New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
ఎవరిది ప్రేమ? – 30

ఎవరిది ప్రేమ? – 30

ఎలా అంటే  ప్రాక్టీస్ కోసం బాక్సింగ్ బ్యాగ్ నీ ఎలా అయితే  కొడతారో అలా అతని ఆవేశం చల్లారేదాకా రాఖీ ముక్కు మొహం ఏకం చేసి అతని ఒంట్లో నిలబడే శక్తి లేనంతగా ఉతికి ఆరేస్తాడు……

 

అతను కొట్టిన దెబ్బలకి రాఖీ అరవడం తప్ప ఏం చేయలేక పోతున్నాడు…ఊహు చేసే ఛాన్స్ అతను ఇవ్వలేదులే..కొంచెం కూడా గ్యాప్ ఇవ్వకుండా బాడీ లో అన్నీ పార్ట్స్ని ఇంచి పడేసాడు…..

 

ఆ టైమ్ లో అతన్ని, అతను రాఖీని కొట్టె విధానాన్ని చూస్తుంటే ఆద్య, బ్రహ్మికి అక్కడ అతని బదులు ఒక సింహం మీద పడి గర్జిస్తున్నట్టుగా కనిపిస్తుంది..

 

ఆ వ్యక్తి రాఖీ ఒళ్ళు గుల్ల గుల్ల చేసాక చివరిగా అక్కడ జరిగేది బొమ్మలా నిలబడి చూస్తున్న ఆద్య వైపు ఒక సీరియస్ లుక్ ఇచ్చి అతన్ని  రూమ్ లో నుండి బయటకు లాక్కెళ్లి  పడేస్తాడు….

 

అతను చూసిన చూపుకి ఆద్య, బ్రహ్మి భయ పడుతూనే అతని వెంట బయటకి వెళ్లారు….అక్కడ రాఖీని పడేసిన చోట ఆల్రెడీ కామేష్ అండ్ బ్యాచ్ ఒళ్ళంతా దెబ్బలతో, పైకి లేచే ఓపిక కూడా లేనట్టుగా అటు ఇటు దొర్లుతూ మూలుగుతూ పడున్నారు..

 

వాళ్ళని అలా చూసినా ఆద్య ఇదంతా ఎప్పుడు జరిగింది అన్నట్టు  అయోమయంగా బ్రహ్మి వైపు చూడగా బ్రహ్మి ఎప్పుడో అన్నట్టు భుజాలు ఎగరేసి ముందు ఇక్కడ ఎండ్ చేసే లోపలకి ఎంట్రీ ఇచ్చాడు అన్నట్టు  కళ్ళతోనే సైగలు చేసి చెప్పాడు..

 

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue