నర్స్ ఇంజెక్షన్ రెడీ చేసుకొని పూర్ణివ్ దగ్గరికి వెళ్తూ ఉండగా సడెన్గా కాలు స్లీప్ అయ్యి పూర్ణివ్ ఒడిలో పడింది ఆ నర్స్.
అది చూసిన జేష్ఠ కళ్ళు రెండు పత్తి కాయలంత చేసుకొని కోపంగా ఆ నర్స్ నీ చూస్తూ ఉంటుంది.
పూర్ణివ్ ఒడిలో పడిన ఆ నర్స్ ఏమో అలాగే ట్రాన్స్ గా అతన్నే చూస్తూ ఉంది కానీ పైకి లేవడం లేదు.
పూర్ణివ్ కూడా ఆ నర్స్ భుజం చుట్టూ రెండు చేతులతో పట్టుకొని తననే అయోమయంగా చూస్తూ ఉంటాడు.