అర్జున్ -19
కార్తీక్: రేయ్, అర్జున్….. ఆ గుడి తాళం నీకు ఎక్కడ దొరికింది రా???
అర్జున్: అదా, ఈ రూమ్ లోనే… ఇది మా తాతయ్య గది కదా… తాతయ్య చనిపోయాక ఇక్కడ ఎవరు ఉండలేదు… అంటే ఈ గది లో ఎవరు ఉండలేదు… నేను, గన్ పెట్టడానికి సేఫ్ ప్లేస్ వెతుకుతున్నపుడు… ఆ తాళం కనపడింది… ఆ తాళం జగన్నాథం గారికి చూపిస్తే… గుడిది అని చెప్పారు… సో, తీసుకొని వెళ్లి గుడి ఓపెన్ చేశా….
కార్తీక్: అది, సరే… మరి, ఆ మూడో గది తెరిచా అన్నావ్ కదా?? ఆ తాళం ఎక్కడ నుండి వచ్చింది రా?? ఆ గది లో ఏం ఉంది అని నువ్వు నాకు చెప్పలేదు ఆ రోజు?? అని విషయాలు చెప్పావు… కానీ, ఆ మూడో గది తాళం ఎక్కడ దొరికింది ఇంకా ఏం ఉంది అని చెప్పలేదు రా నువ్వు…….