నా గుండెలో నీవు ఉండిపోవా💗💗 – 1
హైదరాబాద్ కేక్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీ హెడ్ ఆఫీస్ ,:
అరే అంజలి కాస్త నెమ్మదిగా నడవవే బాబు ప్లీజ్!!!
మనం వచ్చింది ఇంటర్నేషనల్ కంపెనీకి మన కాలేజీ గ్రౌండ్కి కాదు వెనకాలే పరిగెత్తుకుంటూ వస్తున్న శృతి కంగారుగా అంది
కానీ అంజలి అసలు వినలేదు జీన్స్ వైట్ కుర్తి వేసుకుని చేతిలో ఫైల్స్ పట్టుకుని గాలి వేగంతో నడుస్తుంది
తన కళ్ళల్లో ఎలాంటి భయం లేదు కేవలం ఏదో సాధించాలనే ఉత్సాహం మాత్రమే ఉంది..
నువ్వు ఒక దానివి శృతి!!! టైం 9 దాటుతుంది ఈరోజు మన జాయినింగ్ డే మొదట రోజు ఆలస్యంగా వెళ్తే ఆ “హిట్లర్ “బాస్ మానల్ని పీకేస్తాడు అంది అంజలి వెనక్కి తిరిగి నవ్వుతూ!!!
- నీకొక దండమే బాబు అక్కడ అందరూ ఆయన్ని రుద్రదేవ్ అంటారు ఆయన చాలా డేంజరస్ పర్సన్ అంట ఆయన కంటపడితే అంతే సంగతి
- నువ్వేమో హిట్లర్ అని నిక్ నేమ్ పెడుతున్నాను అని శృతి భయంతో వణికిపోయింది
బాస్ అయితే ఏంటి రాక్షసుడా!!ఏంటి అతను మింగేయడానికి మనం కష్టపడి చదివి మెరిట్ తో జాబ్ తెచ్చుకున్నాం ఎవ్వరికి భయపడేదే లేదు అంది అంజలి
సరిగ్గా అదే సమయంలో ఆఫీస్ మెయిన్ ఎంట్రన్స్ దగ్గర మూడు బ్లాక్ ఫార్చునర్ కార్స్ వచ్చి ఆగాయి
ఆ కార్ల నుంచి నలుగురు బాడీగార్డ్స్ కిందకి దిగి గేటు వైపు నిలబడి తలలు వంచుకొని నిలబడి ఉన్నారు .
స్టాఫ్ అంతా ఒక్కసారిగా నిశ్శబ్దం అయిపోయారు అక్కడ అంతా పిన్ డ్రాప్ సైలెన్స్ ఏర్పడింది
మొదట కారు నుంచి ఇద్దరు అబ్బాయిలు దిగారు వాళ్లే రుద్రదేవ్ తమ్ముళ్లు..
విక్రమ్ వినయ్ ,, అన్నయ్య ఈరోజు ఫుల్ సీరియస్ మూడ్లో ఉన్నాడు రా!!! మార్నింగ్ బ్రేక్ ఫాస్ట్ సరిగ్గా లేదని ప్లేట్లు విసిరేసాడు అన్నాడు విక్రమ్ మెల్లగా
అవును రా!! మనం ఆఫీసులో కాస్త జాగ్రత్తగా ఉండాలి లేకపోతే అంతే అన్నాడు వినయ్
అప్పుడే మధ్యలో ఉన్న కార్ డోర్ ఓపెన్ అయ్యింది బ్రాండెడ్ బ్లాక్ సూట్,, కళ్ళకి రేబాన్ గ్లాస్సెస్ వేసుకొని రుద్రదేవ్ కారు దిగాడు
అతని చూపుల్లోనే ఒక పవర్ఫుల్ గాంబిర్యం ఉంది అతని అడుగు చప్పుడికి ఆఫీస్ అంత నిశ్శబ్దంగా మారిపోయింది
అంజలి శృతి లిఫ్ట్ వైపు వెళ్తుండగా రుద్రదేవ్ తన తమ్ముళ్ల తో కలిసి అదే వైపు వస్తున్నాడు
అందరూ రుద్రదేవ్ కి సైడ్ ఇచ్చి తలల వంచుకుని నిలబడ్డారు కానీ!!!
