New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more
దరిచేరా రావే.. చెలి!! – 5

దరిచేరా రావే.. చెలి!! – 5

బెడ్ రూమ్ కి కనెక్టడ్ గా ఉండే రూమ్ డోర్ ఓపెన్ చేసి అందులో వాల్ కి వాళ్లిద్దరూ కలిసి తీసుకున్న ఉన్న లార్జ్ వాల్ పోర్ట్రైట్ దగ్గరికి వెళ్లి తడుముతు దాన్ని నా భార్య అంటున్నార్రా … నీ చావు కి కారణమైన తను నా భార్య ఎలా అవుతుందిరా..!!

 

” ఐ స్వేర్ బ్రతికి ఉండగానే దానికి నరకం అంటే ఏంటో చూపిస్తా… ” అని కసిగా అనుకొని గది తలుపులు మూసి బయటకి వచ్చి….

 

 

తన మనుషుల కి ఫోన్ చేసి శ్రేయ ఫోటో పంపించి శారదమ్మ ఇంటి అడ్రస్ చెప్పి తనని ఫాలో అవ్వమని చెప్తాడు…

 

 

రిధ్విక్ నేమ్ చెప్పి అప్పోయింట్మెంట్ తీసుకున్న శ్రేయ డాక్టర్ దగ్గరికి వెళ్లి…

 

 

” మేడమ్… నేను బ్రెస్ట్ ఫీడింగ్ చేయలేను.. సో… ” అని కొంచం టెన్షన్ గా డాక్టర్ వైపు చూసింది

 

 

హ సో…ఏం చేయాలనుకుంటున్నారు మిస్సెస్ కుమార్

 

 

” బ్రెస్ట్ ఫీడ్ స్టాప్ చేయడానికి ఇంజెక్షన్స్ ఆర్ టాబ్లెట్స్ సజెస్ట్ చేయండి ” అంటుంది శ్రేయ

 

 

“వాట్… ఆర్ యూ మ్యాడ్… ” అని లౌడ్ గా అన్నారు డాక్టర్ 

 

 

ఆ వాయిస్ కి కాస్త జంకి అది కాదు మేడమ్.. అంటుంటే

 

 

” తల్లి పాలే  బేబీకి మొదటి మెడిసిన్…. బ్రెస్ట్ మిల్క్ బేబీకి లైఫ్‌ టైమ్ ఇమ్యూనిటీ ఇస్తుంది… “

 

 

శ్రేయ ఏం మాట్లాడకుండా డాక్టర్ ని చూస్తుంటే…

 

 

” ఇంకా స్పష్టంగా చెప్పాలంటే… బ్రెస్ట్ మిల్క్ లో ఉండే న్యూట్రియంట్స్ ఏ ఫార్ములా మిల్క్ లోనూ ఉండవు…  ఇది మీ బేబీకి ఒక రక్షణ కవచం…. ఫస్ట్ సిక్స్ మంత్స్ వరకు బ్రెస్ట్ మిల్క్ ఇస్తే… బేబీకి ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉంటుంది… ” 

 

 

” సారీ డాక్టర్ ” అని లేచి బయటకి వస్తుంది

 

 

ఇక ఆ డాక్టర్ ఏ మెడిసిన్ ఇవ్వదు అని అర్థమయ్యి.. వేరే ఏదైనా క్లినిక్ కి వెళ్ళాలి అనుకుంటుంది…

 

 

బయటికి వచ్చిన శ్రేయ… ” శారదమ్మ ఏదైనా చిన్న క్లినిక్ కి తీసుకెళ్ళావా నన్ను ” అని అడుగుతుంది

 

 

అక్కడి నుండి ఆటో లో చిన్న గల్లీ లో ఉన్న క్లినిక్ దగ్గర కి తీసుకెళ్తుంది

 

 

ఆటో దిగిన శ్రేయ క్లినిక్ లోకి నడుస్తూ అక్కడే వెయిట్ చేస్తున్న ఒపీ ని చూస్తూ ముందుకు వెళ్తున్న ఆమెని  అసిస్టెంట్ ఆపుతుంటే..

