New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
మానసచోరుడు❤️‍🔥 – 2

మానసచోరుడు❤️‍🔥 – 2

అందరూ తమ డీల్ సక్సెస్‌ఫుల్‌గా పూర్తయిందని సంబరపడుతున్న సమయంలో…

 

ధడేల్!

 

అంటూ ఆ డార్క్ రూమ్ తలుపులు ఒక్కసారిగా తెరుచుకున్నాయి.

 

ఆ శబ్దానికి అక్కడున్న ప్రతి ఒక్కరి చూపు తలుపుల వైపు తిరిగింది.

 

లోపలికి అడుగుపెట్టిన వ్యక్తిని చూడగానే…

 

కొంతమంది ముఖాల్లో రంగులు మారిపోయాయి.

 

ఎందుకంటే…

 

అతను అడుగుపెట్టింది గదిలోకి కాదు… వాళ్ల గుండెల్లో దాక్కున్న భయాన్ని బయటకు లాగడానికి!

 

ఐదడుగుల తొమ్మిది అంగుళాల ఎత్తు…

 

చామనఛాయ రంగు…

 

ముఖంలో సీరియస్‌నెస్…

 

చూపులో కాఠిన్యం…

 

చేతిలో లేటెస్ట్ మోడల్ గన్‌తో అడుగులో అడుగు వేస్తూ లోపలికి వచ్చాడు అతను.

 

గుణ!

 

డెవిల్‌కు కుడిభుజం లాంటి వ్యక్తి.

 

తన బాస్ గురించి తప్పుగా మాట్లాడిన మెంబర్ 2 ఎదురుగా వచ్చి నిలబడ్డాడు.

 

అతని కళ్లలోకి సూటిగా చూస్తూ, చేతిలోని గన్‌ను అతని నోటికి గురిపెట్టాడు.

 

గుణ: ఇప్పుడే కదరా మా బాస్ గురించి మాట్లాడింది? మాట్లాడు! ఇప్పుడు మాట్లాడు డెవిల్ గురించి!

 

అతని బేస్ వాయిస్ ఆ గదిలో ప్రతిధ్వనించింది.

 

గొంతులో కోపం కంటే హెచ్చరికే ఎక్కువగా వినిపించింది.

 

అక్కడున్న వాళ్లందరూ ఒక్కసారిగా నిశ్శబ్దమైపోయారు.

 

అసలు డెవిల్‌ను చూడకుండానే, అతని అసిస్టెంట్‌ను చూసి ఇంతలా భయపడిపోతున్నారంటే…

 

ఇక డెవిల్ వస్తే వీళ్ల పరిస్థితి ఏంటి?

 

అక్కడే కూర్చొని మొదటి నుంచి వాళ్ల మాటలన్నీ వింటున్న  రాజీవ్ అనే పాతికేళ్ల కుర్రాడు మనసులోనే నవ్వుకున్నాడు.

 

పిల్ల బచ్చ… పిల్ల బచ్చ… అని ఇంతసేపు తెగ మాట్లాడారు.

 

ఇప్పుడు ఆ పిల్ల బచ్చ దగ్గర పనిచేసే అసిస్టెంట్‌ను చూసేసరికి గొంతులు మూగబోయాయే!

 

అనుకుంటూ గుణ చుట్టూ వణుకుతూ నిలబడిన వాళ్లను చూసి చిరునవ్వు నవ్వాడు.

 

మరోవైపు…

 

మెంబర్ 2 తన ప్రాణాల మీద ఆశతో గుణతో ఏదో చెప్పడానికి ప్రయత్నిస్తున్నాడు.

 

మెంబర్ 2: అది… అది… గుణ భాయ్… నేను…

 

అతని మాటలు పూర్తికాకముందే గుణ అడ్డుకున్నాడు.

 

గుణ: ఇప్పటివరకు గలగలా మాట్లాడారు కదరా! ఇప్పుడేంటి? అది… ఇది… అంటూ నసుగుతున్నారు?

 

అతని వ్యంగ్యానికి సమాధానం చెప్పే ధైర్యం ఎవరికీ లేదు.

 

అంతలోనే…

 

మళ్లీ ఆ తలుపులు తెరుచుకున్నాయి.

 

ఈసారి మాత్రం ఎవరూ మాట్లాడలేదు.

 

ఎవరూ కదల్లేదు.

 

అక్కడున్న ప్రతి ఒక్కరి చూపు తలుపుల మీదే నిలిచిపోయింది.

 

నెమ్మదిగా అడుగుల శబ్దం ఆ గదిలో ప్రతిధ్వనించింది.

 

టక్…

 

టక్…

 

టక్…

 

ఆ అడుగుల్లో తొందర లేదు.

 

భయం లేదు.

 

ఎదుటివాళ్లు తనను చూసి భయపడతారనే ఆలోచన కూడా లేదు.

 

ఎందుకంటే…

 

భయపడటం అతని ముందు నిలబడిన వాళ్ల పని. భయపెట్టడం అతని స్వభావం!

 

ఆరున్నర అడుగుల ఆజానుబాహుడు లోపలికి అడుగుపెట్టాడు.

