New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
జ్వాల 🔥 – 13
జ్వాల 🔥 Premium 6 min read

జ్వాల 🔥 – 13

జ్వాల మాత్రం తన వెనుక ఎవరు వస్తున్నారో కూడా పట్టించుకోకుండా అందరికి గుడ్ మార్నింగ్ చెప్తూ దారిలో పేషంట్స్ కనిపిస్తే అంత ఓకే కదా మెడిసిన్స్ అన్నీ సరిగా వేస్కున్నారా అంటూ నవ్వుతూ అడుగుతూ ఉంటుంది….

 

అలా ఒక్కొక్కరిని దాటుకుంటూ వెళ్తు ఉండగా ఆరోజు నైట్ డెలివరీ చేసిన ఆవిడ కనిపిస్తే తన దగ్గరకి వెళ్లి హాయ్ అండీ ఎలా ఉన్నారు?  బాబు ఎలా ఉన్నాడు అంత ఓకే కదా అని అడుగుతుంది నవ్వుతూ….

 

జ్వాలని చూడగానే ఆవిడ ఎంతో కృతజ్ఞత గా చూస్తూ హాయ్ జ్వాల…నేను, బాబు చాలా బాగున్నాం తల్లి అంత నీ దయవల్లే….

 

ఆ రోజు దేవుడిలా నువ్వు మమ్మల్ని చూసి ఆ టైమ్ లో మాకోసం ఎంతో తాపత్రయపడి మీ డాక్టర్ కి ఫోన్ చేసి రమ్మని రిక్వెస్ట్ చేసి తను రాలేను నువ్వు చేసేయి అనగానే ఎంతో ధైర్యం చేసి నాకు కాన్పు చేయకుంటే ఆరోజు మేము ఎంత ఇబ్బంది పడేవాళ్ళమో…..

 

అసలు మేమిద్దరం ఈరోజు క్షేమంగా ఇలా భూమ్మీద ఉన్నాం అంటే దానికి నువ్వే కారణం జ్వాల… నీ మేలు ఈ జన్మలో మర్చిపోలేనిది థాంక్యూ… థాంక్యూ సో మచ్…

 

ఈ థాంక్యూ అనే మాట నువ్వు చేసిన దానికి చాలా తక్కువే కానీ ఇంతకమించి ఏం చేయాలో నాకు తెలియట్లేదు అంటూ ఎమోషనల్ అవుతూ ఆరోజు గురించి మాట్లాడుతూ ఉంటుంది..

 

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue