తారక్, సాక్షిల నాలుగో వివాహ వార్షికోత్సవ వేడుక చాలా ఘనంగా జరిగింది. అన్నీ పూర్తయిన తర్వాత ఫార్మ్‌హౌస్‌లో తారక్, సాక్షి, ఆయుష్ ఉండిపోవాలని, మిగతావాళ్లు అయోధ్య వైపు వెళ్లాలని అనుకున్నారు.
అనుకున్నట్టుగానే అయోధ్య వైపు వెళ్తున్న శాలిని, ఆయుష్‌కి సంబంధించిన ఫుడ్ కారులోనే ఉండటం గమనించి, దాన్ని సాక్షికి ఇచ్చి వస్తానని కౌసల్య గారితో చెప్పి తిరిగి ఫార్మ్‌హౌస్‌కి వెళ్లింది.
ఆ తర్వాత……
“అయ్యో… ఈ సాక్షి ఎక్కడుందో ఏమో! ఫోన్ కూడా రిసీవ్ చేయడం లేదు.” అని అనుకుంటూ ఆయుష్ ఫుడ్ తీసుకుని వస్తున్న శాలిని, సాక్షికి కాల్ చేసింది.
అవతల సాక్షి ఫోన్ రిసీవ్ చేయగానే, ఆయుష్ ఫుడ్ తన దగ్గర ఉందని చెప్పి, బయటకు వచ్చి తీసుకెళ్లమని చెప్పింది.
సాక్షి…“నేనే వస్తాను, ఉండు. నేను మర్చిపోయాను.
ఆయుష్ ఏడుస్తున్నాడా? తారక్ సర్ చూసుకుంటున్నారు. నేను డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి వెళ్లాను, అందుకే ఫోన్ రిసీవ్ చేయలేదు. నేనే వస్తాను.” అని చెప్పి ఫార్మ్‌హౌస్ నుంచి బయటకు వచ్చింది.
కాల్ కట్ చేసిన శాలిని, ఫార్మ్‌హౌస్ లోపల ఉన్న తోట దగ్గర ఎవరో గుసగుసగా మాట్లాడుకుంటున్న శబ్దం విని అటువైపు వెళ్లింది.
అక్కడికి వెళ్లిన శాలిని… ఒక్కసారిగా షాక్ అయి అలాగే నిలబడిపోయింది.
చూడగానే పీక్కుపోయిన శరీరం, చెదిరిపోయిన జుట్టు… ఒంట్లో శక్తి లేకపోయినా వణుకుతూ నిలబడి ఉన్న ఆ దేహాన్ని ఆమె ఎలా మర్చిపోగలదు?
తన తాళి కట్టిన భర్తను…