New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
జ్వాల 🔥 – 7
జ్వాల 🔥 Premium 6 min read

జ్వాల 🔥 – 7

అలా ఎంతసేపు ఏడుస్తూ కూర్చుందో తనకే తెలియాలి…చాలా సమయం గడిచిపోయాక ఏడుస్తూ ఉన్న తన ఫోన్ వైబ్రేట్ అవుతున్న సౌండ్ వినిపించేసరికి తలెత్తి తన కాళ్ళ దగ్గర పడున్న ఫోన్ ని చూస్తుంది….

 

అందులో అమ్మ కాలింగ్ అని డిస్ప్లే అవుతూ ఉండడంతో తన కళ్ళ ముందు అమ్మ, నాన్నలు కనిపించి వాళ్ళు తన కోసం ఎంత టెన్షన్ పడుతుంటారో తెలుసు కనుక వాళ్ళ కోసం అయిన త్వరగా ఇంటికి వెళ్ళాలి…

 

ఇంకా లేటయితే వాళ్ళు కంగారుపడిపోతారు అనుకుంటూ మెల్లిగా నోటితో తన చేతులకు ఉన్న కట్లు విప్పి అవి ఊడి వచ్చాక చేతుల్తో కాళ్ళకున్న కట్లు విప్ప తీసుకుని పైకి లేచి తన ఫోన్, హ్యాండ్బ్యాగ్ తీసుకుని, తన డ్రెస్ వేసుకుని వేళ్ళతోనే రేగిపోయిన జుట్టుని సరి చేసుకుని ఆ ఇంటి నుండి బయటపడింది….

 

అక్కడ నుండి కొంచెం ముందుకు రాగానే ఏదో ఆటో కనిపించడంతో ఇంకేం ఆలోచించకుండా అదెక్కి ఇంటికి వెళ్ళిపోతుంది…

 

ఇంటికి అయితే వెళ్ళింది కానీ ఇంట్లోకి వెళ్ళడానికి మొహం చెల్లడం లేదు ఆమె కి….ఏదో  చేయకూడని తప్పు చేసినదానిలా కన్నీళ్లు పెట్టుకుంటూ అంత మంది చేతిలో పాడైయిపోయిన నేను నా మొహం మీకు ఎలా చూపించగలను  అమ్మానాన్న అంటూ గుమ్మం లో అడుగుపెట్టలేక ఎంతో బాధగా ఆలోచిస్తూ వాడు కొట్టిన చెంప దెబ్బకు ఎర్రగా వేలి ముద్రలు పడిన చెంపను జుట్టుతో కవర్ చేస్కుంటూ అక్కడే ఆగిపోతుంది….

 

కూతురు కోసం ఎంతో కంగారుగా ఎదురుచూస్తూ గుమ్మం లోకి ఇంట్లోకి తిరుగుతున్న తన తల్లి గుమ్మం ముందు నిలబడున్న కూతుర్ని చూసి పరుగున ఆమె దగ్గరకి వచ్చి హమ్మయ్య వచ్చేసావా బుజ్జి…

 

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue