** అజేయ – 25**
స్క్రీన్ మీద కనిపిస్తున్న ‘Unknown Number’ నీ చూస్తూ.. భృకుటి ముడి వేసిన రాఘవ్ నడక ఆపకుండానే ఫోన్ లిఫ్ట్ చేసి చెవి దగ్గర పెట్టుకుంటూ..
“హలో,హు ఇస్ థిస్ ” అన్నాడు చాలా క్యాజువల్ గా..
అవతల వైపు నుండి ఒక వింతైన, గంభీరమైన వాయిస్ వినిపించింది.. ఆ వాయిస్ లో ఒక రకమైన క్రూరత్వం, మైండ్ గేమ్స్ ఆడే వ్యక్తి యొక్క కాన్ఫిడెన్స్ ఉంది..
ఆ వ్యక్తి ఎవరో కాదు.. అండర్ గ్రౌండ్ మాఫియా కింగ్ పిన్..”రాఘవ్… నువ్వు లండన్ వదిలి చాలా పెద్ద తప్పు చేస్తున్నావు.. కొన్ని రహస్యాలు భూమి లోపలే ఉంటే బాగుంటుంది..
వాటిని తవ్వాలని చూస్తే, ఆ భూమి నిన్నే మింగేస్తుంది. లండన్ లో నీకు మంచి ఫ్యూచర్ ఉంది, దాన్ని పాడు చేసుకోకు.. బోర్డింగ్ గేట్ నుండి వెనక్కి తిరిగి వెళ్ళిపో,” అని అవతలి వ్యక్తి హెచ్చరించాడు.. అది వాళ్ళ రివర్స్ సైకాలజీ..