డియర్❤️🔥బీస్ట్ – 1
___ఓం___
ఢిల్లీ…
దేశానికి రాజధాని మాత్రమే కాదు.
దేశం మొత్తం తెలిసిన గొప్ప గొప్ప వాళ్లకి కేంద్ర స్థానం.
రాజకీయ నాయకులు, బడా బడా బిజినెస్ బాబులు, పేరు మోసిన పెద్దపెద్ద వాళ్లు.. అందరూ ఈసారి కూడా అవాక్కయ్యారు.
ఇది ఢిల్లీ వరకు మాత్రమే కాదు, దేశంలోని ప్రధాన నగరాలను, పెద్దపెద్ద పారిశ్రామిక వెత్తలను మళ్లీ ఒకసారి కుదిపేసింది.
ఆశ్చర్యపోవడమే కాదు కుల్లుకున్న వారు ఉన్నారు, వారసుల్ని పిలిచి ఇది మీకెందుకు చేతకాలేదు అని చివాట్లు పెట్టిన వాళ్ళు ఉన్నారు.
అల్లుడుగా చేసుకుంటే క్రెడిట్ మొత్తం మనదే కదా అని టాప్ లిస్టులో ఉన్న తండ్రులు అందంగా ఉన్న తమ కూతుర్లని చూసి మురిసిపోతున్నారు.
హి ఇస్ ది రైట్ పర్సన్ అని ప్యూర్ హార్ట్ తో అప్రిషియేట్ చేసిన వాళ్ళు ఉన్నారు, హి ఇస్ మై ఇన్స్పిరేషన్ అని మోటివేట్ అయిన వాళ్ళు ఉన్నారు.
రాజకీయాల్లోకి తీసుకుంటే ఆ ఫేమ్ మనకేమైనా యూస్ అవుతుందా అని మరొకసారి చర్చలు జరిపారు రాజకీయ నాయకులు.
ఇదంతా ఒక్కరి గురించే.. బిజినెస్ క్లాస్ వరకే కాదు, నేషనల్ న్యూస్ పేపర్స్ ఫ్రంట్ పేజ్ లో మెయిన్ కాలామ్ మొత్తం అతని గురించే.
దట్ ఇస్ ద వన్ అండ్ ఓన్లీ పర్సన్ మోస్ట్ హ్యాండ్సంమ్ అండ్ బిజినెస్ ఇన్నోవేటర్ ఆఫ్ ది ఇయర్ రుద్రాన్ష్ మెహతా.
నేషనల్ ఇంటర్నేషనల్ బిజినెస్ న్యూస్ చానల్స్ హెడ్ లైన్స్ లో కంటిన్యూస్ గా స్క్రోల్ అవుతుంది ‘EY ఎంటర్ ప్రెన్యూర్ ఆఫ్ ది ఇయర్ రుద్రాన్స్ మెహతా’.
ఇండియాలోనే యువ పారిశ్రామికవేత్తలకు అత్యంత ప్రతిష్టాత్మకంగా ఇచ్చే అవార్డు.. ‘EY ఎంటర్ప్రెన్యూర్ ఆఫ్ ది ఇయర్’.
కొత్త కొత్త ఇన్నోవేటివ్ ఐడియాస్ తో భారతదేశం గర్వించదగ్గ యువ పారిశ్రామికవేత్తలలో వరుసగా రెండవసారి నిలిచాడు రుద్రాన్ష్ మెహతా.
జైపూర్…
మామ్ ఆర్ యు కిడ్డింగ్ మీ.. నా ముందు నువ్వు వాడిని అప్రిషియేట్ చేస్తున్నావ్ అంటూ తల్లి చేతిలోని పేపర్ లాక్కొని చిత్తుచిత్తుగా చించి విసిరేసిన అన్వీర్ సక్ససేనా ముఖం ఎర్ర ఉల్లిగడ్డల ఉడికిపోతుంది.
