కష్టం గా మింగుతూ…ఈ ముసలోడి కి ఉప్పు ఎక్కువైందో తక్కువైందో కూడా తెలియట్లేదా …! అని లో లోపల ఫ్రస్టేట్ అవుతూ.. ఫేక్ స్మైల్ ఇస్తూ సైలెంట్ గా ఉంటారు..
విశ్వ నాధ్ గారు చాలా స్ట్రిక్ట్ గా ఉంటారు… చనువు ఇచ్చే విధంగా ఎక్కడ ఉండరు… పైగా మనవరాలు అంటే ప్రాణం అని చెప్పలేం అలా అని అయిష్టం అని కూడా చెప్పలేం…
” అలా చూస్తారేంటి నాన్న తినండి… బాలేదా అని ఫేస్ డల్ గా పెట్టి నువ్వు కూడా తినట్లేదు ఎందుకు నానమ్మ… మా అమ్మ చేతికి వంట కి బాగా అలవాటు పడిపోయారు కదా మీరు.. ఆ అలవాటు నేను మాన్పిస్తా గా ” అనగానే అనసూయ సీరియస్ గా అమ్ము వైపు చూస్తుంటే చిన్న గా నవ్వి అంటే నేను వంట నేర్చుకుంటా నానమ్మ.. మధ్యాహ్నం కి కర్రీస్ ఏం చేయాలి చెప్పు అంటుంది అమూల్య..
నువ్వు చేస్తావా.. మీ అమ్మ ఎక్కడ.. అని కొంచం కోపం గా అంటారు ప్రభాకర్ గారు..