 

 

” తన చేతిలో అయిదు వందలు పెట్టి నేరుగా డాక్టర్ రూమ్ కి వెళ్తుంది “

 

 

డాక్టర్ రూమ్ లోకి వెళ్లిన శ్రేయ ని చూస్తూ ” కూర్చోమ్మ… మీ సమస్య ఏంటి ” అని అడుగుతారు డాక్టర్

 

 

టేబుల్ పక్కన ఉన్న చిన్న స్టూల్ మీద కూర్చున్న శ్రేయ.. ” మేడమ్.. నేను రీసెంట్ గా నే డెలివరీ అయ్యాను.. బట్ నేను బేబీ కి బ్రెస్ట్ ఫీడ్ చేయడం కుదరట్లేదు సో.. ప్లీజ్ నాకు బ్రెస్ట్ ఫీడ్ స్టాప్ అయ్యే మెడిసిన్ ఇవ్వండి ” అంటుంది

 

 

అది విన్న డాక్టర్… రీసెంట్ గా డెలివరీ అంటున్నావ్… బేబీ కి ఎన్ని మంత్స్… బ్రెస్ట్ మిల్క్ అంటున్న డాక్టర్ ని ఆపుతూ ” ఐ నో డాక్టర్… అని కొంత మనీ తీసి డాక్టర్ టేబుల్ పై పెడుతూ ఐ వాంట్ మెడిసిన్ అంటుంది “

 

 

ఈ రోజుల్లో డబ్బు కి లొంగని వారెవరు…

 

 

ఓకే అని ఇంజక్షన్ వేసి.. ఇరవై నాలుగు గంటల్లో మీకు బ్రెస్ట్ మిల్క్ ఆగిపోతుంది అని చెప్తారు

 

 

ఓకే థాంక్ యూ అని బయటకు వస్తుంది శ్రేయ..

 

 

శ్రేయ ఇంట్లో నుండి బయలుదేరినప్పటి నుండి హాస్పిటల్ అండ్ క్లినిక్ వెళ్లి ఏం మాట్లాడిందో కూడా తెలుసుకున్న రిధ్విక్ మనుషులు  రిధ్విక్ కి చేర వేస్తారు…

 

 

అది విన్న రిధ్విక్ లో ఓ శాడిస్టిక్ స్మైల్…

 

 

బిడ్డ కి తల్లి పాలు ఎంత ముఖ్యమో తెల్సుకుంటూనే.. మెడిసిన్ తీసుకున్నావా అని నవ్వుతూ…

 

 

” ఏమన్నావ్.. థట్స్ యువర్ ప్రాబ్లమ్ నా…యస్ ఇట్స్ మై ప్రాబ్లమ్ ..బట్ యు విల్ పే ఫర్ థిస్ డేఫినెట్లీ…”  అని క్రూరంగా నవ్వాడు

 

 

@

 

 

అత్తయ్య… భోజనానికి రండి అంటూ పిలవడానికి వచ్చారు సరస్వతి గారు…

 

 

” వద్దు సరు తినాలని లేదు… ఆ పాప ని నాకు ఇచ్చి మీరు తినండి.. ” అంటారు భానుమతి గారు..

 

 

” ఎలా తినమంటారు అత్తయ్య..  ఆ పసి ది గుక్క పెట్టి ఏడుస్తుంటే ప్రాణాలు పోతున్నట్టు గా అనిపిస్తుంది… ఇంకా తిండి ఎలా సహిస్తుంది ” అన్నారు ఆవేదనగా సావిత్రి గారు

 

 

సావిత్రి ఎలా జరగాలని రాసుంటే అలా జరుగుతుంది… నువ్వు బాధ పడకు.. ఆ బుజ్జి దాన్ని నా చేతికి ఇవ్వు అన్నారు భానుమతి గారు

 

 

చిట్టి తల్లి అంటూ మొటికలు విరిచి తన రూమ్ కి తీసుకెళ్లిపోయారు భానుమతి గారు..

 

 

ఆ రికార్డింగ్ విన్న నా మనసే ఇంత బాధగా ఉంటే ప్రేమించి పెళ్లి చేసుకున్న వాడి మనసేంత విరిగిపోయి ఉంటుందో అని బాధ పడతారు

 

 

సరస్వతి గారి బలవంతం మీద కొంచెమైన తిందామని తను తినకపోతే సరస్వతి కూడా తినదు అని అన్నం ప్లేట్ లో పేట్టుకోగానే… పాప ఏడుపు వినిపించి ఇద్దరు లేస్తారు…

 

 

 

@ ఇంకా ఉంది…

 

 

 

@ స్టోరీ చదివి ఎలా ఉందో మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి….