“సరే వదినా… మనం కూడా కలిసి బయటికి వెళ్లింది లేదు కదా… వెళ్దాం. మీ అన్నయ్యకి కూడా చెప్పు అని
కాల్ కట్ చేసిన వెంటనే సత్య హాల్లోకి వచ్చి, “అత్తయ్యా… వదిన వాళ్లు పిల్లల కోసం అందరం కలిసి ఎక్కడికైనా వెళ్లాలని ప్లాన్ చేద్దాం అంటున్నారు.” అని చెబుతుంది.
“అలాగా తల్లి… అఖిల్ వచ్చాక మాట్లాడదాం. అందరం కలిసి వెళ్తే పిల్లలు కూడా చాలా సంతోషిస్తారు.” అని జగదీశ్వరి నవ్వుతూ చెబుతుంది.
అంతలో జగదీశ్వరి, “నిన్న నైట్ ఫంక్షన్ ఎలా జరిగింది సత్యా? బాగా సెలబ్రేట్ చేసుకున్నారా?” అని అడుగుతుంది.
“ఆ… బాగా జరిగింది అత్తయ్యా… సూపర్‌గా చేశారు. అక్కడ డాన్స్ కూడా చేశాము. నాకు డాన్స్ రాదు అని చెప్పినా… మీ అబ్బాయిగారు దగ్గరుండి చేయించారు.” అని నవ్వుతూ చెబుతుంది సత్య.
“అవునా… మరి ఎలా చేశారు?” అని జగదీశ్వరి సరదాగా అడుగుతుంది.