** అజేయ – 10 **
రాఘవ్ ముఖంలో ఉన్న అలసట, కళ్ల కింద చేరిన స్వల్ప నలుపు ఆ వృద్ధ ప్రొఫెసర్ కళ్లను దాటిపోలేకపోయాయి..
రాఘవ్ కి సీట్ ఆఫర్ చేస్తూనే “Raghav, your paper was brilliant. But you look exhausted. What’s bothering you?”
(రాఘవ్, నీ రీసెర్చ్ పేపర్ అద్భుతంగా ఉంది. కానీ నువ్వు చాలా అలసిపోయినట్లు కనిపిస్తున్నావు. నిన్ను ఏది వేధిస్తోంది?) అని అడిగాడు ప్రొఫెసర్..
ఆయన వాయిస్‌లో ఒక మెంటార్‌కి ఉండాల్సిన శ్రద్ధ, ఆందోళన స్పష్టంగా కనిపించడం తో…రాఘవ్ ఒక్క క్షణం ఆగాడు…
ఒక ప్యూర్ సైంటిస్ట్ అయిన కార్లిసన్ కి తన మానసిక స్థితిని, ఆ వింత కలలను చెబితే నమ్ముతాడా లేదా అనే సందేహం అతని మైండ్‌లో మెదిలింది..