Mounanga Modhalaina Prema
కొంతమంది మన జీవితంలోకి ఎలా వస్తారో మనకు తెలియదు. కానీ వాళ్లు వచ్చిన తర్వాత మన జీవితంలో ఎలాంటి మార్పులు వస్తాయో కూడా మనం ఊహించలేం. అది కూడా ఒక చిన్న పరిచయంతోనే మొదలవుతుంది. హైదరాబాద్ | ఉదయం 9:00 గంటలు "చందూ... ఇంకా ఎంతసేపు రెడీ అవుతావే? కాలేజీకి టైమ్ అవుతుంది!" అంటూ అరిచింది సిరి. "వస్తున్నానే... రెండు నిమిషాలు!" అంటూ తన బ్యాగ్ తీసుకుంది చందు. చందు B. Sc చదువుతోంది. చూడటానికి చాలా సింపుల్‌గా ఉండే అమ్మాయి. ఎక్కువగా ఎవరితోనూ మాట్లాడదు. కొత్తవాళ్లతో పరిచయాలు చేసుకోవడం తనకు అస్సలు ఇష్టం ఉండదు. ఎవరైనా వచ్చి మాట్లాడితే సమాధానం చెప్తుంది తప్ప, తనంతట తాను వెళ్లి మాట్లాడటం చాలా అరుదు.…