New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
ఈ బంధానికి ఏ పేరు పెట్టాలి?-127

ఈ బంధానికి ఏ పేరు పెట్టాలి?-127

 

తనకు నిద్ర రావడం లేదని, తారిణితో కలిసి Walk చేస్తానని విక్టర్‌ను అడిగిన శార్వరి, అతనితో కలిసి Walk చేస్తూ అతని తల తింటూ మాట్లాడుతూనే ఉంది.

ఆమె మాటలు వింటూ తారక్‌కి కోపం వచ్చినా కూడా సహిస్తూ కూర్చున్నాడు. ఆ తర్వాత నిద్ర వచ్చినట్టుగా నటిస్తూ ఊయలపై పడుకుని నిద్రపోయినట్టు చేశాడు.

అతను నిద్రపోయిన తర్వాత అతని ఎదురుగా కూర్చున్న శార్వరి, ముందుగా అతని నుదుటిపై ముద్దుపెట్టింది. అది సరిపోక అతని చెంపపై కూడా ముద్దుపెట్టి, అతని చేతిని తన పొట్టపై పెట్టుకుని కళ్లను మూసుకుంది.

ఆ తర్వాత ఎవరైనా చూసేస్తారేమోనని అక్కడి నుంచి పరుగెత్తుకుంటూ వెళ్లిపోయింది.

ఇంతసేపు నిద్రపోయినట్టు నటిస్తున్న తారిణి వేషంలోని తారక్ వెంటనే లేచి కూర్చుని, కాళ్లు మీద కాలు వేసుకుని గెలుపు చిరునవ్వు నవ్వాడు.

కొనసాగుతుంది…

పరుగెత్తుకుంటూ Room‌లోకి వచ్చిన శార్వరి ముందు చేతులు కట్టుకుని నిలబడిన మోనా, Door వేసి కనుబొమ్మలు పైకెత్తి,

“ఏమైంది?”

అని అడిగింది.

“కిస్ ఇచ్చేసి పరిగెత్తుకుంటూ వచ్చాను. అనుకోకుండా ఎప్పుడైనా నేను ఆయనకు ఒంటరిగా దొరికితే, నన్ను ఊరికే వదిలిపెట్టరు.”అని సిగ్గుపడుతూ నేల వైపు చూస్తూ చెప్పింది.

“జాను, ముందే చెప్పాను కదా… Serious‌గా ఆయన ముందు Act చేయమని. ముందే ఆయనకు Doubt వచ్చింది. నువ్వేమో ‘ఆయన్ని ఆటపట్టిస్తాను, ఆటపట్టిస్తాను… నా మొగుడి మనసులో ఉన్న ప్రేమను బయటకు తీసుకొస్తాను’ అని చెప్పి, చివరికి ఆయన ముందే దొరికిపోతున్నావు! అంటూ మోనా ఆమె తలపై చిన్నగా మొట్టికాయ వేసి అడిగింది.

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue