New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
YOU ARE MINE…(DEVIL LOVE 😈) – 2

YOU ARE MINE…(DEVIL LOVE 😈) – 2

 

 

 

 

“ఏమైంది మేడమ్.. అలా ఆగిపోయారు?” అని రమ్య అడిగింది.

 

 

​”రమ్యా! అతను…” అని ఆమె అనేలోపే, రమ్య తన మేడమ్ చూపించిన వైపు చూసి.. “అతను ఎవరో మీకు తెలియదా మేడమ్?” అని అడిగింది.

 

 

​”అతన్ని ఎక్కడో చూసినట్లుంది రమ్యా!” అంది తన మేడమ్.

 

 

​”అతను ‘సింహ వాసుసేన’ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ (RSV COMPANIES) సీఈఓ! ది యంగెస్ట్ అండ్ డైనమిక్ రూత్‌లెస్ బిజినెస్ మ్యాన్ ‘రణ్‌వీర్ సింహ వాసుసేన’ మేడమ్. తన ఫ్యామిలీని కానీ, తన బిజినెస్‌ని కానీ టచ్ చేయాలనే ఆలోచన ఎవరు చేసినా.. వాళ్లను ఈ భూమి మీద లేకుండా చేస్తాడు మేడమ్! అతను అంత డేంజర్ మ్యాన్ అని అందరూ అంటారు” అని చెప్పింది రమ్య.

 

 

​ఒక్క నిమిషం మేడమ్.. చెప్పడం మర్చిపోయా, కొంచెం దగ్గరికి రండి అని చాలా చిన్నగా.. “అతన్ని అండర్‌వర్ల్డ్ మాఫియా కింగ్ ‘బ్లాక్ ఈగల్’ అని కూడా పిలుస్తారు మేడమ్. అందుకే అంత సెక్యూరిటీ! చూడండి, మన చుట్టుపక్కలే 10 నుండి 20 మంది గన్‌మెన్ ఉన్నారు. ఇక్కడే ఇంతమంది ఉన్నారంటే.. ఈ మాన్షన్ మొత్తం ఎంతమంది గార్డ్స్ ఉంటారో కదా! సో, అతని గురించి మాట్లాడుకోవడం కూడా మనకి డేంజర్ మేడమ్” అని చెప్పింది రమ్య.

 

 

​మళ్లీ ఇంతలోనే తానే మాట్లాడుతూ.. “చూడండి మేడమ్ ఎలా ఉన్నాడో! 6.5 అడుగుల ఎత్తు, ఒత్తైన సిల్కీ హెయిర్ నుదిటిని ఆక్యుపై చేసి ఉంది. చిరుత లాంటి చురకత్తుల్లాంటి బ్రౌన్ కనుపాపలు ఉన్న ఆ కళ్లు, ఒత్తైన ఐబ్రోస్, మీసకట్టు, లైట్ బియర్డ్, మంచి జా-లైన్, V-షేప్ సిక్స్ ప్యాక్ బాడీ, ఫెయిర్ వైట్ స్కిన్ టోన్.. అబ్బబ్బ! చూడటానికి అమ్మాయిల రాకుమారుడిలా ఉన్నాడు. ఇలాంటి వాడి కోసమే కదా అమ్మాయిలు కోరుకునేది! మెయిన్‌గా ఆ కళ్ల చూపుతోనే చంపేస్తున్నాడు. ఆ నెక్ దగ్గర ఈగల్ టాటూ చూడండి..” అని ఇంకా చెప్తుండగానే..

 

 

​రమ్య మాటల మధ్యలో బ్రేక్ వేసి.. “చాలు ఇంకా, పద వర్క్ చూడు” అని విసిగించుకుంది రమ్య మేడమ్.

 

 

​తాను కూడా అక్కడ నుంచి పార్టీ జరిగే ఏరియాకి వెళ్లేందుకు అడుగులు వేసింది.

