New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
నీ నీడనై నిన్ను చేరనా – 3

నీ నీడనై నిన్ను చేరనా – 3

              నీ నీడనై నిన్ను చేరనా 3

 

 

ముందు భాగాలు చదివి ఇది చదవగలరు…

 

 

@ @ @ @ @ @ @ @ @ @ @ @ @ @ @ @ @

 

 

ముంబై మహానగరం : –

 

మహాలక్ష్మి నిలయం. :-

 

రాజభవనం లాంటి ఇల్లు పేరుకి తగ్గట్టుగానే ఇంట్లో సిరి సంపదలు అష్టైశ్వర్యాలు లోటు లేకుండా తుల తూగుతూ ఉంది………

 

పూజ గదిలో ఒక మధ్య వయస్సు  ఆవిడ సుమారు 45 సంవత్సరాల ఏమో బహుశా……. కళ్ళల్లో సంద్రం ఉప్పొంగుతున్న దేవుడికి నమస్కరిస్తూ కళ్ళ నీళ్ళతో ప్రార్థిస్తుంది……..

 

 

ఒక ఆవిడ అక్క అని పిలుచుకుంటూ వచ్చి పూజ గది కన్నీళ్లతో దేవుడు ప్రార్థిస్తున్నా ఆమెను చూసి డిస్టర్బ్ చేయకుండా కళ్ళ నీళ్ళతో వెనక్కి వచ్చేసింది……….

 

 

పూజ ముగించుకుని అందరికీ హారతి ఇచ్చి సోఫాలో సెటిల్ అయ్యారు…….

 

 

ఒకతను అక్కడికి వచ్చి వాళ్ళ పక్కనే సోఫా లో సెటిల్ అయ్యారు……….

 

 

ఉమా: చంద్ర ఆర్య ఎప్పుడు వస్తాడు………. ఏమైనా ఫోన్ చేశాడా ……….అని ఆత్రుతగా బాధగా అడుగుతుంది…..

 

 

 

చంద్ర :వదిన మీరేమీ కంగారు పడకండి……… 

ఆర్య ఫోన్ చేశాడు వచ్చేస్తాడు …………

 

 

ఉమా: వాడిని దగ్గరదగ్గరగా చూసి ఒక వారం😔😔😔😔😔😔 అవుతుంది………. 

వాడిని త్వరగా రమ్మని చెప్పు అని బాధగా అక్కడి నుండి వెళ్ళి పోతుంది ………..

 

 

సుధ : ఏవండీ………. వాడు నిజంగానే ఫోన్ చేశాడా మీకు ఇక్కడ మేము అందరం వాడు  ఎలా ఉన్నాడు అని కంగారు పడుతున్న మా కనీసం ఫోన్ అన్నా చెయ్యలేదు అని కోపంగా బాధగా ఆవిడ కూడా వెళ్ళిపోతుంది ………..

 

 

చంద్ర వాళ్ళందర్నీ చూసి బాధతో ఒక నిట్టూర్పు విడిచి సోఫాలో కూర్చుని ఏదో ఆలోచిస్తూ ఉంటాడు …….

 

🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀

 

 

ఇప్పటికే మీకు అర్థమయ్యే ఉంటుంది ఇది ఆర్య ఫ్యామిలీ…….

 

ఆర్య ఫ్యామిలీ గురించి ఒకసారి   చూసేద్దాం………

 

జయరామ్ గారు ( ఫస్ట్ లో ఒక హాస్పిటల్ గురించి చెప్పాను కదా దాన్ని ఫౌండర్ ఈయన….) 

 

మహాలక్ష్మి :  జయరామ్ గారి భార్య ………. చూడడానికి నిజం గానే మహాలక్ష్మి లాగా ఉంటారు……..

 

 

జయరాం గారు తెలుగు వారే కానీ వ్యాపార నిమిత్తం ముంబై లో స్థిరపడ్డారు…

 

 

జయరామ్ గారి ఇద్దరు కుమారులు వారే   రవిచంద్రగారు, జైచంద్ర గారు…………..

