New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more
నువ్వే నాకు ప్రాణం(My Soul.. My Life) – 4

నువ్వే నాకు ప్రాణం(My Soul.. My Life) – 4

ఎపిసోడ్ 4

ముగ్గురు సాయంకాలం జరిగే ప్రోగ్రాం గురించి మొత్తం మాట్లాడుకునీ, ఇంకా ఏవైనా పెండింగ్  వర్క్స్ ఉన్నయా అని చెక్ చేసుకున్న  తరువాత..

 

 సాయంత్రం ఆరు గంటల వరకు  ప్రోగ్రాం వెన్యూ దగ్గర కలుసుకుందామని అనుకున్న తర్వాత.. స్వప్నిక తన కారులో, మురళి బైక్, కావ్య తన స్కూటీ పై  ఎవరిళ్ళకు వాళ్ళు వెళ్ళిపోయారు.

 

స్వప్నిక మల్లికా మేడం కి ఒక గిఫ్ట్ కొనాలని ఆలోచిస్తూ,. ఆమె  ఒక గిఫ్ట్ కార్నర్ కోసం దిక్కులు చూస్తుంటే 

 

ఆ షాప్ రోడ్డుకు ఆవలి వైపు కనిపించగా, యూటర్న్ తీసుకోవడానికి టైం పడుతుందని అటు వైపు కారాపింది.

 

 స్వప్నిక. రోడ్డు దాటాలని జీబ్రా లైన్స్ కోసం చూస్తే అవి అక్కడెక్కడో కనిపించగా అలిసిపోయిన ఆమె వాటి వరకు  నడిచే ఓపిక లేక, 

 

మెల్లగా అటూ ఇటూ చూస్తూ రోడ్డు దాటుతున్న స్వప్నికా, ఇంకో రెండు అడుగులు వేస్తే షాప్ లోకి అడుగుపెట్టేదే. 

 

 

కాని ముందు ఆగి ఉన్న కారు డోర్ సడెన్ గా తెరుచుకుని అందులో నుండి ఎవరో దిగారు. 

 

ఇంతలో వెనుక నుండి ఒక కారు దూసుకుని వస్తుంది.. అంతే ఒక్కసారిగా కెవ్వున కేక వినిపించింది.

 

ఆమెని ఎవరో వాళ్ళ వైపు బలంగా లాక్కునట్డనిపించి

భయంతో స్పృహ తప్పి పడిపోయింది స్వప్నిక.. అంతే..

ఆమెను తట్టి లేపాలని చూసాడు అతను. చలనం లేదు. 

 

“హలో” అని ఆమె చెంపలపై తట్టినా, స్వప్నికలో చలనం లేకపోవడంతో వెంటనే కారు వెనక డోరు ఓపెన్ చేసి ఆమెను పడుకోబెడుతూ,

 

“ఛ, ముందే లేటయ్యిందంటే మధ్యలో ఇదొకటి.” అని విసుక్కున్న అతను, కారును సర్రున హాస్పెటల్  ముందు ఆపాడు.

 

 వెంటనే కారు దిగి వెనుక డోర్ నుండి స్వప్నికను రెండు చేతుల్లో అమాంతం అవలీలగా ఎత్తుకుని కార్ డోర్ ని కాలితో వేస్తూ, 

 

అలాగే హాస్పటల్ లోకి అడుగు పెట్టిన అతని గ్రీకు శిల్పం లాంటి ఆరడుగుల దృఢమైన శరీరంతో మోడల్ లా అందంగా ఉన్న అతన్ని అక్కడి వాళ్ళు అందరూ ఆశ్చర్యంగా చూసారు.

 

 అవుట్ ఫిట్, బ్లాక్ సూట్ లో లైట్ బ్లూ కలర్ షర్ట్ తో చాలా ఖరీదైన మోడ్రన్ ఎక్ససరీస్ తో  కనబడుతున్న అతను చాలా డబ్బున్న వాడని చూడగానే తెలుస్తుంది. 

 

అతని చేతుల్లో అందమైన నాజూకైన శరీరంతో చందనపు బొమ్మలా ఉన్న స్వప్నికను చూసి కళ్ళు తెలేసారు.

 

“భార్యాభర్తలనుకుంటా. ఇద్దరూ మేడ్ ఫర్ ఈచ్ అదర్ లా ఉన్నారని అక్కడ ఉన్న వాళ్ళంతా చెవులు కొరుక్కున్నారు.

 

అతను ఆమెను అక్కడ పక్కనే ఉన్న స్ట్రెచర్  పైన పడుకోబెట్టి రిషెప్షన్ దగ్గరికి వెళ్ళగా, అతనికి ఒక ఫాం ఇస్తూ, “దాన్ని ఫిల్  చేయండి సర్” అని చెప్పి ఇంటర్ కమ్ లో డాక్టర్ కి ఫోన్ చేసింది.

 

అతను ఆ ఫాం ని అక్కడే పెట్టి స్వప్నికని పడుకోబెట్టిన స్ట్రచర్  దగ్గరికి వచ్చి నిలబడ్డాడు.

 

ఇంతలో అతని దగ్గరికి డాక్టర్ వచ్చీ, 

“చూడండి మిస్టర్, ఈ ఫాం ఫిల్ చేయండి “ అని మళ్ళీ తన చేతికి  ఇచ్చిన ఆ ఫామ్ వైపు  విచిత్రంగా చూస్తు

 

“ఇదేంటి” అని అడిగాడు.

 

దానికి డాక్టర్ ఆశ్చర్యంగా,

“ఇదీ తెలియదా, ఒక వైపు మీ వైఫ్ అన్ కాన్షెష్ అయ్యి పడి పోయింది. తొందరగా ట్రీట్మెంట్ ఇవ్వాలి‌. ఈ ఫాం ఫిలప్ చేసి ఇవ్వండి.” అని అంటాడు డాక్టర్.

 

 

 

అతనికి ఆ డాక్టర్ మాటలు కోపం తెప్పించడంతో,.

“వాట్ డూ యు మీన్?” అని అన్నాడు.

 

“అంటే మీరు ఈ ఫాం ఫిలప్ చేయకపోతే ఇక్కడ ట్రీట్మెంట్ ఇవ్వడం కష్టం” అని చెప్పాడు డాక్టర్.

 

“అది కాదు డాక్టర్, తనెవరో నాకు తెలియదు. నా కారు డోరు తాకి రోడ్డు మీద ఆన్ కాన్షెష్ అయి పడిపోతే తీసుకొచ్చాను.” అని చెప్పాడు అతను.

 

 

అది విన్న డాక్టర్ కళ్ళు పెద్దగ తెరిచీ,.

” ఏంటి? కారు డోర్ తాకీ అన్ కాన్షస్ అయ్యిందా? అయితే  ఇది యాక్సిడెంట్ కేస్. సిస్టర్, ట్రీట్మెంట్ ఆపండి.” అని అరిచాడు డాక్టర్.

 

అతనికి టైం లేదు. త్వరగా వెళ్ళాలి. మాటిమాటికి వాచ్ చూసుకుంటున్న అతను,

 

“సరే, ఇవ్వండి” అని చిరాగ్గా డాక్టర్ చెప్పిన చోట సంతకం పెట్టి ఫాం ఫిల్ చేసి ఇచ్చాడు.

 

తరువాత ఒక రూమ్ నెంబర్ చెప్పి స్ట్రెచర్ పై స్వప్నిక తో పాటు అతన్ని కూడా వెంట రమ్మని తీసుకు వెళ్ళాడు డాక్టర్.

 

“మీరు కొద్ది సేపు ఆమె దగ్గర ఉండండి. పాపం, మీ వల్ల పానిక్ అయ్యింది.” అని అక్కడి నుండి వెళ్ళిపోయాడు డాక్టర్. 

