New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
Mr. డెవిల్ – 4

Mr. డెవిల్ – 4

అమ్మా రాధిక …… ఎంతని ఏడుస్తావు? నీ అమ్మా నాన్నలు వెళ్లిపోయారని బాధ మాకు కూడా ఉంది” అన్నాడు నాయుడు మొసలి సానుభూతితో.

 

 

 

ఉమాదేవి పక్కనే కూర్చుని, రాధిక ని తలపై నిమిరింది. అమ్మా… ఇప్పుడు నువ్వు ధైర్యంగా ఉండాలి. నీ తండ్రి కంపెనీ వ్యవహారాలు, ముఖ్యంగా పెద్ద పెద్ద కాంట్రాక్టులు ఆగిపోయాయి. 

 

 

ప్రతీ ఒక్కరికీ జవాబు చెప్పాల్సి వస్తుంది. అలాగే మీ కంపెనీలో చేసే ఉద్యోగస్తులు కూడా రోడ్డున పడతారు, వాళ్ల గురించిన ఒకసారి ఆలోచించరా,

 

 

మీ నాన్న వాళ్ల గురించి ఎంతలా ఆలోచించేవాడు, ఆలస్యం చేస్తే ఆస్తి మొత్తం జప్తు అవుతుంది. రాధిక కన్నీళ్లు తుడుచుకుని, 

 

 

అత్తయ్యా… నాకు ఏమీ అర్థం కావడం లేదు. నాకు ఆ కంపెనీల గురించి తెలియదు. నేనేం చేయాలి అత్తయ్య అంది దీనంగా రాధిక.

 

 

భయపడకు అమ్మా. మేమున్నాం కదా? అయినా కార్తీక్ ఉన్నాడు కదా అవన్నీ చూసుకోవడానికి,నీ ఆస్తిని కాపాడే బాధ్యత మాది. 

 

 

కానీ, ఇప్పుడు అత్యవసరంగా కొన్ని లీగల్ పేపర్‌లపై నీ సంతకాలు కావాలి. అవి లేకపోతే కంపెనీ మొత్తం చేజారిపోతుంది. 

 

 

నీ తండ్రి కంపెనీ, నీ భవిష్యత్తు… పోతాయి అన్నాడు నాయుడు ఆందోళన నటిస్తూ.సంతకాలు ఎందుకు మామయ్యా? అని అడిగింది రాధిక అమాయకంగా.

 

 

 

రాధిక! నువ్వు ఆయన ఒక్కగానొక్క కూతురివి. వారసురాలివి. నువ్వు సంతకాలు చేస్తేనే, మేం లీగల్‌గా కంపెనీ వ్యవహారాలు చూసుకోగలం. 

 

 

ఈ సంతకాలు కేవలం టెంపరరీగా ఉండటానికి మాత్రమే. కంపెనీ తిరిగి గాడిలో పడ్డాక, అన్నీ నీ పేరుకే ఉంటాయి. లేకపోతే, అన్నీ పోతాయి! అని ఉమాదేవి అబద్ధాల  చెప్పి లేని కన్నీళ్లను తుడుచుకుంటూ, 

 

అదే మా అన్నయ్య ఉండుంటే ఈరోజు మనకి పరిస్థితి ఉండేదా కానీ తప్పదు కదా అని అంటుంది. దానికి రాధిక తన అత్తమామలను సొంత తల్లిదండ్రులుగా నమ్మింది. 

 

 

ఈ విషాద సమయంలో వాళ్లు అబద్ధాలు చెప్తారనుకోలేదు. తన తండ్రి కంపెనీ, ఆయన పేరు పోకూడదనే ఉద్దేశంతో…సరే అత్తయ్యా. ఎక్కడ పెట్టాలో చెప్పండి” అని అంది రాధిక. 

 

 

నాయుడు వెంటనే టేబుల్‌పై తెచ్చిన లీగల్ డాక్యుమెంట్ల కట్టను పెట్టాడు. అవి కంపెనీ ఆస్తులు, స్థిరాస్తులు, బ్యాంక్ అకౌంట్స్ –

 

 

ఇలా మొత్తం రాధిక పేరున ఉన్న ఆస్తిని తన కొడుకు కిరణ్ పేరున బదలాయించే పత్రాలు. వాటిని చదివే ఓపిక,  ఆలోచించే ఓపిక కూడా రాధికకు లేదు. 