 

 

​😈😈😈😈😈😈😈😈

 

 

​రణ్‌వీర్ పార్టీ జరిగే ప్లేస్‌లోకి వెళ్లాడు. “వాట్ హాపెండ్ గ్రానీ? పార్టీ ఇంకా స్టార్ట్ చేయలేదు?” అని మృదు గంభీరమైన వాయిస్‌తో అన్నపూర్ణమ్మ గారిని అడిగాడు.

 

 

​”బ్రో! నువ్వు రాలేదని బర్త్‌డే చేసుకోను అని చిన్ని రూమ్‌లోకి వెళ్లి డోర్ వేసుకుని కూర్చుంది. ఎంత పిలిచినా రావట్లేదు, నువ్వే ఒకసారి పిలు బ్రో!” అని చెప్పాడు రణ్‌వీర్ రెండవ తమ్ముడు రణధీర్ సింహ వాసుసేన (ధీర్).

 

 

​”ఓకే, ఐ విల్ బ్రింగ్ చిన్ని..”

 

 

​రణ్‌వీర్ రూమ్ దగ్గరికి వెళ్లి “చిన్నీ..” అని పిలిచాడు. అతని పిలుపు కోసం వెయిట్ చేస్తున్న చిన్ని, ఆ స్వర వినపడిన మరుక్షణం రూమ్ డోర్ తీసి “అన్నయ్యా..” అంటూ గట్టిగా హగ్ చేసుకుంది.

 

 

​రణ్‌వీర్ చిన్నిని సున్నితంగా దూరం జరిపి, “పార్టీకి టైమ్ అవుతుంది కదా, అందరూ వెయిట్ చేస్తున్నారు” అని చెప్పి పార్టీ ఏరియాకి తీసుకెళ్లాడు.

 

 

​పార్టీ ఏరియా మొత్తం చాలా ఆహ్లాదకరంగా ఉంది. పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్స్, రాజకీయ నాయకులు, RSV గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఎంప్లాయీస్, మూవీ యాక్టర్స్.. ఇలా చాలామంది పార్టీకి అటెండ్ అయ్యారు.

 

 

​చిన్ని కోసం వెయిట్ చేస్తున్న అందరూ ఆమె రాకతో సంతోషించారు. చిన్ని చేత కేక్ కట్ చేయించి, రణ్‌వీర్ ఆమె కోసం న్యూ మోడల్ ‘ఫెరారీ’ కార్ గిఫ్ట్‌గా ఇచ్చాడు.

 

 

​”ఐ యామ్ సో హ్యాపీ యు కేమ్ టు మై బర్త్‌డే బ్రో! నాకు ఏ గిఫ్ట్ వద్దు” అని చెప్పింది చిన్ని అలియాస్ రిద్విక సింహ వాసుసేన (రణ్‌వీర్ చెల్లెలు).

 

 

​రణ్‌వీర్ పెదవులపై ఒక కనిపించీ కనిపించని నవ్వు చిందించి వదిలేశాడు.

 

 

​బార్ కౌంటర్ దగ్గరికి వెళ్లి తన బెస్ట్ ఫ్రెండ్ అండ్ పీఏ ‘రిషి కుమార్’ పంపించిన న్యూ ప్రాజెక్ట్‌కి సంబంధించిన డీటైల్స్ చెక్ చేస్తూ విస్కీ సిప్ చేస్తున్నాడు.

 

 

​కొంత సమయం తర్వాత డిన్నర్ స్కిప్ చేసి, తన రూమ్‌కి వెళ్లి ఫ్రెష్ అయ్యి వచ్చి, కింగ్ సైజ్ బెడ్ మీద అడ్డంగా పడుకున్నాడు రణ్‌వీర్.

 

 

​🌊🌊🌊🌊🌊🌊🌊🌊🌊🌊🌊🌊

 

 

​”ఈవెంట్ అరేంజ్‌మెంట్స్ అన్నీ చాలా బాగున్నాయి, రణ్‌వీర్ సార్‌కి బాగా నచ్చాయి. సో టుమారో మార్నింగ్ ఆఫీస్‌కి వచ్చి చెక్ తీసుకోమన్నారు” అని చెప్పాడు రిషి.

