New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
ఎన్నెన్నో జన్మల బంధం ♥️ – 17

ఎన్నెన్నో జన్మల బంధం ♥️ – 17

అఖిల్ డాన్స్ చేయడం పూర్తయ్యాక సత్య రికార్డింగ్ ఆఫ్ చేస్తుంది.

 

“ఏవండీ… మీరు ఇంత అద్భుతంగా డాన్స్ చేస్తారని నేను అసలు అనుకోలేదు. అచ్చం మైకేల్ జాక్సన్ స్టైల్‌లో… ఇంకా చెప్పాలంటే ఆయన కంటే కూడా బాగా చేశారనిపించింది నాకు.” అని సత్య ఆనందంగా చెబుతుంది.

 

“థాంక్యూ సత్యా…” అని అఖిల్ నవ్వుతూ ఆమెను ప్రేమగా హత్తుకుంటాడు.

 

ఆ తర్వాత ఇద్దరూ కలిసి వీడియోని ఎడిట్ చేయడం మొదలుపెడతారు. అఖిల్ చాలా జాగ్రత్తగా వీడియోని ఎడిట్ చేసి, చివరికి యూట్యూబ్‌లో అప్లోడ్ చేస్తాడు.

 

వీడియో అప్లోడ్ చేసిన కొద్దిసేపటికే వ్యూస్ పెరగడం మొదలవుతుంది. ఇద్దరూ ఆశ్చర్యంగా మొబైల్ వైపు చూస్తూ ఉంటారు.

 

“సత్యా… చూడు! ఇంత ఫాస్ట్‌గా వ్యూస్ వస్తున్నాయే!” అని అఖిల్ అంటాడు.

 

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue