New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
ఒప్పుకోని బంధం – 16

ఒప్పుకోని బంధం – 16

 

రాత్రి సరిగ్గా పన్నెండు గంటల సమయం…

 

మెయిన్ డోర్ ఓపెన్ చేసుకొని లోపలికి అడుగుపెట్టాడు శౌర్య………. !! తన  నడకలో తడబాటు, కళ్లలో ఎరుపు, మాటల్లో మత్తు క్లియర్ గా కనిపిస్తున్నాయి ……..!! శౌర్య పరిస్థితిని గమనించిన శాన్వి మనసులోనే అబ్బా ఈ మనిషికి ఏం తక్కువైందని ఇలా తాగి వస్తున్నాడు………..?? ఇప్పటికే పొగరు, అహంకారంతో నెత్తికెక్కి కూర్చున్నాడు ఇప్పుడు ఈ డ్రింకింగ్ అలవాటు కూడా ఒకటా…………..??  అసలు ఈయనతో వేగడం నా వల్ల అవుతుందా అనుకుంటూ శౌర్య వైపే చూస్తూ ఉంటుంది ………… !! అప్పుడే తన చూపును శాన్వి పై నిలిపిన శౌర్య  కళ్లు చిన్నగా చేసి చూస్తూ……….. !! 

ఏంటి మేడమ్  అర్ధరాత్రి అని కూడా లేకుండా నా కోసం వెయిట్ చేస్తున్నారా……….?? లేక మీ హస్బెండ్ ఎక్కడికి వెళ్లాడో తెలుసుకోవాలనే క్యూరియాసిటీనా  అంటూ వెటకారంగా నవ్వుతాడు………… !! 

 

శాన్వి శౌర్య  మాటలకు స్పందించకుండా చూస్తుండిపోయింది……… !! 

 

ఏంటి? నా అందమైన ముఖం చూసి మాటలు రావడం లేదా………?? లేక నా మీద కోపం ఇంకా తగ్గలేదా అంటూ మరో అడుగు ముందుకు వేశాడు………. !! అంతే ఒక్కసారిగా శౌర్య కాలు తడబడటంతో కింద పడబోయాడు…………. !! అది గమనించిన శాన్వి వెంటనే పరిగెడుతూ వచ్చి శౌర్య ను పట్టుకుంటూ ………… !! అయ్యో! చూసుకుని నడవలేరా? ఇంకొంచెం ఉంటే కింద పడిపోయేవారు అంటూ ఉండగానే……….. !! శౌర్య వెంటనే శాన్వి చేతిని విదిలించుకుంటూ హే! చేతులు తీయ్  నన్ను పట్టుకోవడానికి నువ్వెవరు……….?? నా కాళ్ల మీద నేను నిలబడగలను……….. !!

 

హు అది చూస్తూనే ఉన్నాను అని మూత తిప్పుతూ ………….!! మీ కాళ్లు కూడా మీ మాట వినడం లేదు. అలాంటప్పుడు మీకు ఇంత బిల్డప్ ఎందుకు……….?? 

 

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue