ఆమె అప్పుడే తనని అలా వదిలి దూరం జరగడం రాఖీకి చాలా బాధగా అనిపిస్తుంది… బట్ ఆమెకి అదేమీ చెప్పకుండా థాంక్స్ రా నువ్వు నా ప్రేమను ఒప్పుకుంటావో లేదో అని ఇన్ని రోజులు నీపై పెంచుకున్న ప్రేమను నీతో చెప్పలేకపోయాను..
కానీ ఈ రోజు ఆ కార్ డాష్ ఇవ్వగానే నిన్ను చూడకుండానే చచ్చిపోతానేమో అని నాకు చాలా భయం వేసింది….
అప్పుడు అర్థమైంది నువ్వు నా ప్రాణం కంటే ఎక్కువ అయిపోయావ్ అని అందుకే సిట్యుయేషన్ ఎలా ఉన్న సరే నేను నా మనసులో మాట చెప్పకుండా ఉండలేకపోయాను బై గాడ్ గ్రేస్ నువ్వు నా ప్రపోసల్ కి ఓకే చెప్పావ్…..ఐ ఫీల్ వెరీ వెరీ హ్యాపీ టుడే….
ఈ ఆక్సిడెంట్ అవడం కూడా ఒకందుకు మంచిదేనేమో ఇలా ఆక్సిడెంట్ అవడం వల్లే కదా నీకు నా మనసులో మాట చెప్పగలిగాను….
అందుకే అంటారు పెద్దవాళ్ళు ఏం జరిగిన మన మంచికే అని..బహుశా దానికి అర్ధం ఇదేనేమో… ఎలా అయితే ఏంటి నా ఆద్య బంగారం నాతో లైఫ్ లాంగ్ ఉంటుంది ఇప్పుడు నా మనసు ప్రశాంతంగా ఉంది అంటాడు నార్మల్ వాయిస్ తో ..
రాఖీ మాటల్లో తన పై ఉన్న ప్రేమ తెలుస్తుంటే ఆ ప్రేమకి లోలోపల మురిసిపోతుంది ఆద్య…ఇద్దరూ మరి కాసేపు అలా మాట్లాడుకున్నాక ఓకే రా నువ్వు ఇంకా కాలేజీ కి వెళ్ళు క్లాస్ మిస్ అవుతాంగా…