ఆ కన్నీళ్లు తుడుస్తూనే… గతం గుర్తుకొస్తుందా… దీని ( పాప ) భవిష్యత్తు అర్థం అవుతుందా… అని కోపం గా అడుగుతాడు
తల్లిగా లేచి కూతురిని కాపాడుకుంటావో… లేక నాకెందుకు లే నా చావు నేను చస్తా అని ప్రశాంతంగా చస్తావో నీ ఇష్టం…
కేవలం నీకు అయిదే నిమిషాలు టైం ఇస్తున్న… ఆరో నిమిషం నువ్వు లేచినా… నీ కూతురు నడి రోడ్డు మీద ఉంటుంది… అని తన కంట్లో కన్నీళ్లు తుడుచుకుంటాడు రిధ్విక్…
ఆ మాటలకి ” నా కూ..తు..రి ని ఏం చే..యొ..ద్దు.. న..న్ చం.పే… ” అంటూ కళ్ళు తెరవకుండానే కలవరిస్తుంది శ్రేయ..