New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more
అన్వాంటెడ్ లవ్ – 16

అన్వాంటెడ్ లవ్ – 16

ఏమైంది రా అని అనసూయ అడిగితే…

 

హా ఏముంది బామ్మ… మొన్నే ఓ కేస్ వచ్చింది… అబ్బా పెద్ద తలనొప్పి అయిపోయింది… అసలే పెద్ధింటోళ్లు… అందులో పెద్దావిడ… తన సవితి పిల్లల్ని అస్సలు మనిషిలా చూడరు…

 

 

ఆ పిల్లలేమో అమాయకులు ఏమ్ ఏం చేసిన ఎదురు  తిరగరు అనే ధైర్యంతో చిత్రహింసలు పెడుతూ ఉంది అని అనసూయ ఫేస్ ని చూస్తూ చెప్పాడు ధర్మ 

 

అనసూయ ముఖంలో కదలికలు మారుతూ ఉంటే  ఓపిక నశించిన ఆ పిల్లలు మా దగ్గరకు వచ్చి కేసు ఫైల్ చేశారు… మాదాకొస్తే ఎలా ఉంటుందో తెలుసా బామ్మ అని అడిగాడు…

 

 

దానికి అనసూయ గుటకలు మింగుతూ తన భయాన్ని బయటకి చూపించకుండా ఉండటానికి చాలా గట్టిగా ప్రయత్నిస్తూ సైలెంట్ గా ఉంటే…

 

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue