శాలిని కోమా స్థితిలో ఉన్న విషయం తెలుసుకున్న తారక్, ఒత్తిడితో స్పృహ కోల్పోయి కింద పడిపోయాడు..
అతన్ని వెంటనే పట్టుకున్న అతని PA చేతన్, సంతోష్ సహాయంతో అతన్ని అతని రూమ్‌లోకి ఎత్తుకుని వెళ్లారు…
ఆ తర్వాత డాక్టర్‌కి call చేసి తారక్ పరిస్థితిని వివరించగానే, వెంటనే doctors అయోధ్య వైపు వచ్చారు…
బెడ్‌పై పడుకుని ఉన్న తారక్ చుట్టూ అందరూ ఆందోళనగా నిలబడి ఉన్నారు..
రూమ్‌లోకి వెళ్లిన doctors అతన్ని checkup చేసి, ఆ తర్వాత అతనికి ఒక injection ఇచ్చి ఇంటివాళ్ల దగ్గరకు వచ్చారు..
“డాక్టర్, ఏమైంది అతనికి? ఆరోగ్యం బాగానే ఉందని చెబుతున్నారు కదా… కానీ ఇప్పుడు ఉన్నట్టుండి తల తిరిగి పడిపోయాడు. ఏదైనా ఇబ్బంది జరిగిందా?” అని ఏడుస్తూ కౌసల్య ప్రశ్నించగా అంతగా ఏమీ ఇబ్బంది లేదు..
కానీ ఏదో ఒక shock విషయం విని స్పృహ తప్పి పడిపోయారు. ఆయన ఇంకా పూర్తిగా కోలుకోలేదు. అంచనా ప్రకారం ఇంకా ఒక 15 రోజుల సమయం పడుతుంది ఆయన మొదటి స్థితికి రావడానికి.
కానీ ఈయన బలవంతంగా కోలుకోవాలని ప్రయత్నిస్తున్నారు. ఇది ఆయన healthకి ఇబ్బంది కలిగించవచ్చు.
మీరందరూ ఆయనతోనే ఉండి, ఆయన ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి.”
“అలాగే ఎక్కువగా shock అయ్యే విషయాలు చెప్పకండి. ఆయన తల వాటిని తట్టుకునే పరిస్థితిలో లేదు. ఎందుకంటే తలకు బలమైన దెబ్బ తగిలింది. కాబట్టి ఎక్కువ care తీసుకోండి.
అలాగే ఈ tablets అన్నీ సమయానికి ఇవ్వండి” అని చెప్పి, తారక్ ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించమని చెప్పి డాక్టర్ వెళ్లిపోయారు.