New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
YOU ARE MINE…(DEVIL LOVE 😈) – 4

YOU ARE MINE…(DEVIL LOVE 😈) – 4

 

 

 

 

 

“బావా! నువ్వు ఆఫీస్‌కే వెళ్తున్నావా?”

 

 

​”హ్మ్మ్… ఎందుకు బుజ్జీ అలా అడుగుతున్నావు? ఐనా మనకి న్యూ కొలాబ్ ఉంది కదా, రణ్‌వీర్ సార్ టుడే అపాయింట్‌మెంట్ ఇచ్చారు. సో వెళ్లాలి”

 

 

​”ఎక్కడ బావా ఆఫీస్? ఆ ఏరియాలోనేనా ఇంతకీ? నిన్ను ఎక్కడ డ్రాప్ చేయాలి?”

 

 

​”సేమ్ ఆఫీస్ బావా!” నవ్వుతూ చెప్పింది.

 

 

​”హో….. ఐతే ఇంకేం! అక్కడ పని అయ్యాక ఇద్దరం కలిసి వెళ్దాం బుజ్జీ”

 

 

​”హ్మ్…. ఒకే బావా! నైట్ డిన్నర్‌కి వెళ్దాం, బీచ్ రెస్టారెంట్‌కి! ఓకేనా? నేను టేబుల్ ఇప్పుడే రిజర్వేషన్ చేస్తాను.”

 

 

​హర్షిత్ సడన్‌గా కార్ బ్రేక్ వేసి బుజ్జి వైపు చూశాడు.

 

 

​”ఏమైంది బావా?” అని మాట్లాడుతున్న బుజ్జి పెదవులపై వేలు పెట్టి “ఉష్..” అంటూ తన వైపు వంగిపోయాడో హర్షిత్.

 

 

​ఆమె ఫేస్ మీద “ఉఫ్..” అని గాలి ఊదుతూ, “బుజ్జీ.. డిన్నర్ మాత్రమేనా?” అని డీప్ వాయిస్‌తో అన్నాడు.

 

 

​”బా….వా! ఏమ్… ఏమైంది నీకు?” అని కంగారు పడుతూ చేతులు చాచి అడిగింది.

 

 

​”బుజ్జీ! ఎందుకు అంత కంగారు? కూల్!” అని తన నుదిటి మీద పట్టిన చెమటను వేలితో తుడుస్తూ అన్నాడు.

 

 

​”నీ మైండ్‌లో ఏం రన్ అవుతుందో నాకు తెలుసులే.. లేట్ అవుతుంది పద వెళ్దాం.”

 

 

​”ఎక్కడికి వెళ్లేది? ఆఫీస్ వచ్చి చాలాసేపు అయింది, దిగు!” అని నవ్వుతూ చెప్పాడు హర్షిత్.

 

 

​బయట చూసి.. “అప్పుడే వచ్చిందా?” అని హర్షిత్ ఫేస్ వైపు చూసింది.

​హర్షిత్ వింక్ చేసి నవ్వుతూ కార్ దిగాడు. వెనకే బుజ్జి కూడా దిగింది. ఇద్దరూ ఆఫీస్‌లోకి ఎంటర్ అయ్యారు…

 

 

​”హౌ కెన్ ఐ హెల్ప్ యు సార్?” రిసెప్షనిస్ట్ అయిన అమ్మాయి మర్యాదగా అడిగింది.

 

 

​”యా.. అది రణ్‌వీర్ సార్ అపాయింట్‌మెంట్ ఇచ్చారు. ఇద్దరికీ విడిగా ఇచ్చారు, ఒకసారి చెక్ చేస్తారా?”

 

 

​”యా షూర్ సార్! డీటైల్స్ చెప్పండి.. సార్, నేను మేనేజ్‌మెంట్‌కి ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ప్లీజ్ వెయిట్ ఏ ఫ్యూ మినిట్స్ సార్!”

 

 

​”ఓకే” అని వెయిటింగ్ లాంజ్‌లో కూర్చున్నారు.

 

 

​😈😈😈😈😈😈😈😈😈😈😈😈😈

 

 

​ప్రాజెక్ట్ గురించి మొత్తం ఎక్స్‌ప్లెయిన్ చేశాక…..