 

 

కానీ అత్తయ్య మన మేనేజర్ రాలేదు ఏంటి తనకు తెలిస్తే కదా ఇవన్నీ అని అంటూ ఉండగా తను బయటే ఉన్నాడు అమ్మ అని చెప్పడంతో సరే అత్తయ్య అని రాధిక, 

 

 

(ఇక్కడ ఆ మేనేజర్ ని కూడా కొంత డబ్బులు ఇస్తామని చెప్పేసి ఉమాదేవి నాయుడు ఒప్పించేస్తారు . ఈ రోజుల్లో డబ్బుకి లొంగని వాళ్ళు ఎవరున్నారు.)

 

 

ఉమాదేవి, నాయుడు దంపతులు అడిగిన చోటల్లా రాధిక కన్నీళ్లతో సంతకాలు పెట్టింది. తన భవిష్యత్తును, తన తల్లిదండ్రుల కష్టాన్ని మొత్తం వారికి అప్పగిస్తోందని ఆమెకు తెలియదు.

 

 

సంతకాల ప్రక్రియ పూర్తయింది. పత్రాలన్నీ నాయుడు, ఉమాదేవి దంపతులు తమ లాయర్‌కు పంపి, వెంటనే కిరణ్ పేరున రిజిస్ట్రేషన్ చేయించారు. 

 

 

రాధిక జీవితంలో అత్యంత భయంకరమైన క్షణం ఇంకా రావాల్సి ఉంది.రెండు రోజులు గడిచాయి. రాధిక ఇప్పటికీ దుఃఖంలోనే ఉంది. 

 

ఉమాదేవి, నాయుడు, కిరణ్ అంతా హాల్‌లో కూర్చున్నారు. కిరణ్ నవ్వుతూ ఏదో ఫోన్‌లో మాట్లాడుతూ ఉన్నాడు.

 

 

రాధిక మెల్లిగా వాళ్ల దగ్గరకు వెళ్లి, అత్తయ్యా… కంపెనీ పనులన్నీ అయ్యాయా? మామయ్యా… ఏదైనా హెల్ప్ కావాలా?అని అడిగింది.

 

 

ఉమాదేవి రాధిక వైపు చూసింది. ఆ చూపులో ప్రేమ లేదు, సానుభూతి లేదు. అదో పదునైన, క్రూరమైన చూపు.

 

 

ఓహ్… ఏమన్నావ్?” అని ఉమాదేవి కోపంగా అడిగింది.

హెల్ప్ కావాలా అత్తయ్యా అని అడిగాను” అంది రాధిక అయోమయంగా.

 

 

 

నాయుడు పగలబడి నవ్వాడు. నువ్వు మాకు హెల్ప్ చేయాలా? నీ కామెడీ ఆపు రాధిక,ఇప్పుడు ఈ ఆస్తిలో నీకేం అధికారం లేదు. 

 

 

నువ్వు బయటికి వెళ్లవచ్చు ఇక ఈ అవసరం ఎవరికీ లేదు అలాగే, ఈ ఆస్తుతో నీకు ఎటువంటి సంబంధం లేదు అని అంటారు. 

 

 

రాధిక కు ఒక్కసారిగా గుండె ఆగిపోయినంత పనైంది. మామయ్యా! ఏమంటున్నారు? నేను సంతకాలు పెట్టాను కదా? కంపెనీ వ్యవహారాలు నడిపించడానికి…

 

 

 

నిజమే! సంతకాలు పెట్టావు. ఆ సంతకాలు నువ్వు అని ఆ సంతకాలు కంపెనీ నడపడానికి కాదు, నీ ఆస్తిని, ఈ ఇంటిని, ఈ కంపెనీలను, నీ తండ్రి సంపాదన మొత్తాన్ని మా కొడుకు, మా కిరణ్ పేరున రాయడానికి పెట్టిన సంతకాలు.

 

 

అని హ హ హ అని ఉమాదేవి మొహంపై నవ్వుతూ, క్రూరంగా నిజం చెప్పింది. రాధిక మొహం పాలిపోయింది. ఆమె శరీరంలో  ఈ అవయవ పని చేయనట్టు అయిపోయింది. 

 

 

అంటే… అంటే మీరు నన్ను మోసం చేశారా? ఆ ప్రమాదం…ప్రమాదం! అవును, అదో ప్రమాదమే! లేకపోతే నీ అమ్మానాన్నలు ఆ కిరణ్‌కి నిన్ను  ఇచ్చి పెళ్లి చేసేవారు కాదు ,ఈ ఆస్తి ఇవ్వకు వచ్చేది కాదు.

