ఇంకొన్ని నిముషాల్లో అతన్ని రీచ్ అవుతుంది అనగా క్రిష్ వెనక ఇద్దరు వ్యక్తులు నిలబడి కత్తులు పట్టుకుని క్రిష్ ని పొడవడానికి రెడీ గా ఉన్నారు….
క్రిష్ తో మాట్లాడుతున్న వ్యక్తి వెళ్ళిపోగానే అతన్ని కత్తుల్తో పొడిచి పడేసి వెళ్లాలని వాళ్ళ ప్లాన్…
అందుకే ఆ వ్యక్తి మాట్లాడి క్రిష్ కి బాయ్ చెప్పి వెళ్ళిపోతుండగా ఆ ఇద్దరు వ్యక్తులు ఒకరికి ఒకరు సైగ చేసుకుంటూ రెడీ ప్రొసీడ్ అనుకుంటూ ఉంటారు…
ఆ దృశ్యం చూసిన స్వేచ్ఛ కి భయం తో ఒళ్ళంతా చెమటలు పట్టి పోయి ఆ కంగారుకి నోట్లో నుండీ మాట కూడా రాక నో అని చిన్నగా అరుస్తూ అక్కడ నుండీ క్రిష్ దగ్గరకి ఫాస్ట్ గా పరిగెత్తుతు వెళ్తుంది….
క్రిష్ తెలిసిన వ్యక్తిత్తో మాట్లాడేసి అతను వెళ్ళిపోయాక నార్మల్ గా వెనక్కి తిరిగి తన కార్ దగ్గరకి వెళ్ళబోతుంటాడు….
ఆ ఇద్దరు వ్యక్తులు ఒక ఈవిల్ స్మైల్ తో కత్తులు చేత్తో గట్టిగా పట్టుకుని క్రిష్ నీ పొడవబోతారు…