ఎపిసోడ్ 33
నాకు తెలిదా, నాకు తెలీదా,” పళ్ళు బిగించి అన్న స్వప్నికను మరీ అన్నట్టు ఆశ్చర్యంగా చూసాడు విజె.
“నా పైటకున్న సేప్టీ పిన్ను ఇక్కడ భుజం పైన గుచ్చుకుంటుంది.” అని బాధగా చెప్పిన స్వప్నిక భుజాన్ని చూసాడు వీజె.
అవును పాపం. సేఫ్టీ పిన్ను సగానికి ఊడి బ్లౌజ్ లో చిక్కుకుంది. ఆ ఊడిన చివర వాడిగా ఉండటంతో మధ్య మధ్యలో గుచ్చుకుంటుంది.
అప్పటికే ఆ ప్రాంతంలో ఎల్లో బ్లౌజ్ కాస్త రక్తంతో రంగు మారింది.ఆమె నొప్పితో విలవిలలాడటం తట్టుకోలేక పోయిన విజె…
“ఒక్క నిముషం. నన్ను చూడని” అని తన చేతిని భుజం పైకి జాపాడు.