నాకోసం కాదు అని రుస రుసలాడుతూనే రమ్య స్నానం చేయడానికి వెళితే నువ్వు నాకు ఎంత స్పెషల్.. తీసుకువెళ్లాక నీకు తెలుస్తుంది అని రమ్య ఉక్రోసానికి నవ్వుకొని తన డ్రెస్ కి మ్యాచింగ్ జువెలరీ తీసి పెట్టి హాల్లోకి వచ్చి ఫ్రెండ్స్ కి ఫోన్ చేశాడు ప్రదీప్.
ఫ్రెష్ అయ్యి బయటకు వచ్చిన రమ్య కి జ్యువెలరీ సెట్ తో ఉన్న కొత్త డ్రెస్ చూసి ఒకసారి ప్రతి చిన్న విషయంలో పేరు తీసుకుంటూ ఇంతగా ప్రేమిస్తాడు ఒక్కోసారి ఎంత ఏడ్చిన పట్టించుకోడు అసలు ఏమైంది వీడికి?
ఎందుకు నాకు ఈ మెంటల్ టార్చర్ అని ప్రస్టేట్ అవుతూనే డ్రెస్సప్ అయి హెయిర్ సెట్ చేసుకుంటుంటే లోపలికి వచ్చాడు ప్రదీప్.
తన ట్రెడిషనల్ కుర్తా కి మ్యాచింగ్ గా తీసుకొచ్చిన కలంకారి ఎత్నిక్ వేర్ లో కుందనపు బొమ్మలా ఉంది రమ్య. కళ్ళు తిప్పలేనంత అందంగా ఉన్న భార్యని ప్రేమగా చూస్తూ దగ్గరికి వచ్చి వెనుక నుంచి నడుము చుట్టుకున్నాడు ప్రదీప్.
అతని స్పర్శ ఫీలవుతూ కళ్ళు మూసుకొని ఏం చేస్తున్నావ్ అంది చిరు కోపంగా.