New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
YOU ARE MINE…(DEVIL LOVE 😈) – 1

YOU ARE MINE…(DEVIL LOVE 😈) – 1

 

 

 

 

 

​((( ఈ కథ, ఇందులోని పాత్రలు మరియు విభిన్నమైన సన్నివేశాలు పూర్తిగా నా మేధో సంపత్తి. నా అనుమతి లేకుండా ఈ కథను కాపీ చేసినా, వేరే పేర్లతో ఇతర ప్లాట్‌ఫామ్‌లలో పోస్ట్ చేసినా లేదా కంటెంట్‌ని మార్చి రాసినా కాపీరైట్ చట్టం కింద లీగల్ గా యాక్షన్ తీసుకుంటాను. ఈ స్టోరీ పూర్తి హక్కులు LUCKY KOTHARAPU (లక్కీ కౌతావరపు) నాకు మాత్రమే సొంతం… )))

 

 

 

​సమయం సాయంత్రం 6:15.. బెంగళూరు..

 

 

 

​అందమైన లైటింగ్, ఖరీదైన డెకరేషన్.. అక్కడ జరుగుతున్న హడావుడి చూస్తుంటే ఏదో పెద్ద పార్టీకి ఏర్పాట్లు జరుగుతున్నాయని అర్థమవుతోంది.

 

 

​”రమ్యా! అంతా బాగానే ఉంది కదా? డెకరేషన్, ఫుడ్.. ఇంకా ఎక్కడైనా పెండింగ్ పనులు ఉన్నాయా? అన్నీ ఒకసారి చెక్ చేశావా లేదా?” అని అడుగుతున్న ఆ అమ్మాయి గొంతులో పర్ఫెక్షన్ కోసం తపన కనిపిస్తోంది.

 

 

​”అవును మేడమ్! మొత్తం చెక్ చేశాను. ఎక్కడా ఏ చిన్న తప్పు కూడా లేదు. కావాలంటే మీరు ఒక్కసారి వచ్చి చూడండి” అని రమ్య సమాధానమిచ్చింది.

 

 

​”సరే, నేను వస్తున్నాను. మరో 30 నిమిషాల్లో అక్కడ ఉంటాను” అని కాల్ కట్ చేసింది ఆ అమ్మాయి.

 

 

​&&&&&&&&&&&&&&&&

 

 

​సమయం రాత్రి 7:00..

 

 

​వందల ఎకరాల్లో విస్తరించి ఉన్న ఆ భారీ మాన్షన్ గేట్ దాటి లోపలికి వెళ్తుంటే.. అది ఇల్లు కాదు, ఒక సామ్రాజ్యం అనిపిస్తుంది. దారికి ఇరువైపులా అందమైన పూల మొక్కలు, వెన్నెల్లో మెరుస్తున్న రాధాకృష్ణుల పాలరాతి విగ్రహం, గలగల పారే వాటర్ ఫౌంటైన్.. కళ్లకు ఒక విందులా ఉన్నాయి.

 

 

​అప్పుడే ఆరు బ్లాక్ కలర్ కార్లు ఒక లైన్‌గా వచ్చి లోపల ఆగాయి. అందరి కళ్లు మధ్యలో ఉన్న లేటెస్ట్ మోడల్ suv మీదనే ఉన్నాయి. బాడీగార్డ్ పరుగున వచ్చి కారు డోర్ తీయగానే.. 6.5 అడుగుల ఎత్తున్న ఒక పవర్‌ఫుల్ కటౌట్ బయటికి దిగింది.

 

 

​అతని పదునైన కళ్లు ఆ మాన్షన్ మొత్తాన్ని ఒక్కసారి స్కాన్ చేశాయి. గంభీరమైన నడకతో లోపలికి వెళ్తున్న అతనికి వెనుక నుంచి పిలుపు వినబడింది.

 

 

​”కన్నయ్యా..!”

 

 

​ఆ అడుగులు ఆగాయి. వెనక్కి తిరిగి “ఏంటి గ్రానీ?” అన్నాడు. ఆ మృదు గంభీరమైన స్వరం ఆ గదిని నిశ్శబ్దం చేసింది.

 

 

​అన్నపూర్ణ గారు (గ్రానీ) మెల్లగా దగ్గరికి వచ్చి.. “నీకు తెలుసు కదా కన్నయ్యా, ఈరోజు చిన్ని పుట్టినరోజు అని. కొంచెం ముందే రావచ్చు కదా!” అన్నారు చిన్నపాటి అలకతో.