మన అల్లరి పిల్ల అంజలి,శృతి తో ఏదో జోక్ చెప్తు నవ్వుతూ వెనక్కి చూడకుండా లిఫ్ట్ వైపు అడిగేసింది
అంతే దబ్ అంటూ అంజలి చేతిలో ఫైల్స్ అన్ని కింద పడిపోయాయి అంజలి నేరుగా రుద్ర గుండెలను ఢీ కొట్టింది….
రుద్ర కళ్ళజోడు తీసి తిక్షణ మైన చూపులతో అంజలి వైపు చూసాడు
ఆఫీస్ స్టాప్ అంతా ఊపిరి బిగబెట్టారు అమ్మో!! ఈరోజు ఈ అమ్మాయి పని అయిపోయింది
మొదటి రోజె బాస్ ని డీ కొట్టింది అని మనసులో అనుకున్నారు..
శృతి భయంతో కళ్ళు మూసుకుంది విక్రమ్ వినయ్ సీరియస్గా చూస్తూనే లోపల అబ్బాయి పిల్లకి మూడిందిరా ఈరోజు అని అనుకున్నారు
రుద్ర బేస్ వాయిస్ తో కళ్ళు నెత్తికి కాయ చూసుకొని నడవలేవ అన్నాడు!!!
అంజలి కింద పడ్డ ఫైల్స్ అందుకుని రుద్ర కళ్ళల్లోకి నేరుగా చూస్తూ హలో మిస్టర్ నేనొక్కదాన్నే కాదు మీరు కూడా నడుస్తున్నారు
ఢీకొన్నప్పుడు ఇద్దరి తప్పు ఉంటుంది అయినా ఇంత పెద్ద ఆఫీస్ పెట్టుకుని దారిలో నిలబడితే ఎలా సైడ్ ఇవ్వాలి కదా!!! అంది
ఆ మాట వినగానే రుద్ర ముఖం కోపం తో ఎర్రబడింది..
రుద్ర కళ్ళల్లోకి చూసి ఇంత ధైర్యంగా మాట్లాడిన వ్యక్తి ఎవ్వరూ లేరు
రుద్ర కలలో కోపం సెగలు కక్కుతుంది ఆఫీస్ హాల్లోని ఏసీలు అన్ని ఆన్ చేసి ఉన్న అక్కడ వాతావరణం మాత్రం ఒక్కసారిగా వేడెక్కిపోయింది
రుద్ర తన చూపులతోనే అంజలిని భస్మం చేసేలా చూసాడు
కానీ!!! అంజలి మాత్రం చేతులు కట్టుకొని ఏమాత్రం భయం లేకుండా అతని సమాధానం కోసం ఎదురుచూస్తుంది
వెనకాల శృతి దేవుడా!!! ఈరోజుతో మాకు నూకలు చెల్లిపోయాయీ అని తల పట్టుకుంది..
విక్రమ్ మెల్లగా వినయ్ చెవిలో ఈ పిల్లకి మూడింది అన్నయ్య కళ్ళలో కి చూసి లెఫ్ట్ అండ్ రైట్ ఇస్తుంది
తన కీ ఒక దండం పెట్టాలి రా బాబు అన్నాడు….
రుద్ర అంజలి వైపు వంగి బేస్ వాయిస్ తో నా సామ్రాజ్యంలోకి అడుగుపెట్టి నాకే రూల్స్ చెప్తున్నావా!!!
నీ పేరేంటి అసలు నువ్వు ఇక్కడికి ఏం? చేస్తున్నావ్ అన్నాడు..
నా పేరు అంజలి!!!హెచ్ఆర్ డిపార్ట్మెంట్లో ఈరోజే జాయిన్ అయ్యాను అని చాలా కాన్ఫిడెంట్ గా చెప్పింది
వెంటనే రుద్ర పెదవులపై ఒక క్రూరమైన నవ్వు మెరిసింది
రూల్స్ మాట్లాడే నీకు ఈ ఆఫీస్ రూల్స్ ఏంటో ఈరోజు చూపిస్తాను.!!! మొదట రోజె బాస్ తో వాదించిన నందుకు నీకు ఇన్స్టాంట్ పనిష్మెంట్!!!! అన్నాడు
కంటిన్యూ….
Swipe left/right or tap the sides to turn pages