 

 

​”ఓకే సార్! రేపు మార్నింగ్ వచ్చి చెక్ తీసుకుంటాం సార్!” అని చెప్పి రమ్య వెళ్ళిపోయింది.

 

 

​”ఏమైంది రమ్యా? ఎందుకు లేట్ అయింది?” అని అడిగింది తన మేడమ్.

 

 

​”నథింగ్ మేడమ్! రణ్‌వీర్ సార్‌కి మన ఈవెంట్ అరేంజ్‌మెంట్స్ అన్నీ బాగా నచ్చాయంట. సో ఒకసారి మిమ్మల్ని రేపు మార్నింగ్ ఆఫీస్ దగ్గరికి వచ్చి కలిసి చెక్ తీసుకోమని చెప్పారు మేడమ్” అని రణ్‌వీర్ సార్ పీఏ రిషి గారు చెప్పారు.

 

 

​”ఓకే! రా, లేట్ అయింది.. బాబాయ్ మన కోసం వెయిట్ చేస్తున్నారు” అని చెప్పి రమ్య మరియు సో-కాల్డ్ మేడమ్ ఇంటికి స్టార్ట్ అయ్యారు.

​కొంత సమయం తర్వాత.. ఒక డ్యూప్లెక్స్ హౌస్ పోర్టికోలో కార్ పార్క్ చేసి లోపలికి వెళ్లారు. హాల్లో వీళ్ల కోసం వెయిట్ చేస్తున్న ఫ్యామిలీ మెంబర్స్ అందరూ సోఫాలో కూర్చుని కనిపించారు.

 

 

​”చిట్టితల్లీ! ఇంత లేట్ అయింది ఏంటమ్మా?” అని అడిగారు తండ్రి అయిన విక్రమ్ చక్రవర్తి గారు.

 

 

​”డాడీ! నేను వర్క్ చేసేది ఈవెంట్ ప్లానర్ మేనేజర్‌గా.. సో లేట్ అవ్వడం కామన్ కదా!”

 

 

​”ఏంటే కామన్? అర్ధరాత్రి వరకు వర్క్ అని చెప్పి ఇంటికి రావడం.. రోజులు మంచిగా ఉన్నాయా? ఆడపిల్లలు ఈ రోజుల్లో పగలే ఇంటికి సరిగ్గా వస్తారని చెప్పలేకపోతున్నాం, మీకు నైట్ టైమ్ జాబ్స్ అవసరమా?” అని విసిగారు తల్లి అయిన వాసవి విక్రమ్ చక్రవర్తి గారు.

 

 

​”మామ్! బంగారంని ఏమనకు” అన్నాడు విజయ్ చక్రవర్తి (తన అన్నయ్య).

 

 

​”ఏంట్రా అనకు అని..” అంటూ ఏదో అంటున్న వాసవి గారితో,

 

 

“పెద్దమ్మా! నాకు ఆకలి వేస్తోంది” అంది రమ్య.

 

 

​”అయ్యో! ఇంకా తినలేదా మీరు? ఇప్పుడే రెడీ చేస్తాను” అని వంటగదిలోకి వెళ్లారు వాసవి గారు.

 

 

​”పెద్ద నాన్నా! అమ్మ, నాన్న ఎక్కడ?” అని విక్రమ్ గారిని అడిగింది రమ్య.

 

 

​”పడుకున్నారుమ్మా.. నువ్వు వెళ్లి ఫ్రెష్ అయ్యి రా, డిన్నర్ చేద్దువుగాని” అన్నారు.

 

 

​”ఓకే!” అని వెళ్ళింది రమ్య.

 

 

​”చిట్టితల్లీ.. నువ్వు కూడా ఫ్రెష్ అయ్యి డిన్నర్ చేయి, లేట్ అయింది. రేపు ఆఫీస్‌లో ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది, నేను పడుకుంటున్నాను. గుడ్ నైట్ బంగారం” అని చెప్పి రూమ్‌లోకి వెళ్లారు విక్రమ్ గారు.