 

 

అందుకే మేమే దారి చూపించాం అని కిరణ్ తేలికగా చెప్పాడు.ఆ మాటలు రాధిక చెవుల్లో గంటల్లా మోగాయి. తన తల్లిదండ్రులను చంపింది, ప్రేమగా నటించి, నమ్మకంగా దగ్గరైంది… వీళ్లే!

 

 

 

మీరు… మీరు మనుషులేనా? స్వంత అన్నయ్యను, వదినను చంపి, ఇంత మోసం చేస్తారా?” అని రాధిక ఏడుస్తూ అరిచింది.

 

 

 

నాయుడు లేచి, రాధిక దగ్గరకు వచ్చి, ఆమె చెంపపై బలంగా కొట్టాడు. నోరు మూయ్! నీ అరుపులు ఇక్కడెవరికీ పట్టవు. నువ్వు ఈ ఇంట్లో ఇంకో నిమిషం ఉండకూడదు.

 

 

ఈ ఇల్లు, ఈ కారు, ఇవన్నీ ఇప్పుడు మా కిరణ్ సొంతం. నువ్వు కేవలం ఒక అనాథవి, ఆస్తి లేని అనాథవి. వెళ్లు! బయటికి వెళ్లు!అని అరిచాడు.

 

 

 

రాధిక ఏడుపు ఆగిపోయింది. ఆమె కళ్లలో ఇప్పుడు కన్నీళ్లు లేవు. ఆవేశం, భయం, బాధ  అన్నీ కలిపి దుఃఖంగా పొంగుకొచ్చింది .

 

 

 

కానీ అవేమీ బయటికి చూపించకుండా నన్ను ఎంతో ప్రేమగా పెంచిన నా తల్లిదండ్రులని కోల్పోయాను ఈ ఆస్తి ఎక్కేమీ లెక్క కాదు.

 

 

 

సరే! నేను వెళ్తాను. కానీ, ఈ ద్రోహానికి మీరు మూల్యం చెల్లించుకుంటారు. నన్ను అనాథను చేశావు కదా? మీ ఆస్తి మొత్తం నాశనం అయ్యే రోజు వస్తుంది అని రాధిక గట్టిగా అంది.

 

 

వెళ్లు! నువ్వు ఏం చేయగలవో చూస్తాం! అని ఉమాదేవి గేలి చేసింది.ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా, రాధిక తన గదిలోకి వెళ్లింది. ఆమెకు డబ్బు, నగలు ఏమీ అవసరం లేదు. 

 

 

 

తల్లిదండ్రులు నేర్పించిన చదువు, ఆమె భవిష్యత్తుకు ఆధారం. తన కాలేజీ సర్టిఫికెట్స్, చిన్న బ్యాగ్‌లో రెండు జతల బట్టలు, ఫోటోలు మాత్రమే తీసుకుంది.

 

 

ఆమె తిరిగి హాల్‌లోకి వచ్చి, ఆ అత్తమామలను, కిరణ్‌ను చివరిసారిగా క్రూరమైన చూపుతో చూసింది.

నేను వెళ్తున్నాను.

 

కానీ, నేను తిరిగి వస్తాను. ఈ ఇంటికి రావడానికి కాదు, మీ పతనాన్ని చూడడానికి అని చెప్పి, ఆ భవనం మెట్లు దిగి, గేటువైపు నడవడం మొదలుపెట్టింది.

 

 

గేటు దాటి రోడ్డుపై నడుస్తున్న రాధిక, ఇంతకుముందు ఉల్లాసంగా, నవ్వుతూ ఉండే ఆమె మొహం ఇప్పుడు నిర్వేదంతో, పట్టుదలతో నిండి ఉంది. ఆమె వెనుక తలదాచుకున్న, నవ్వులు పూయించిన ఇల్లు… ఇప్పుడు అగాధంలా కనిపిస్తోంది.

 

 

రాధిక తన సర్టిఫికెట్‌ల బ్యాగ్‌ను గట్టిగా పట్టుకుని, ఎటు వెళ్లాలో తెలియక, కన్నీళ్లను ఆపుకుంటూ, ఆ చీకటి రోడ్డుపై తన  తన జీవితంలో ఒక కొత్త అధ్యాయాన్ని మొదలుపెట్టింది.

 

 

ఇప్పుడు రాధిక గమ్యం ఎటువైపు, ముందు ఎపిసోడ్లో చూద్దాం…

 

 

                          కొనసాగుతుంది……….

 

ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ మీ అభిప్రాయాన్ని సమీక్ష ద్వారా తెలియజేయండి..