 

కోరమీసాలు…

 

చక్కగా ట్రిమ్ చేసిన గడ్డం…

 

షార్ప్‌గా ఉండే ముక్కు…

 

తన చూపుతోనే ఎదుటివాళ్లను శాసించగలిగే తీక్షణమైన కళ్లు…

 

బ్లాక్ సూట్‌లో రాజసంగా కనిపిస్తున్న అతని వ్యక్తిత్వానికి, పెదవుల మూలల్లో కనిపించే లేత నలుపు రంగు మరో ప్రత్యేకతను ఇచ్చింది.

 

రోజూ సిగార్ తాగే అలవాటుకు గుర్తుగా కనిపించే ఆ మచ్చలు అతని ముఖానికి మరింత గంభీరతను తెచ్చాయి.

 

కుడిచేతిని ప్యాంట్ జేబులో పెట్టుకొని, ఎడమచేతిలో సిగార్ పట్టుకొని, దాని పొగను నెమ్మదిగా బయటకు వదులుతూ నడుస్తున్నాడు.

 

అతని ముఖంలో కోపం లేదు.

 

తన ముందు నిలబడిన వాళ్ల మీద కనీస ఆసక్తి కూడా లేదు.

 

కానీ…

 

అతని ఒక్క చూపు తమ మీద పడకూడదని అక్కడున్న వాళ్లంతా మనసులోనే కోరుకుంటున్నారు.

 

ఎందుకంటే…

 

అతను కోపంగా ఉన్నప్పుడు మాత్రమే కాదు… నిశ్శబ్దంగా ఉన్నప్పుడు కూడా ప్రమాదకరమే!

 

అతన్ని చూడగానే అప్పటివరకు కుర్చీల్లో కూర్చొని పొగరుగా మాట్లాడిన వాళ్లందరూ ఒక్కసారిగా లేచి నిలబడ్డారు.

 

అతను మాత్రం ఎవరి వైపూ చూడకుండా తన రాజసమైన నడకతో టేబుల్ దగ్గరకు వచ్చాడు.

 

మధ్యలో ఉన్న కుర్చీని వెనక్కి లాగి, అందులో నెమ్మదిగా కూర్చున్నాడు.

 

ఒక చేత్తో సిగార్ పట్టుకొని, మరో చేతిని కుర్చీ మీద ఆనించి…

 

తల కొద్దిగా పైకెత్తి గుణ వైపు చూశాడు.

 

అంతే!

 

ఆ ఒక్క చూపుకే గుణకు తన బాస్ ఏం కోరుకుంటున్నాడో అర్థమైపోయింది.

 

చేతిలోని గన్‌ను పక్కన పెట్టాడు.

 

తన వెనుకవైపు ఎప్పుడూ ఉంచుకునే చిన్న కత్తిని బయటకు తీశాడు.

 

అక్కడున్న వాళ్ల గుండెల్లో భయం మరింత పెరిగింది.

 

గుణ నెమ్మదిగా జియాజ్ వైపు అడుగులు వేశాడు.

 

అప్పటివరకు ధైర్యంగా కూర్చున్న జియాజ్ ముఖంలో క్రమంగా ఆందోళన మొదలైంది.

 

తన ముందు జరగబోయేది ఏమిటో అర్థంకాక మిగిలిన వాళ్లంతా ఊపిరి బిగబట్టి చూస్తున్నారు.

 

నివాస్ మాత్రం తన కుర్చీలో వెనక్కి వాలి, పెదవుల మీద చిరునవ్వుతో ఆ దృశ్యాన్ని గమనిస్తున్నాడు.

 

గుణ జియాజ్ దగ్గరకు చేరుకున్నాడు.

 

కత్తిని చేతిలో తిప్పుతూ అతని ముందు నిలబడ్డాడు.

 

సరిగ్గా అప్పుడే…

 

ఇంతసేపూ మౌనంగా ఉన్న డెవిల్ నోరు విప్పాడు.

 

డెవిల్: గుణ…

 

అంతే!

 

గుణ అడుగు అక్కడే ఆగిపోయింది.

 

డెవిల్ సిగార్ నుంచి ఓ దమ్ము తీసి, ఎదురుగా నిలబడ్డ జియాజ్ వైపు చూశాడు.

 

ఆ తర్వాత తన పెదవుల మీద చిన్న చిరునవ్వు తీసుకొచ్చాడు.

 

ఆ చిరునవ్వులో ఆప్యాయత లేదు.

 

కనీసం స్నేహం కూడా లేదు.

 

అది ఎదుటివాడికి తన తప్పు అర్థమయ్యేలోపు ఇచ్చే చివరి అవకాశం లాంటిది.

 

డెవిల్: ముందు వీడికి… మనం ఎవరితో బిజినెస్ చేయడానికి వచ్చామో అర్థమయ్యేలా చెప్పు!

 

అతని మాటలు పూర్తయ్యేసరికి అక్కడున్న వాళ్లందరికీ ఒక విషయం అర్థమైంది.

 

వాళ్లు ఇప్పటివరకు డీల్ గురించి మాట్లాడుకున్నారు.

 

కోట్ల రూపాయల పెట్టుబడుల గురించి లెక్కలు వేశారు.

 

లాభాల గురించి కలలు కన్నారు.

 

కానీ…

 

ఆ డీల్‌కు అసలైన యజమాని ఎవరో మాత్రం మర్చిపోయారు!

 

ఇప్పుడు ఆ నిజం వాళ్ల కళ్లముందే బయటపడబోతోంది.

 

కొనసాగుతుంది.