చి ఎదురుగా కూర్చున్నాడు. “ఏమమ్మా! కేసు గురించి ఏమైనా తెలిసిందా?” అని అడిగాడు. “కొన్ని విషయాలు తెలుసుకుంటున్నాను అంకుల్. కానీ ఇంకా కొన్ని […]

7 min 25 views
స్వయంసిద్ధ Premium

స్వయంసిద్ధ – 19

స్వయంసిద్ధ – 19వ భాగం   రద్దీగా ఉన్న రోడ్ పైన ఒక కార్ వేగంగా వెళుతుంది! ఆ కార్ లో డ్రైవ్ చేస్తూ కూర్చొని ఉన్నాడు అరవింద్! అతని పక్కనే కూర్చుంది జాహ్నవి! ఆమెలో ఎన్నో ప్రశ్నలు ఉన్నాయి! ఆ ప్రశ్నలకు సమాధానం లేక మౌనంగా కూర్చొని ఆలోచిస్తుంది! “జాహ్నవి!” ఆ నిశబ్దాన్ని చీలుస్తూ ఆమె వైపు చూసి అన్నాడు అరవింద్! “ఏంటి సర్!” “ఈ కేసులో విక్రమ్ శేఖర్ ఏం చెప్తాడు అని ఊహిస్తున్నావు?” […]

8 min 29 views
స్వయంసిద్ధ Premium

స్వయంసిద్ధ – 18

స్వయంసిద్ధ – 18వ భాగం   రాత్రి పదకొండు గంటలు. ఇంట్లో అందరూ నిద్రకు సిద్ధమవుతున్నా జాహ్నవి గదిలో మాత్రం లైట్ ఇంకా వెలుగుతూనే ఉంది. ఆమె ముందు ల్యాప్‌ టాప్ తెరిచి ఉంది. తెర మీద సౌమ్య, ప్రశాంత్‌తో పాటు మరో వ్యక్తి ఉన్న పాత ఫోటో కనిపిస్తోంది. ఆ ఫోటో ను ఇప్పటికే చాలా సార్లు పరిశీలించింది. అయినా ప్రతిసారీ ఆమె దృష్టి ఆ మూడో వ్యక్తి మీదే ఆగిపోతోంది. అతని ముఖం స్పష్టంగా […]

7 min 14 views
స్వయంసిద్ధ Premium

స్వయంసిద్ధ – 17

స్వయంసిద్ధ – 17వ భాగం   సాయంత్రం ఐదు గంటల సమయంలో కాలేజీ పరిసరాలు స్టూడెంట్స్ తో సందడిగా ఉన్నాయి. క్లాసెస్ ముగించుకుని బయటకు వస్తున్న స్టూడెంట్స్ అందరు బస్సుల కోసం ఎదురుచూస్తున్నారు! రోడ్డు పక్కన ఉన్న టీ స్టాల్ దగ్గర స్నేహితులతో మాట్లాడుకుంటున్న కొందరు ఉన్నారు. ఆ ప్రాంతం ఎన్నో జ్ఞాపకాలను మోస్తున్నట్టుగా అనిపించింది. జాహ్నవి అక్కడికి చేరుకుని చుట్టూ చూసింది. ఒక మూలన నిలబడి ఫోన్ చూస్తున్న యువకుడు ఆమెను గమనించాడు. “జాహ్నవి గారా?” […]

7 min 17 views
స్వయంసిద్ధ Premium

స్వయంసిద్ధ – 16

స్వయంసిద్ధ – 16వ భాగం   ప్రజావాణి కార్యాలయం లో ప్రింటర్ శబ్దాలు ఎక్కువగా ఉన్నాయి! కొత్తగా వచ్చిన న్యూస్ ని ప్రింటర్ సెక్షన్ కి పంపిస్తుంది ఒక అమ్మాయి! ఆ అమ్మాయిని చూస్తూ ఎడిటర్ రూమ్ వైపుగా నడిచింది జాహ్నవి! తన రూమ్ లో ఆర్టికల్స్ ని చెక్ చేస్తూ కూర్చున్నాడు అరవింద్! “సర్!” లోపలకు వెళుతూనే పిలిచింది జాహ్నవి! “హా! చెప్పు జాహ్నవి!” “సౌమ్య ని ప్రేమ పేరుతో విసిగించిన వ్యక్తి ప్రశాంత్ అని […]

7 min 16 views