మరోవైపు… మాల్‌లో గొడవ జరిగిన వెంటనే రాధిక మరియు తులసి తమ ఫ్లాట్‌కు చేరుకున్నారు. రాధిక కోపంతో ఊగిపోతుంది.
అతనే వచ్చి నన్ను గుద్దీ మళ్లీ అడిగినందుకు, నాపై అంత అరుస్తాడా? అతనెవరు? చతుర్వేద్ కంపెనీస్ ఓనర్ అంట! అంత పెద్ద కంపెనీకి యజమాని ఇంత అహంకారంగా ఉంటాడా?” అని రాధిక కోపంగా అడిగింది
తులసి ఆందోళనగా ఉంది. “రాధికా! నువ్వు ధైర్యంగా ఉన్నావు సరే. కానీ, పెద్ద బిజినెస్మేన్ అంట ఆయన కోపం ఎంత భయంకరంగా ఉంటుందో నీకు తెలియదు.
ఆయన అధికారం ముందు మనం నిలబడలేము. మనం ఇప్పుడే కష్టపడి పైకి వస్తున్నాం. దయచేసి, ఆ గొడవను మర్చిపో. ఆయన మళ్లీ నీకు ఎదురు పడకుండా చూసుకో అని తులసి హెచ్చరించింది.
రాధిక కూర్చుని, నిట్టూర్చింది. నేను భయపడను తులసీ. నా ఆస్తి పోయింది. నా తల్లిదండ్రులు పోయారు. ఇక నేను పోగొట్టుకోవడానికి ఏమీ లేదు.