“ఎంత చీప్‌గా థింక్ చేశావే ?! నువ్వు చేసిన తప్పుని కప్పిపుచ్చుకోవడానికి, రిషిత మీద ఆ నేరాన్ని నెట్టేస్తావా?! ఆ రోజు పార్టీలో ఆ డ్రగ్ కలిపింది నువ్వే కదా! ఆ వీడియో క్లిప్ నా కంట పడేసరికి నీ బాగోతం బట్టబయలైంది!” అంటూ ఆ చెంప ఈ చెంప వాయించి పారేశాడు!
నవ్య ఏడుస్తూ, “సార్… సార్ సారీ సార్! నన్ను వదిలేయండి!” అని కాళ్ళ మీద పడబోయినా ఆర్య అస్సలు కనికరించలేదు.
జనాలందరూ చూస్తుండగానే, ఆమె జుట్టు పట్టుకుని ఈడ్చుకెళ్తూ క్యాబిన్ నుంచి బయటికి తెచ్చాడు.
ఆఫీస్ మెయిన్ గేట్ బయట రోడ్డు మీదకి విసిరేసినట్లు పడేశాడు!
నవ్య మోకాళ్ళ మీద కూలబడి, ఏడుస్తూ జాలిగా చూస్తుంటే… ఆర్య తన చూపుడు వేలు ఆమె ముఖం ముందు పెట్టి