తనని ఇక్కడ ఎవరు పిలుస్తున్నారు అని అరుపు వినిపించిన వైపు చూసినా తనకి ఎవరు కనిపించక నన్నెవరూ పిలిచారు అని టెన్షన్ స్టార్ట్ అయింది…
ఇంద్ర ఏమైనా తను ఎక్కడుందో కనుక్కున్నాడా అనే సందేహంతో నుదుటికి చెమటలు స్టార్ట్ అయితే తుడుచుకుంటున్న తనకి మరోసారి స్వర్ణ అని వినిపించింది కోయల్ పిలుపు….
ఈ వాయిస్ లేడీస్ వాయిస్ లా ఉంది… అయినా ఏదో ఆపదలో ఉన్నట్టు అరుస్తున్నారేంటి అని పిలుపు వినిపించినా సైడ్ మెల్లిగా అడుగులు వేయడం మొదలు పెట్టింది….
స్వర్ణ కి కోయెల్ వాళ్ళకి మధ్యలో రెండు కార్ లు అడ్డుగా ఉండి కనిపించడం లేదు…