 

 

​”నువ్వు వెళ్లి ఫ్రెష్ అవ్వు బంగారం, నేను వెళ్తున్నా. నాకు రేపు కోర్టులో కేస్ ఉంది, గుడ్ నైట్” అని చెప్పి తన రూమ్‌లోకి వెళ్తున్న వాడిని..

 

 

“అన్నయ్యా! బావ వచ్చాడా?” అని అడిగింది చిట్టితల్లి.

 

 

​”లేదుమ్మా..” అని నవ్వుతూ, “రేపు మార్నింగ్ నువ్వు కళ్లు తెరిచే సమయానికి నీ ముందు ఉంటాను అని చెప్పమన్నాడు” అని చెప్పి వెళ్లాడు విజయ్.

 

 

​”రమ్యా! నువ్వేంటి ఇంకా పడుకోలేదు?” అని అడిగింది చిట్టితల్లి.

 

 

​”లేదు అక్కా.. నేను ఫ్రెష్ అయ్యి వచ్చాను. పెద్దమ్మ నిన్ను పిలవమంది డిన్నర్ కోసం, అందుకే వచ్చా” అని చెప్పింది రమ్య.

 

 

​”హో! నాకు ఆకలిగా లేదు రమ్యా, నువ్వు తినేసేయ్. రేపు మార్నింగ్ తొందరగా నిద్రలేవు, ఆఫీస్‌కి వెళ్లే ముందు రణ్‌వీర్ సార్ ఆఫీస్‌కి వెళ్లి చెక్ తీసుకుని ఆఫీస్‌కి వెళ్లాలి. గుడ్ నైట్” అని చెప్పి తన రూమ్‌లోకి వెళ్లి ఫ్రెష్ అయ్యి మంచి స్లీప్ వేసింది చిట్టితల్లి.

 

 

​కొంత సమయానికి రమ్య కూడా డిన్నర్ చేసి, “గుడ్ నైట్ పెద్దమ్మా” అని వాసవి గారికి చెప్పి రూమ్‌లోకి వెళ్లి పడుకుంది.

 

 

​కొంతసేపటికి వాసవి గారు కూడా కిచెన్ క్లీన్ చేసుకుని వెళ్లి పడుకున్నారు.

 

 

​పాత్రల వివరాలు..

 

​హీరో ఫ్యామిలీ:

 

 

​రణ్‌వీర్ (హీరో / RSV కంపెనీస్ CEO / మాఫియా కింగ్ “బ్లాక్ ఈగల్”)

​రణధీర్ – ధీర్ (హీరో 2వ తమ్ముడు)

​రిద్విక – చిన్ని (హీరో చెల్లెలు)

​అన్నపూర్ణమ్మ – గ్రానీ (హీరో నానమ్మ)

​రిషి కుమార్ (హీరో బెస్ట్ ఫ్రెండ్ & పీఏ)

 

 

​హీరోయిన్ ఫ్యామిలీ:

 

 

​చిట్టితల్లి (హీరోయిన్ – అసలు పేరు ఇంకా రివీల్ కాలేదు)

​విక్రమ్ చక్రవర్తి (హీరోయిన్ తండ్రి)

​వాసవి చక్రవర్తి (హీరోయిన్ తల్లి)

​విజయ్ చక్రవర్తి (హీరోయిన్ అన్నయ్య – లాయర్)

​రమ్య (హీరోయిన్ బాబాయ్ కూతురు / చెల్లెలు)

​బావ (అత్త కొడుకు – నేమ్ నెక్స్ట్ పార్ట్‌లో రివీల్ అవుతుంది)

 

 

​@@@@@@@@@@@@@@

 

 

TO BE CONTINUED…

​ప్లీజ్ డూ ఫాలో …కామెంట్ ప్లీజ్..