 

 

జయరామ్ గారు ఎన్నో హాస్పిటల్స్ ఆర్ఫనేజ్ homes ఓల్డ్ ఏజ్ హోమ్స్ స్థాపించి ఎంతోమందికి సహాయం చేస్తూ ఉండేవారు………

 

ఆర్య పుట్టకముందే జయరాం గారు చనిపోతారు జై రాము గారు చనిపోయిన తర్వాత ఆయన చనిపోయారు అని బాధతో మహాలక్ష్మి గారు కూడా అనారోగ్యంతో మరణిస్తారు………

 

ఆయన తర్వాత రవిచంద్ర గారు హాస్పిటల్ ఓల్డ్ హోమ్ చూసుకుంటే జై చంద్ర బిజినెస్ చూసుకుంటాడు……..

 

 

 

 

ఆర్య పెద్దమ్మ పెదనాన్న:-

 

రవి చంద్ర గారు భార్య ఉమా వీళ్ళకి ఒక అమ్మాయి తన పేరు శిరీష అందరూ తనని సిరి అని పిలుస్తారు……

 

సిరి ఆర్య అక్క తను తనకు పెళ్లి అయిపోయి ముంబై లోనే ఉంటుంది

 

ఆర్య అమ్మానాన్న:-

 

జై చంద్ర సుధ వీళ్ళకి  ఆర్య 

 

సమీనా : ఆర్య చెల్లెలు ఇంట్లో అందరికన్నా చిన్నది తన ఇంట్లో అందరికీ  గారాబం (తను ప్రస్తుతం  బెంగళూరు  ఉంది చదువుకుంటుంది తన గురించి ముందు ముందు ఎపిసోడ్స్ లో తెలుస్తుంది)……

 

 

ఆర్య  చూడడానికి పోలికలు గుణాల అన్ని వాళ్ళ తాతగారు జయరామ్ గారి పోలికలే జయరామ్ గారి లాగే మంచి మనసు అందుకే కే ఆర్య అంటే పంచప్రాణాలు రవిచంద్ర దంపతులకు……

 

 

రవిచంద్రగారికి ఉమా కి సిరి కన్నా ఆర్య అంటే పంచప్రాణాలు……..

 

కాని సీరి అంటే ఇష్టం లేకపోవడం మాత్రం లేదు ఇంట్లో మొదట ఆడపిల్ల తన అన్న కూడా ఇంట్లో అందరికీ ఇష్టమే కొంచెం ఆర్య అంటే ఇష్టం……..

 

 

సిరి కి కూడా ఆర్య అంటే చాలా ప్రేమ తన తల్లిదండ్రులకు చెప్పుకోలేని విషయాలు కూడా చెప్తుంది ……అక్క అంటే ఆర్య కి  ప్రాణం తను కూడా అన్ని విషయాలు ముందు సిరి కి చెప్తాడు………

 

 

ఉమ గారు సుధ గారు ఇద్దరి సొంత అక్క చెల్లెలు సిరిని తన సొంత అన్నయ్య అరుణ్ కొడుక్కి ఇచ్చి పెళ్లి చేశారు………‌

 

ఒక విధంగా చెప్పాలంటే ఆ ఇంటికి మకుటం లేని యువరాజు ఆర్య ……

 

కన్నది సుధ అయినా ఆర్యని కన్న తల్లిదండ్రుల కన్నా ఎక్కువగా రవి చంద్ర ఉమాగారు చూసుకుంటారు……

 

 

జై చంద్ర ఎప్పుడూ తన అన్న రవి చంద్ర మాట దాటి ఏది చేయడు ఆయన ఏది చెబితే అదే……..

 

 

🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀

 

 

ఆరోజంతా ఆర్య ఆలోచనలతో ఇంట్లో వాళ్లంతా బాధపడుతూనే ఉంటారు……..

