ఇమీడియట్‌గా హాస్పిటల్‌కి డ్రైవ్ చేసుకుంటూ వెళ్లి, ఆమెను ఎమర్జెన్సీలో జాయిన్ చేశాడు.
ఆ అమ్మాయి పరిస్థితి చూసి డాక్టర్లు వెంటనే ఇంటెన్సివ్ కేర్‌కి షిఫ్ట్ చేశారు.
కొద్దిసేపటి తర్వాత గైనకాలజిస్ట్ బయటికి వచ్చారు. ఆ సిటీలో ఆర్య వర్ధన్ అంటే ఒక పెద్ద సీఈఓగా అందరికీ తెలుసు. అతనిని చూడగానే ఆ డాక్టర్ ముఖంలో ఆగ్రహం, అసహ్యం స్పష్టంగా కనిపిస్తున్నాయి.
డాక్టర్ చాలా సీరియస్‌గా, “సార్… ఆ అమ్మాయి పరిస్థితి చాలా క్రిటికల్‌గా ఉంది. ఆ ట్రీట్‌మెంట్ చేసేటప్పుడు మేం చూసిన దాన్ని బట్టి చెబుతున్నాను… ఆ అమ్మాయి మీద ఏదో పెద్ద రేప్ అటెంప్ట్ లేదా దౌర్జన్యం జరిగినట్లుంది.
ఒంటి మీద చాలా చోట్ల బలమైన గాయాలు, గోటి గుర్తులు ఉన్నాయి. బట్ సరైన మెడికేషన్ తీసుకోకపోవడంతో ఆ ఇన్ఫెక్షన్ కాస్త ముదిరింది.
ఇప్పుడైతే సెలైన్ పెట్టాను, అలాగే ఆ మచ్చల కోసం కొన్ని ఇంజెక్షన్స్ కూడా ఇచ్చాను. ముఖ్యంగా… ఆ అమ్మాయి ప్రైవేట్ పార్ట్ దగ్గర కూడా గాయాలు, వాపు ఉన్నాయి. అక్కడ చాలా కేర్‌ఫుల్‌గా ఆయింట్‌మెంట్ వాడాలి. ఎవరో గానీ… ఆ అమ్మాయి మీద చాలా క్రూరంగా, ఒక మృగంలా బిహేవ్ చేశారు!” అని కోపంగా, నిర్మొహమాటంగా మొహం మీదనే చెప్పేసింది.