“I love you…” అని చెప్పిన సాక్షి అతన్ని కౌగిలించుకుని కన్నీళ్లు పెట్టుకుంది.
“నేను నీ కన్నీళ్లను చూడటం ఇష్టపడను…” అని చెబుతూ ఆమె కన్నీళ్లను తుడిచి, ఆమె అరచేతిని పట్టుకుని ముద్దు పెట్టాడు.
“Thank you సర్… నన్ను మీ lifeలోకి తీసుకున్నందుకు…
మీరు నా జీవితంలోకి రాకముందు నా జీవితం ఎలా ఉండేదో తెలుసా? ఒక ఖాళీ కాగితంలా ఉండేది.
కానీ మీరు వచ్చి ఆ ఖాళీ కాగితం అంతా రంగురంగుల సీతాకోకచిలుకలతో నింపి, నా lifeని colorfulగా మార్చేశారు.
మీరు నన్ను ద్వేషిస్తున్నాను అని చెబుతూనే నన్ను ఎంతగా ప్రేమించారు!
మీ ఈ చేతుల్లో దొరికే ఆసరా నాకు మా అమ్మ దగ్గర తప్ప ఇంకెక్కడా దొరకలేదు…”
“The most wonderful thing I decided to do was to share my life and heart with you.”
మొదట్లో మీ ఈ కోపానికి భయపడిన నేను, తర్వాత ఈ కోపాన్ని కూడా ఇష్టపడటం మొదలుపెట్టాను.
మీకు నా ప్రేమను ఎలా చెప్పాలో తెలియకపోయింది తారక్ సర్… but I love you. మీరు నా ఊపిరి…” అని చెప్పిన ఆమె అతని మెడ చుట్టూ చేతులు వేసుకుని ఏడుస్తుంటే, ఆమె వీపుపై నిమురుతున్న తారక్‌కి ఆశ్చర్యంగా అనిపించింది.
‘ఇంతగా నన్ను ఇష్టపడుతుందా?’ అని అనుకున్నాడు.