 

 

​”యు నో ఐ హావ్ సమ్ ఇంపార్టెంట్ మీటింగ్స్ గ్రానీ!” అని 6.5 ఫీట్ హైట్ ఉన్న ఆ వ్యక్తి సమాధానమిచ్చాడు.

 

 

 

” ఎప్పుడు అలాగే చెప్తున్నావ్ కన్నయ్య ” అన్నారు మొఖం చిన్నబుచుకుంటూ..

 

 

” ఉఫ్ఫ్, నా గురించి తెలిసే నువ్వు ఇలా మాట్లాడుతున్నావా.?!”

 

 

 

​” హుమ్మ్ సరేలే అలా మాట్లాడనులే కన్నయ్యా.. వెళ్లి త్వరగా ఫ్రెష్ అయ్యి రా!” అని అన్నపూర్ణ గారు పంపించారు.

 

 

చిన్నగా నవ్వి ​అతను నేరుగా తన రూమ్‌కి వెళ్లి షావర్ కింద నిలబడ్డాడు. తన ఛాతి మీద ఉన్న గాయం నుండి రక్తం కారుతున్నా.. కనీసం దాని వైపు కన్నెత్తి కూడా చూడలేదు. అతనికి నొప్పి కన్నా లక్ష్యమే ముఖ్యం అని అతని కళ్లు చెబుతున్నాయి.

 

 

​ముప్పై నిమిషాల తర్వాత.. వైట్ అండ్ బ్లాక్ కాంబినేషన్ 3-పీస్ సూట్ ధరించి, చేతికి రోలెక్స్ వాచ్, మెడలో ప్లాటినం చైన్‌తో బయటకు వచ్చాడు. ఆ చైన్‌కి “𝓗𝓡” అనే బోల్డ్ లెటర్స్ ఉన్న లాకెట్ అతని రాయల్టీని రెట్టింపు చేస్తోంది. బ్లాక్ షూస్ వేసుకుని, రాయల్ పర్ఫ్యూమ్ స్ప్రే చేసుకుంటూ మెట్లు దిగుతున్న అతని లుక్ ఎవరినైనా మైమరపిస్తుంది.

 

 

​అతను నేరుగా మాన్షన్ వెనుక వైపు జరుగుతున్న బర్త్ డే పార్టీ దగ్గరకు నడిచాడు.

 

 

​”హలో రమ్యా! వేర్ ఆర్ యూ?”

 

 

​”మేడమ్.. నేను ఇక్కడే ఉన్నాను, మీకు ఆపోజిట్‌లో!”

 

 

​”ఓకే, అంతా పర్ఫెక్ట్‌గా ఉందా రమ్యా? ఈ ఈవెంట్ మనకి చాలా ప్రెస్టీజియస్. ఎక్కడా ఏ మిస్టేక్ జరగకూడదు.”

 

 

​”నో మేడమ్, ఎవ్రీథింగ్ ఇస్ చెక్డ్!”

 

 

​”గుడ్ జాబ్ రమ్యా.. సరే నాకు వేరే వర్క్ ఉంది, నేను వెళ్తున్నాను. నువ్వు అంతా మేనేజ్ చేసి, పార్టీ అయ్యాక పేమెంట్ చెక్ తీసుకుని రా!” అని వెనక్కి తిరిగి వెళ్తున్న ఆ అమ్మాయి.. ఒక్కసారిగా ఆగిపోయింది.

 

 

​కళ్లముందు 6.5 అడుగుల ఎత్తులో.. ఒక గ్రీకు విగ్రహంలా నడిచి వస్తున్న ఆ పర్సన్ (కన్నయ్య)ని చూసి ఆమె ప్రాణం అక్కడ స్తంభించిపోయింది. తన కళ్లను తానే నమ్మలేక.. రెప్ప వేయడం మర్చిపోయి అలాగే చూస్తూ ఉండిపోయింది.ఎందుకో తెలియదు అతనిని అలానే చూస్తూ ఉండిపోవాలి అనిపిస్తుంది ఆమెకి.

 

 

​@@@@@@@@@@@@@@

 

 

​TO BE CONTINUED…

 

​HR లెటర్స్ మీనింగ్ ఏంటి అంటారు?

 

​మీ లక్కీ కౌతావరపు… ✍️