సాక్షి మెడకు కత్తి పెట్టిన విక్టర్, తనను అక్కడి నుంచి వెళ్లనిస్తే సాక్షిని వదిలేస్తానని చెప్పాడు.
అతని మాటకు ఒప్పుకున్న తారక్, అధికారులను ఏమీ చేయకుండా సైలెంట్‌గా ఉండమని చెప్పి, విక్టర్‌ను అక్కడి నుంచి వెళ్లమన్నాడు.
ఆ తర్వాత విక్టర్ సాక్షితో పాటు తన Assistant అయిన నిక్‌ను కూడా వెంట తీసుకెళ్లాడు.
నిక్ Car Start చేసిన తర్వాత, సాక్షిని Carలోకి తోసి, తారక్‌తో చెప్పినట్టుగానే Gate దగ్గర సాక్షిని వదిలేస్తున్నట్టు నటించాడు.
ఆ తర్వాత తారక్ వైపు వెటకారంగా నవ్వి, అతనిపై Shoot చేసి, సాక్షిని మళ్లీ Carలోకి లాక్కున్నాడు.
“సాక్షి…..!” అని తారక్ గట్టిగా అరుస్తూ నేలపై పడిపోయాడు.
తారక్‌ను అలా నేలపై పడిపోయి ఉండటం చూసిన సాక్షి స్పృహ కోల్పోయి కింద పడిపోయింది.
అప్పటికే విక్టర్ Car అక్కడి నుంచి కనుమరుగైంది.
లోపల ఉన్న అధికారులు, తారక్ Security Team Guards అందరూ తారక్ నేలపై పడిపోగానే పరుగెత్తుకుంటూ వచ్చి అతన్ని పట్టుకున్నారు.
అతని భుజానికి Shoot చేయడంతో, భుజం నుంచి రక్తం కారుతోంది.
“ఓహ్ షిట్… తారక్! అతను చాలా Dangerous అని మేము చెప్పలేదా? అతన్ని ఇక్కడి నుంచి ఎందుకు వెళ్లనిచ్చారు?