బెస్ట్ ఆఫ్ బెస్ట్ ఎవరి దగ్గర ఉన్న నేర్చుకోవాలి, అందుకోవాలి. టేక్ ఇన్నోవేషన్ తో లాస్ట్ ఇయర్ ‘నేషనల్ ఎంటర్ పెన్యూర్షిప్’ అవార్డ్ విన్నర్ గా నిలిచాడు.
వన్ ఇయర్ గ్యాప్ లోనే జస్ట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన స్టూడెంట్స్ తో ఇండియా వైడ్ టెక్ ఎక్సలెన్స్ సాధించాడు, అవార్డు విన్నర్ గా నిలిచాడు.
అప్పుడు అందరూ రిస్క్ అన్నారు, ఆ గొంతులో నువ్వు కూడా ఉన్నావు అన్వీర్. ఇట్స్ ఏ లాడర్ అన్వీర్, డోంట్ లూస్ యువర్ టెంపర్.
కీప్ ఇన్వెస్ట్ ఇట్ ఇన్ ఎ రైట్ వే, నెక్స్ట్ ఇయర్ డెఫినెట్ గా సాధిస్తావు అని భుజం తట్టి వెళ్లిపోయింది అన్వీర్ మదర్ అనుపమ.
లాస్ట్ ఇయర్ కూడా సేమ్ చెప్పావు మామ్ అని వెళుతున్న తల్లి ని పళ్ళు పటపటలాడిస్తూ చూస్తున్న అన్వీర్ బ్రెయిన్ లో కుక్కర్లో ఉన్నంత ప్రెషర్ ఉంది.
వెంటనే ఎవరికి కాల్ చేసి మాట్లాడి అది మరింత పెంచుకున్నాడు అన్వీర్.
ఫస్ట్ నుంచి రుద్ర కి బెస్ట్ రైవల్ కాంపిటేటర్ అన్వీర్. రుద్రని పడగొట్టాలి ఓడించాలి అని మాత్రమే టార్గెట్ పెట్టుకున్న అన్వీర్ రుద్ర అచీవ్మెంట్ ఏం మాత్రం డైజెస్ట్ చేసుకోలేకపోతున్నాడు..
మళ్ళీ రుద్ర ఇండియా బెస్ట్ యంగ్ ఎంటర్ పెన్యూర్ అవార్డు కి ఎలక్ట్ అవడం.
అన్వీర్ దృష్టిలో బిజినెస్ అంటే దేశ అభివృద్ధికి సంబంధించింది కాదు.. అది సంపద సృష్టించే ఒక యుద్ధం. అది బిజినెస్ చేసే సంపాదించాలి అని కూడా వాడికి ఉండదు.
ముందున్న వాడిని పడగొట్టాలి, ఆ ప్లేస్ మనం సాధించుకోవాలి. దీనికోసం ఏం చేసిన తప్పు లేదనే భయంకరమైన మెంటలాటి అన్విర్ ది.
వీడు తప్ప ఇండియాలో ఇంకెవరు కనిపించడం లేదా.. దీనిని ఎలా మార్చాలి..?? అని పిడికిలి బిగించాడు అన్వీర్.
నత్త నడకతో దగ్గరికి వచ్చి పిల్లిలా వినయం చూపిస్తూ దీనికి రెండు ఆప్షన్స్ ఉన్నాయి సార్ అని పిఏ పాయింట్ చేయడమే సర్రున చూశాడు.
ఆ కళ్ళల్లో కోపంతో పాటు భరించలేని అసూయ ఇంకా చెప్పమని మీనింగ్ కొట్టొచ్చినట్టు కనిపిస్తుంటే.. ఇప్పటికిప్పుడు రుద్ర ముసలోడు అయిపోవాలి, లేదా రుద్ర కంప్లీట్ గా బిజినెస్ ఇండస్ట్రీ నుంచి తప్పుకోవాలి.. అని నిజాన్ని చిన్న గొంతుతో భయపడుతూ చెప్పాడు.
యు ఆర్ రైట్.. వాడు ఇప్పటికిప్పుడు ముసలోడు అయిపోతే నా విన్నింగ్ ఎవరు చూస్తారు..?? ఇన్ మై వే సెకండ్ ఆప్షన్ ఇస్ బెస్ట్.. నెక్స్ట్ ఇయర్ ఈ అవార్డు నాది అని కంఠపదంగా చెప్పి కసిగా లోపలికి వెళ్ళాడు అన్వీర్.