 

 

అక్కడ బెడ్ పక్కన కుర్చీలో కూర్చుని 

షిట్ అని పక్కన ఉన్న స్టూల్ ని ఒక్క తన్ను తన్నగా అది బర్..ర్ మని సౌండ్ చేయడంతో, ఆ సౌండ్ కీ స్వప్నిక కదిలింది.

 

కొంచెం బెడ్ చివరకు వచ్చి కింద పడబోయిన ఆమెను చూసిన అతను వెంటనే తను కింద పడుతుందని లేచి స్వప్నికను

 

 పట్టుకుని జాగ్రత్తగా బెడ్ పైకి జరిపి పడుకోబెట్టడంతో,  ఆమెను తాకగానే అతనిలో చిత్రమైన వైబ్రేషన్స్ మొదలయ్యాయి.

 

 సడెన్గా, స్వప్నిక అతని కాలర్ పట్టుకుని తన పైకి లాక్కోవడంతో  ఆమె  చేసే పనికి ఆశ్చర్యంగా  తన కాలర్నీ స్వప్నిక చేతుల్లోంచీ  

 

వదిలించుకోడానికి ట్రై చేస్తూ ఆమె ఇంకా స్పృహలోకి రాకపోవడంతో, అతని కళ్ళు ఆమె మొఖాన్ని మొత్తం స్క్యాన్ చేసాయి.

 

 పచ్చగా మెరిసిపోతున్న నుదుటిపై, చిన్న నల్లని బొట్టు, పొడవుగా  వంపు తిరిగిన ఐబ్రోస్, 

 

వాటి కింద,  మూసుకుని ఉన్న ఒత్తైన కనురెప్పల చాటున అరమోడ్పు పెద్దపెద్ద కళ్ళు, నున్నని చెంపలు, మెరుస్తున్న ఎర్రని పెదవులు చూస్తుంటే అద్భుతమైన సౌంధర్యరాశిలా ఉంది.

 

“ఏయ్ ఎక్కడికి? నన్ను వదిలి మళ్ళి వెళ్ళిపోతున్నావా? ప్లీజ్ వెళ్ళకు.” అని స్వప్నిక అతన్ని ఇంకా దగ్గరగా లాక్కుంది. 

 

ఆమె అలా లాగగానే అతను  స్వప్నికపై పడిపోయాడు. ఆమె బాడీ ఫ్రాగ్నెన్స్ అతన్ని మత్తులోకి నెట్టేస్తుంటే  ఆమె పెదవులు అతని బుగ్గల పైన, చెవి పైన తాకీ, అతని మెడ వంపులో దూరి దాక్కున్నాయి. 

 

తడి తడిగా పెదవుల తాకిడి అతనికి ఆ స్పర్ష ఏదోలా అనిపించీ, అతని  నరనరాన కరెంట్ పాకినట్టు ఒళ్ళంతా వేడి సెగలు కక్కినట్టనిపించడంతో, 

 

ఇప్పటి వరకు ఏ అమ్మాయి అతనికి ఇంత దగ్గరగా వచ్చింది లేకపోవడంతో అతను ఒక ట్రాన్స్ లో ఉన్నట్టు అలాగే ఉండిపోగా, కొద్ది సమయం తరువాత ఆమె మళ్ళీ నిద్రలోకి జారిపోయింది. 

 

స్వప్నిక నుండి తన కాలర్ ని మెల్లిగా విడిపించుకుని లేచిన అతనికి ఎందుకో ఆమెను వదిలిపెట్టాలని అనిపించక అక్కడ డాక్టర్ కోసం ఎదురుచూస్తూ కూర్చున్న  అతని కళ్ళు ఆమెను తడముతూ ఉన్నాయి.

 

ఇంతకీ అతను ఎవరు? ఈ పరిచయం ఇద్దరిని ఎక్కడి వరకు తీసుకెళుతుంది?? తెలుసుకోడానికి తరువాతి ఎపిసోడ్ చదివి.. మీ రేటింగ్స్‌ కామెంట్స్ తో నన్ను సపోర్ట్ చేయండి..థ్యాంక్యూ..

(ఇంకా ఉంది)