ఇంట్లో వాళ్లందరూ కలిసి తారక్, సాక్షిలకు మళ్లీ పెళ్లి చేస్తారు.
ఇప్పటికే ఐదు నెలల గర్భిణి అయిన సాక్షి, ఎక్కువసేపు కూర్చుని ఉండటంతో అలసిపోయి తారక్ భుజంపై వాలిపోయింది.
వెంటనే తారక్ అందరికీ చెప్పి, ఆమెను రూమ్‌కి తీసుకెళ్లి రెస్ట్ తీసుకోమని చెప్పాడు.
ఇటు పెళ్లికి వచ్చిన సన్నిహితులందరికీ భోజనం పెట్టి పంపించిన చంద్రప్రసాద్ యాదవ్, సాయంత్రం జరిగే పార్టీకి రావాలని అందరినీ మరోసారి ఆహ్వానించడానికి వెళ్లారు.
“అబ్బా… మొత్తానికి అంతా సజావుగా జరిగిపోయింది.
తను… పిల్లలను తీసుకుని వెళ్లి రెస్ట్ తీసుకో. సాయంత్రం పార్టీ ఉంది కదా.
అలాగే నీకు, సంతోష్‌కు, ఇద్దరు పిల్లలకు పార్టీ కోసం బట్టలు తీసి నీ రూమ్‌లో పెట్టాం. నీ కోసం మూడు జతలు తీసుకున్నాను. నీకు ఏది ఇష్టమైతే అది వేసుకో” అని కూతురితో చెప్పిన కౌసల్య, రెస్ట్ తీసుకోవడానికి రూమ్ వైపు వెళ్లారు.
తను పార్టీ కోసం తెచ్చిన బట్టలను చూస్తూ, సంతోష్‌తో మాట్లాడుకుంటూ కూర్చుంది.
“తను… ఒక ప్రశ్న అడగనా? బేజార్ అవ్వకు.
ఈ మధ్య నువ్వెందుకు మీ ఇంట్లో వాళ్లందరినీ అవాయిడ్ చేస్తున్నావు? వాళ్ల మీద ఏమైనా కోపం ఉందా?
నిన్ను బాధపెట్టేలా అత్తమామలు, తారక్ ఎవరూ ఏమీ చేయలేదు కదా? అలాగే శాలినీ చిన్నమ్మ కూడా…