అలా ప్రేమలో మునిగి తేలుతు రెండు సంవత్సరాలు గడిచిపోయాయి….
వీళ్ళు ఇంత పీకల్లోతు ప్రేమలో ఉన్న సరే అటు కాలేజీలో గాని ఇటు ఇంట్లో గాని ఎవరికీ వీళ్ళ ప్రేమ గురించి తెలియదు…
కరెక్ట్ గా చెప్పాలంటే వీళ్ళే తెలియనివ్వలేదు…ఒకసారే చదువు పూర్తయ్యాక వాళ్ళ ప్రేమ చెప్పాలని డిసైడ్ అయ్యారు….అందుకే ఎవరికీ అనుమానం రాకుండా మ్యానేజ్ చేస్తున్నారు ఇద్దరు….
ఒక అమ్మాయి, అబ్బాయి అంత క్లోజ్ గా ఉంటె డౌట్ రాకుండా ఉంటుందా అని మీరు అనుకోవచ్చు ….
బట్ ఎవరికీ వాళ్లపై డౌట్ వచ్చేది కాదు ఎందుకంటే వాళ్లిద్దరూ పుస్తకాల పురుగులు అని వాళ్ళ క్లాస్ లో టాక్….
సో వాళ్లిద్దరూ చాలా వరకు స్టడీస్ గురించే డిస్కస్ చేయడం చాలా మంది చూసారు విన్నారు…
అండ్ అటు ఆద్య కానీ ఇటు రాఖీ కానీ చదువు తప్ప వేరే దేని మీద ద్రుష్టి పెట్టడం ఎవరు చూడలేదు..