తారిణి వేషం తీసేసి, బ్లాక్ కలర్ Jeansకి బ్లాక్ కలర్ Shirt వేసుకుని, చేతిలో Gun పట్టుకుని వచ్చిన తారక్ చుట్టూ చూస్తూ Gun తీసి ఎవరిని టార్గెట్ చేయాలో వెతుకుతూ చివరికి విక్టర్‌ను గమనించాడు.
పాట, డాన్స్ ముగిసిన తర్వాత సాక్షి చేయి పట్టుకుని మళ్లీ స్టేజ్‌పైకి తీసుకెళ్లడానికి విక్టర్ వచ్చినప్పుడు, అది చూసిన తారక్ ముఖంలో ఒక వెటకారపు చిరునవ్వు మెరిసింది.
“సాక్షి DOWN!” అని తారక్ గట్టిగా అరిచాడు.
ఆ గొంతు వినగానే సాక్షి వెనక్కి తిరిగి, తాను నిలబడి ఉన్న చోటే కింద కూర్చుండిపోయింది.
తారక్ గొంతు విన్న విక్టర్ ఒక్కసారిగా షాక్ అయ్యి, ఆ శబ్దం వచ్చిన వైపు చూశాడు.
క్షణం కూడా ఆలోచించకుండా తారక్ అతని చేతికి Shoot చేశాడు.
“ఓహ్ గాడ్!” అని విక్టర్ గట్టిగా అరుస్తూ, చేతి నొప్పికి విలవిలలాడుతూ కింద పడిపోయాడు.
స్టైల్‌గా Gunపై ఉన్న దుమ్మును దులిపి, Gunను తిప్పుతూ విక్టర్ దగ్గరకు వచ్చిన తారక్, అక్కడే మోకాళ్లపై కూర్చున్న సాక్షి చేయి పట్టుకుని పైకి లేపాడు.
ఆమె నడుము చుట్టూ చేయి వేసి తన దగ్గరకు లాక్కుని నిలబెట్టుకున్నాడు.
అతను మాత్రం చాలా Coolగా ఉన్నాడు…
అంతలో, తూటాలు…