సెకండ్ ఆప్షన్ బెస్టా..?? భయంతో కలిసిన నమ్మసక్యం కాని ఒక ఆశ్చర్యం వాడి ముఖంలో.
దట్స్ మీన్ బిజినెస్ ఇండస్ట్రీ నుంచి రుద్రాన్ష్ మెహతా ని తప్పిస్తారా.. అంత ఈజీనా..?? అని తలుచుకుంటూనే షాక్ లో స్టక్ అయిన పీఏ బాడీ సన్నగా ఫీవర్ అవుతుంది.
మండే సూర్యున్ని అరి చేతిలో పట్టుకుని ఆడుకోవడం సాధ్యమయ్యే పనేనా.. ??
చూద్దాం ఆ చోద్యం కూడా అనుకున్నాడు పిఎ.
పరశురాముడు సంధించి వదిలిన పశుపతి అస్త్రంలా ఉంటాడు రుద్రాన్ష్ మెహతా.
అటువంటి అస్త్రాన్ని ఢీకొట్టడం అంటే చిన్న విషయం కాదు.
వాడిగా వేడిగా చురకత్తిలాంటి చూపులతో ఉండే రుద్రాన్ష్ కళ్ళల్లో దూసుకు వచ్చే తారాజువ్వల్లాంటి ఒక మెరుపు ఉంటుంది ప్రతిక్షణం.
ఆస్తుల గురించి ఐశ్వర్యం గురించి లెక్క ఉండదు. అనుకున్నది సాధించడానికి నిరంతరమైన కఠోర శ్రమని ఇన్వెస్ట్ చేస్తాడు.
నమ్మిన వాళ్లకి అక్షయపాత్ర లాంటి వాడు, ఆదర్శంగా తీసుకున్న వాళ్లకి అత్యుత్తమమైనవాడు, తోడ కొట్టి ఎదురు నిలబడ్డ వారికి తెగ నరికే పలనాటి కత్తి లాంటివాడు.
ππππππππππππππππππππππππππππππππππ
కొత్త కధ కొత్త కథనతో పరిచయం చేస్తున్నాను..
ఆల్రెడీ పట్టాలు ఎక్కించాను.
మీ జడ్జిమెంట్ బేస్ చేసుకుని ఆలస్యంగానా, త్వరలోనా, అతి త్వరలోనే అనేది డిసైడ్ చేసుకుంటాను.
జస్ట్ రుచి చూడమని రెండు ముక్కలు ముందు పెట్టాను మీ డెసిషన్ చెప్పండి..
ఇంకా కామెంట్స్ రూపంలో చెప్పే మీ అభిప్రాయం నా ఐడెంటిటీని వెలుగులోకి తీసుకొస్తుంది. ఈ ఒక్క ఎపిసోడ్కే కాదు స్టోరీ చివరి వరకు మీ కామెంట్స్ మిస్ చేయొద్దు.
ఆల్రెడీ రన్నింగ్ లో ఉన్న వాళ్ళకి ఐడియా ఉండే ఉంటుంది. నేను ప్రతి ఎపిసోడ్ కి రిక్వెస్ట్ చేయడం, బ్రతిమలాడటం, బెదిరించడం బ్లాక్మెయిల్ చేయడం లాంటివి పెట్టుకోను.. రాసుకుంటూ పోతాను.
మీరు ఇచ్చే కామెంట్స్ ప్రతి రచయితకి గుర్తింపుతో పాటు ఉత్సాహాన్ని కూడా అందిస్తుంది.
ఇది మీ బాధ్యత.. అభిమానం చూపించడం అంత కష్టం కాదనుకుంటా..🤔 మిస్ చేయకుండా ప్రతి ఎపిసోడ్ కి కామెంట్స్ కొట్టేయండి
కామెంట్స్ మస్ట్.
వర్ణ.__
Swipe left/right or tap the sides to turn pages