New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
Episode 50

Episode 50

 

హేయ్ ఇషా ఏమైందీ అలా ఫ్రీజ్ అయ్యావ్ ఐ ఆమ్ ఆస్కింగ్ అబౌట్ యూర్ మ్యారేజ్ అడగరానిది అడిగినట్టు అలా షాక్ అయ్యావ్ ఏంటి…… ?? నాతో చెప్పావ్ గా ఎవరో అబ్బాయిని లవ్ చేస్తున్నావ్ అని అతను ఎవరో ఏంటో చెప్తే మేము కూడా హ్యాపీగా ఫీల్ అవుతాం ఎమ్ అంటావ్ అమ్మమ్మ…… ?? అంటూ దేవయాని వైపు చూస్తూ తన పక్కన కూర్చుంటాడు……… !!

హా తప్పకుండా హ్యాపీ అవుతాం కదా మహాన్ వయసొచ్చిన ఆడపిల్ల పెళ్ళి చేసుకోవాలని ఎవరైనా కోరుకుంటారు కదా…… !! మా భూమి ని చూడు నీ కంటే 3 ఇయర్స్ చిన్నది అప్పుడే నీ ఫ్రెండ్ ( ఫ్రెండ్ అన్న వర్డ్ స్ట్రెస్ చేసి మరీ వెటకారంగా నవ్వుతూ చెప్తుంది) ను పెళ్ళి చేసుకుని హ్యాపీగా ఉంది……. !! నువ్వు కూడా అలాగే పెళ్లి చేసుకుంటే నువ్వు మా ఇంటికి ఎలా ఐతే గెస్ట్ గా వచ్చావో…….. ?? నీ పెళ్ళి అయ్యాక నా మనవడు, మనవరాలు కూడా గెస్ట్స్ గా మీ ఇంటికి వస్తారు ఇషా…… !!

ఇషా పళ్ళు నూరుతూ దేవయాని వైపు చూస్తూ కావాలనే చేస్తున్నావ్ కదా గ్రానీ నేనేంటో మీ అందరికీ త్వరలోనే తెలుస్తుంది…… !! అడుగుతుంటే స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ లా ఎలా నుంచుంటావ్ ఏంటి ఇషా ఎవరు ఆ అబ్బాయి……. ??

మహాన్ 3 డేస్ బ్యాక్ టీవీ లో చూసాను సౌత్ అమెరికా లో ఉన్న స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ మొన్న నే కూలిపోయింది …….. !! ఇపుడు ఇది అవసరమా అన్నట్టు చూస్తున్న మహాన్ ను చూసి మూతి తిప్పుతూ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కూడా తప్పేనా అంటూ అక్కడి నుంచి కిచెన్ లోకి వెళ్తున్న భూమి ను చూసి నవ్వుతూ……. !! ఏంటీ ఇషా అలాగే నుంచున్నావ్ కూర్చో అని తన ఎదురుగా ఇషా కూర్చున్న తరువాత సో చెప్పు ఇండియా ఎందుకు వచ్చావ్…… ?? ఐ మీన్ ఏ వర్క్ మీద వచ్చావ్ ఆల్ ఆఫ్ సడెన్ ఇలా వచ్చావ్ అంటే ఏదో ఇంపార్టెంట్ వర్క్ మీదే వచ్చుంటావ్ కదా……. !!

ఇంపార్టెంట్ వర్క్ అంటూ ఎమ్ లేదు మహాన్…… !! యాక్చుఎల్లీ నేను…… ?? అన్న మాట కూడా కంప్లీట్ అవ్వకుండానే అవునా మరి ఎప్పుడు మీ దేశానికి బయలు దేరుతున్నావ్ అమ్మాయ్…….. ??

అమ్మమ్మ…… !!

 

అరే నేనేం అన్నాను మహాన్ ఇంపార్టెంట్ వర్క్ ఎమ్ లేదు అంటుంటే ఎపుడు వెళ్తావ్ అని అడుగుతున్నా …….. !! బేవర్స్ గా పరాయి ఇంట్లో పడి తినడానికి ఆ అమ్మాయికి సిగ్గు ఎగ్గు లేదు అనుకుంటున్నావా ఏంటి…… ??

దేవయాని మాటలకు ఇషా సీరియస్ గా చూడగానే….. !! అదే అమ్మాయ్ నీకు అక్కడ పనులు ఉంటాయ్ కదా ఎంత నా మనవడు నీ ఫ్రెండ్ అయినా వాడి ఇల్లు  నీ ఇల్లు అవుతుందా ఏంటి……. ?? అందుకే అలా అన్నాను ఏమి అనుకోకమ్మా నేను లోపల ఎదుంటే బయటకు అదే చెప్పడం నాకు అలవాటు 😏……. !! కొందరు ఉంటారు మంచి వాళ్ళలా నటించి కొంపలు కూల్చేస్తారు పాపిష్టి మొఖాలు…… !!

అమ్మమ్మ ఇక చాలు ఊరుకో అంటూ…… !! అమ్మమ్మ మాట ఇలా ఉంటుంది కానీ షి ఇస్ సో స్వీట్ ఇషా……. !! నీకో ఎక్సాంపుల్ చెప్పనా నా వైఫ్ భూమి ఉంది కదా తనను సొంత మనవరాలు కన్నా ఎక్కువ చూసుకుంటుంది …… !! నువ్వు ఇంకా పరిచయం అవ్వలేదు & మీ మధ్య బాండింగ్ కూడా ఎక్కువ లేదు కదా అందుకే అలా మాట్లాడుతుంది…… !! వన్స్ నీతో పరిచయం స్టార్ట్ అయితే నిన్ను కూడా ఓన్ చేసేసుకుంటుంది ……. !!

భూమి కి ఈ అమ్మాయ్ కి పోలిక ఏంటి మహాన్ తను నా బంగారు తల్లీ ఈ ఇంటి మహా లక్ష్మీ……….. !! ఎంత మంది సూర్పనకలు వచ్చినా సీతారాము లాంటి మిమ్మల్ని విడదీయలేరు అది అర్థం చేసుకుని ఎవరి పని వాళ్ళు చూసుకుంటే బావుంటుంది…….. !! నేను అసలే పైకి కనిపించేంత మంచి దాన్ని కాదు అంటూ తన రూమ్ వైపు వెళ్ళిపోతుంది…….. !!

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue