విచిత్రంగా ఇంద్రనే చూస్తుంటే స్వర్ణ రెండు చేతులు పట్టుకొని నాతో పాటు మన ఇంటికి వచ్చేయ్ స్వర్ణ అని అడిగాడు..
మన ఇల్లా???? అని ఆ చేతులు విడిపించుకోడానికి ప్రయత్నస్తుంటే వదలని ఇంద్రని చూస్తూ ఎవరు సర్ మీరు మన ఇంటికి వచ్చేయ్ అంటున్నారు అసలు ఎవరు మీరు??? ఎందుకు నన్ను మీ ఇంటికి రమ్మంటున్నారు??? మీ ఇంట్లో వాళ్ళకి కూడా కేర్ టేకర్ అవసరం ఉందా?? అని ఇంద్ర ఎవరో తెలియదు అన్నట్టుగా అడిగింది స్వర్ణ…
స్వర్ణ!! అని అభిమానంగా పిలిచినా అది కాస్త కోపంగానే వినపడింది స్వర్ణ కి…
ఏంటి సర్!! చెప్పండి ఎందుకు ఊరికే పిలుస్తున్నారు… నాతో ఏమైనా పని ఉందా మీకు ??? అని అడిగింది…