 

 

​”ఎనీ డౌట్స్?” అని గంభీరంగా అడిగాడు రణ్‌వీర్.

 

 

​”నో సార్!” అని అందరూ ముక్తకంఠంతో ఒకేసారి చెప్పారు.

 

 

​”ఓకే! ప్రాజెక్ట్ చిన్నదా పెద్దదా అని కాకుండా, హార్డ్ వర్క్‌తో డెడ్‌లైన్ లోపు కంప్లీట్ చేయాలి.. మైండ్ ఇట్!” అని చెప్పి తన ఛాంబర్‌లోకి వెళ్లి పిసి ముందు కూర్చుని వర్క్ స్టార్ట్ చేశాడు.

 

 

​”రాణా! ఈవెంట్ మేనేజర్ అండ్ న్యూ ప్రాజెక్ట్ కొలాబ్ ఉంది కదా, ఆ కంపెనీ CEO వచ్చారు” అని లోపలికి వచ్చి చెప్పాడు రిషి.

 

 

​”ఇడియట్! డోంట్ కాల్ మీ రాణా! జస్ట్ కాల్ మీ రణ్‌వీర్, స్టూపిడ్!” అని పేపర్ వెయిట్ విసిరేశాడు రణ్‌వీర్.

 

 

​”హమ్మో…” గుండెల మీద చేతులు వేసుకుని.. “చంపేస్తావా రా?” అన్నాడు రిషి.

 

 

​రణ్‌వీర్ ఒక కన్నింగ్ స్మైల్ ఇచ్చి.. “వాళ్లను పంపించు” అన్నాడు.

 

 

​”ఓకే సార్!” అని మనసులో ‘సైకో నా కొడుకా’ అనుకున్నాడు రిషి.

 

 

​”యెస్, ఐ యామ్ ఎ సైకో! ఇంకా తిట్టుకోవడం ఆపి వాళ్లను పంపు. ఇంకా టైమ్ వేస్ట్ చేస్తే పనిష్మెంట్ ఇస్తాను” అని హార్డ్ టోన్‌లో అన్నాడు రణ్‌వీర్.

 

 

​”వద్దు సార్!” అని పిచ్చి నవ్వు ఒకటి నవ్వి బయటకు వెళ్ళిపోయాడు రిషి.

 

 

​కొద్ది నిమిషాల తర్వాత :-

 

 

​”ఎక్స్‌క్యూజ్ మీ సార్!” అనే స్వీట్ వాయిస్ వినిపించింది.

 

 

​”యెస్, కమ్ ఇన్!” అని బేస్ వాయిస్‌తో చెప్పి, తల ఎత్తి చూసి అలానే ఫ్రీజ్ అయిపోయాడు రణ్‌వీర్.

 

 

​5.3 అడుగుల ఎత్తు, బ్లాక్ కలర్ అనార్కలీ డ్రెస్, వన్ సైడ్ దుపట్టా వేసుకుని ఎక్కడా క్లీవేజ్ కనపడకుండా ఉంది. చెవులకి చిన్న స్టడ్స్, ముక్కుకి చిన్న ముక్కుపుడక, మెడలో సింపుల్‌గా గోల్డ్ చైన్ దానికి చిన్న లాకెట్, చేతికి వాచ్, కాళ్లకి పట్టీలు, ముఖ్యంగా ఒత్తైన జడ, రెండు కనుబొమ్మల మధ్య చిన్న బ్లాక్ కలర్ స్టిక్కర్, దాని కింద కుంకుమ, కళ్లకు కాటుక, పెదవులకు లిప్‌స్టిక్ వేయకుండానే మెరుస్తున్న పింక్ బేబీ లిప్స్, ఫెయిర్ వైట్ స్కిన్ టోన్.. శిల్పి శ్రద్ధ పెట్టి మరీ చెక్కిన పాలరాతి శిల్పంలా ఉంది!

 

 

​రణ్‌వీర్‌కి తెలియకుండానే తన పెదాలు “ఇంప్రెసివ్!” అని పలికాయి.

 

 

​”సార్….” అని పిలిచింది.

 

 

​రణ్‌వీర్ ఆ ట్రాన్స్ లోంచి బయటకి వచ్చి.. “యా, కమ్.. సిట్!” అని చైర్ ఆఫర్ చేశాడు.

