“ఓసిని… ఇవి అన్ని అలవాట్లు ఉన్న భర్తలని పెళ్ళాలు ఏడుస్తూ భరిస్తున్నారే వాళ్ళని.
నేను ఇప్పటివరకు నువ్వు నా విషయంలో ఫుల్ సాటిస్ఫైడ్,హ్యాపీగా నాతో లైఫ్ లీడ్ చేస్తున్నావ్ అనుకున్నా..!
ఇంత దారుణంగా పూచిక పుల్లతో సమానంగా నన్ను తీసి పడేస్తావా…!” అని అన్నాడు అమాయకంగా ముఖం పెట్టి శ్రీపాద.
“నీతో లైఫ్ నేను ఫుల్ సాటిస్ఫైడ్ గా హ్యాపీగా లీడ్ చేస్తున్నా.. నీ అలవాట్లకి నా సాటిస్ఫాక్షన్ కి ఎలాంటి సంబంధం లేదు.
తాగుబోతుల భార్యలను వెళ్ళి అడుగు మీ భర్తతో నువ్వు సంతోషంగా లేవా అని..ఒక్క తాగినప్పుడు తప్పించి ఆయన నన్ను ప్రతి క్షణం బాగా చూసుకుంటారు అని చెప్తారు.. కావాలంటే ట్రై చెయ్.