 

 

నైట్ డైనింగ్ టేబుల్ దగ్గర కూడా ఎవరు ఏమి మాట్లాడకుండా భోజనం చేసి వాళ్ల రూమ్ కి వెళ్ళి పడుకుంటారు…….

 

 

అర్ధరాత్రి ఒంటి గంటకు ఒక్కసారిగా ఉమా ఉలిక్కిపడి నిద్రలోంచి లేచి ఆర్య ……ఆర్య…….. అంటూ అరుస్తూ ఉంటారు……….

 

 

రవి గారు (కంగారుగా): ఉమాని పట్టుకుని ఉమా ఏమైంది… ఎందుకలా అరుస్తున్నవు అని అడుగుతారు

 

 

ఉమా: ఏవండీ నా ఆర్య వాడిని ఎవరో ఏదో చేస్తున్నారు.వాడికి చంపేస్తున్నారు. వెళ్లి వాని కాపాడండి .అని పిచ్చి దాన్ని లా అలా అరుస్తూ ఏడుస్తూ ఉంటారు 

 

 

ఉమని అలా చూసి రవి గారికి గుండె తరుక్కుపోతుంది రవి గారు ఎంత చెప్పినా వినకుండా అరుస్తూ ఉంటారు రవిగారికి కోపం వచ్చి ఉమా చెంపమీద గట్టిగా కొడతారు…….. 

 

 

ఉమా అప్పుడు స్పృహలోకి వచ్చి ఏవండీ ఆర్య అంటూ రవి గారిని గట్టిగా చుట్టుకుని ఏడుస్తూ ఉంటారు………

 

 

రవి గారు: ఉమా ఏమైంది….! ఎందుకు ఏడుస్తున్నావ్…..ఏమైంది చెప్పమ్మా…….!

 

ఉమా : ఆర్యని ఎవరో ఏదో చేస్తున్నట్టు……..  చంపాలని చూస్తున్నట్లు ఒక వారం రోజుల నుంచి పిచ్చి కలలు వస్తున్నాయి అని ఏడుస్తూ చెప్తుంది……..

 

 

రవి గారు:  కాస్త ఆశ్చర్యపోయి మరి నాకెందుకు చెప్పలేదు….

 

 

ఉమా : నేను భయపడి నిన్ను కూడా  భయపెట్టడం ఎందుకని చెప్పలేదు…..

 

రవి గారు ఉమని ఓదారుస్తూ తన గుండెలపై పడుకో పెట్టుకుని (రవి గారు మనసులో సిద్ధాంతి గారు చెప్పినట్టు ఆర్య కి ప్రాణగండం అయితే ఆర్య ని ఎలా కాపాడుకోవాలి .. ఒక్కసారి వెళ్లి సిద్ధాంతి గారి ని కలవాలి అని అనుకుని సమాధానం లేని ఎన్నో ప్రశ్నలతో  కలత నిద్రపోతారు)……..

 

 

🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀

 

 

ఆర్య అంటే అంత ప్రాణం పెంచుకున్న ఉమా ఆర్య కి యాక్సిడెంట్ జరిగింది అనే విషయం తెలిస్తే ఏమైపోతారో 😔😔😔😔😔😔😔😔😔😔………

 

 

ఆర్య కు జరిగిన యాక్సిడెంట్ కి  ఉమా కొచ్చిన కలలకి ఏమైనా సంబంధం ఉందా…….?

 

 

సిద్ధాంతి గారు  చెప్పినట్టే ఆర్యా కి ప్రాణ గండమా…?

 

ఎపిసోడ్ జస్ట్ ఆర్య ఫ్యామిలీ గురించి ఇంట్రడక్షన్ ఇవ్వడానికి మాత్రమే బోరింగ్ గా ఉంటే జస్ట్ ఇగ్నోర్ చేసేయండి

 

ఇంకా ఉంది ….