 

 

​”థాంక్యూ సార్! సార్ వచ్చి కలవమన్నారు అని రిషి గారు చెప్పారు?”

 

 

​”యెస్ మిస్.. వాట్ ఈజ్ యువర్ నేమ్?” (రిషి, రణ్‌వీర్ చెవిలో పేరు చెప్పాడు).

 

 

​”యెస్, మిస్ లక్ష్మి హైమావతి విక్రమ్ చక్రవర్తి! ఐ యామ్ ఇంప్రెస్స్డ్ విత్ యువర్ ఈవెంట్ అరేంజ్‌మెంట్స్.”

 

 

​”నెక్స్ట్ మంత్ అవర్ కంపెనీస్ 50త్ యానివర్సరీ, సో ఐ హావ్ కాల్డ్ ఫర్ దిస్ ఈవెంట్.”

 

 

​”థాంక్యూ సో మచ్ సార్! మా మీద నమ్మకం ఉంచి మాకు ఈ ఈవెంట్ ఇస్తున్నందుకు. ఈవెంట్‌ని ఖచ్చితంగా సక్సెస్ చేస్తాం.. ట్రస్ట్ మీ సార్!”

 

 

​”యా, ఐ విల్ ట్రస్ట్ యు!”

 

 

​”ఓకే సార్, కెన్ ఐ గో?”

 

 

​”యెస్… వన్ మినిట్!”

 

 

​”వాట్ హాపెండ్ సార్?” అని వెళ్తున్నది కాస్త ఆగి అడిగింది.

 

 

​”నథింగ్! వై ఈజ్ యువర్ నేమ్ సో ఓల్డ్? ఐ మీన్.. ఈ జనరేషన్ నేమ్స్ పొష్ & యూనిక్‌గా ఉంటాయి కదా?”

 

 

​”ఈ పేరు మా అత్తగారి పేరు సార్. మా అత్త చనిపోయాక 2 ఇయర్స్‌కి నేను పుట్టాను అని, మా డాడీ వాళ్ల చెల్లెలే తన కూతురిగా పుట్టిందని ఈ నేమ్ పెట్టారు. నాకు ఈ నేమ్ నచ్చింది, అందుకే ఎప్పుడూ ఈ పేరు నాకు ఎందుకు పెట్టారని క్వశ్చన్ చేయలేదు. ఐనా నాకు మా డాడీ కంటే ఏది ఎక్కువ కాదు సార్!” అని చిరునవ్వుతో చెప్పింది.

 

 

​”యా, ఐ లైక్ యువర్ నేమ్! యెస్, యు కెన్ గో నౌ. అండ్ ఈవెంట్ డీటైల్స్ రిషి మీకు ఇన్ఫార్మ్ చేస్తాడు.”

 

 

​”ఓకే సార్! నైస్ టు మీట్ యు సార్, మళ్లీ కలుద్దాం!” అని వెళ్ళిపోయింది.

 

 

​తను వెళ్లేంతవరకు చూసి.. “రిషి!” అని బేస్ వాయిస్‌తో పిలిచాడు.

 

 

​అప్పటివరకు తన బాస్ ఒక అమ్మాయితో ఇంత మాట్లాడటం చూసి ఆశ్చర్యపోతున్న రిషి.. రణ్‌వీర్ పిలవగానే “యెస్ సార్!” అని వర్క్ మోడ్‌లోకి వచ్చాడు.

 

 

​”రిషి! ఐ వాంట్ హర్ ఫుల్ డీటైల్స్ వితిన్ 2 అవర్స్!” అని బేస్ వాయిస్‌తో చెప్పాడు.

 

 

​”ఓకే సార్!” అని రిషి వెళ్లాడు. రిషి వెళ్లిన వెంటనే రణ్‌వీర్ రిలాక్స్‌గా చైర్‌లో వాలి.. “గెట్ రెడీ ఫర్ ది గేమ్… హై…మా…వ…తి!” అని కన్నింగ్ స్మైల్ ఇచ్చాడు.

 

 

​TO BE CONTINUED…

​ప్లీజ్ కామెంట్ & లైక్ చేయండి!

ఇగ్నోర్ ది మిస్టేక్స్…..